పంచాంగం
తేది 28నవంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హేమంత
పక్షం : శుక్లపక్షము
వారము: సోమవారం
తిథి : పంచమి సా.6.12 వరకు
నక్షత్రం :. ఉత్తరాషాడ మధ్యాహ్మం 3.25 .నివరకు
వర్జ్యం: రాత్రి 7.07 ల 8.37 వరకు
దుర్ముహూర్తం:మ.12.10ని. నుండి మ.01. 54ని. వరకు తిరిగి మ.02.22ని. నుండి మ.03.07ని. వరకు
రాహుకాలం:మ.01.30ని నుండి మ.03.00ని వరకు
యమగండం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.14ని.లకు
సూర్యాస్తమయం: సా.05.20ని.లకు
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
Zodiac Sign
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులుగా ఉండును. మానసికంగా బలహీనంగా ఉంటుంది . అనవసరమైన ఖర్చులు ఏర్పడవచ్చును.వృత్తి వ్యాపారంలో ఉందో కష్టానికి ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములు లభించును. సంతానమునందుప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు . మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందించండి. సంఘమునందు చేయ వ్యవహారములు తెలివిగా వ్యవహరించవలెను . శ్రీవారి సందర్శనం శుభప్రదం.
Zodiac Sign
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆదాయ మార్గాలు బాగుంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబం నందు శుభకార్య ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూడండి. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గూర్చి ఆలోచనలు చేస్తారు. సూర్య నమస్కారం వల్ల శుభఫలితాలు ఉంటాయి.
Zodiac Sign
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో గడుపుతారు. మనఃస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది.వ్యాపారులో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చేయ పనుల యందు సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను. ఇతరులతోటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. భూగ్రహ కరవేకర్యాలు లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది . శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం శుభకరం.
Zodiac Sign
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి . అనవసర ఖర్చులను పెరగకుండా తీసుకోవాలి. కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో టి పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. అనవసర ఆలోచనతో టి సమయాన్ని వృధా చేయకండి. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.
Zodiac Sign
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. నూతన పరిచయాలు లాభం కలిగించును.చెడు ఆలోచనలకు దూరంగా ఉండండివృత్తి వ్యాపారలయందు కష్టపడిన ధన లాభం కలుగును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చ చేస్తారు.ఉద్యోగమనందు సహోద్యోగులు నుండి మంచి సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంఘము నందు నీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.
Zodiac Sign
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను . ఇంకా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతోటి మనస్పర్ధలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును . ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు యందు జాగ్రత్తవసరం. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు. సూర్య ఆరాధన శుభప్రదం.
Zodiac Sign
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకుని చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన బకాయిలను వసూలు చేసుకోవాలి. పోయిన వస్తువులు దొరకవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. భూ గృహ క్రయ విక్రయాలు అనుకూలం. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత లభించును.శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
Zodiac Sign
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందని. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.
Zodiac Sign
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఉద్యోగమునందు అధికారుల యొక్క పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.
Zodiac Sign
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
కోపాన్ని అదుపులో ఉంచుకొని వలెను. వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సూర్య ఆరాధన శుభప్రదం.
Zodiac Sign
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ఖర్చులు చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవును. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా జరుగును .అనవసరమైన ఆలోచనలు తోటి వృధాగా కాలాన్ని గడపకండి. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును. ఇతరులతోటి వాదనలు మానండి. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తగా తీసుకొనవలెను.శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.
Zodiac Sign
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
అనవసర ప్రయాణాలు. మానసికంగా బలహీనంగా ఉంటుంది. ఇతరులతోటి వాదనకు దూరంగా ఉండండి. కొన్ని సంఘటనలు మన బలాన్నిపెంచుతాయి.పెట్టుబడులు లాభిస్తాయి.చేయ పనులు యందు ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్యము నందు జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారం నందు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.