ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం

First Published | Apr 28, 2023, 4:47 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు  అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిలిచిపోవును. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం:                                                                                                                                                                       

తేది :  28    ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖం
ఋతువు : వసంత ఋతువు 
పక్షం :-  శుక్ల పక్షమ                                                                                     
వారము:- శుక్రవారం
తిథి :- అష్టమి మధ్యాహ్నం 2.56 ని.వరకు
నక్షత్రం :- పుష్యమి ఉదయం 9.09 ని.వరకు
యోగం:- శూలము ఉ॥9.09 ని.వరకు
కరణం:- బవ ప॥2.56 బాలవ తె.3.58 ని.వరకు
అమృత ఘడియలు:-లేవు
వర్జ్యం:-
దుర్ముహూర్తం:ఉ.08.10ని. నుండి ఉ.09.01ని. వరకు తిరిగి మ.12.22ని. నుండి మ.1.12ని. వరకు
రాహుకాలం:ఉ.10.30ని. నుండి మ.12.00ని. వరకు
యమగండం: మ.3.00ని. నుండి సా.4.30ని. వరకు

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఉద్యోగం నందు ఒత్తిడి తొలగించుకుని ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారం నందు అనుకోని లాభాలు పొందగలరు. మొండి బాకీలు వసూలు అగును. కొన్ని సమస్యలు పరిష్కారమగును. అలంకార వస్తువులు కొనుగోలు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు. శారీరక మానసిక చికాకులు ఏర్పడతాయి. సమాజంలో హోదా గౌరవం పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
మనస్సు నందు ఆందోళనగా ఉండను. అనవసరమైన ఖర్చులు పెరుగును. ప్రయత్నించిన పనులలో ఆటంకాలు ఏర్పడి నిలిచిపోవును. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు. చేయు వ్యవహారము నందు ఓర్పు సహనం అవసరము. కొన్ని విషయాలు అసంతృప్తిని కలిగిస్తాయి. ఇతరులతోటి అకారణంగా కలహాలు ఏర్పడగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అనజపేయించండి శుభ ఫలితాలు పొందండి

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శుభ కార్యరూపణ ధనాన్ని ఖర్చు చేస్తారు. వృత్తి వ్యాపారములు యందు ధనలాభం కలుగుతుంది. గృహానికి సంబంధిత అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులన్నీ జయప్రదంగా చేస్తారు. సమాజము నందు గౌరవ హోదాలు పెరుగును. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా సాగును. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం. సమాజము నందు గొప్ప వారితో పరిచయాలు కలిసి వస్తాయి. శుభకార్యాల ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో కొద్దిపాటి పట్టుదల చేసినట్లయితే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారంలో లాభసాటిగా జరుగును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.బంధుమిత్రుల యొక్క కలయిక. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ మహా విష్ణువే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.  ఆచితూచి ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి  గౌరవం లభించును.వృత్తి వ్యాపారమునందు లాభం కలుగుతుంది. అవసరాలకు గృహమునందు ఆనందకరమైన వాతావరణము. మొండి బాకీలు వసూలు అగును. ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయు పని యందు అధిక శ్రమ ఒడిదుడుకులు ఉండును. సమాజము నందు దుస్సంఘటన వలన మనస్సునందు భయముగా నుండును. ఆరోగ్యం సమస్యలు రాగలవు. ఉద్యోగమునందు అధికారుల తోటి సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత లోపించును. వ్యాపారమునందు కొంతమేర నష్టం కలగవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓ మృత్యుంజయాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండవలెను. చేయు వ్యవహారమనందు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగము నందు చికాకులు సమస్యలు అధికమగును. మానసిక ప్రశాంతత లేకపోవుట. చేయు ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకొనడం వలన అనేక ఇబ్బందులు కలుగును.  అనవసర విషయాలకు దూరంగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
తలపెట్టిన పనులు అతి సులువుగానే పూర్తి చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. కుటుంబవనందు ఆనందకరమైన వాతావరణం. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారములు లాభసాటుగా జరుగును. ఉద్యోగమునందు అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ సంబంధ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
కుటుంబం నందు చికాకులగా ఉండును. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడను. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు ఏర్పడ గలవు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజము నందు అపవాదములు ఏర్పడగలవు. మానసిక ఆందోళనగా ఉండును. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయ నమః అను జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఊహించినంతగా ధన లాభం పొందుతారు. సంఘము నందు గౌరవ మర్యాదలు పొందుతారు. పెద్దల పరిచయాలు కలిసి వస్తాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెరుగును. నూతన వస్తు వాహనది కొనుగోలు చేస్తారు. అందరితో స్నేహపూర్వకంగా నడుస్తూ చేయ పనులను అనుకూలంగా చేసుకుంటారు.ఏ కుటుంబ సౌఖ్యం లభించును. సాంఘిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈరోజు ఈ రాశి వారు ఓం వాయు నందనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
చేయి వ్యవహారము నందు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులకు గురి అవుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలెను. వృత్తి వ్యాపారములందు సామాన్యంగా ఉంటాయి.  చేయు వ్యవహారమునందు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు లభించును. పాతపాకీలవారు వలన ఇబ్బందులు కలుగును. ఆరోగ్యం మందగించును. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి ‌.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తగు సమయానికి ధనం లభించును. వృత్తి వ్యాపార వ్యవహారములందు శ్రమకు తగిన ఆదాయం లభించును. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండవలెను. సమస్యలను మనోధైర్యంతోటి పరిష్కరించి కోని ముందుకు సాగుతారు. కృషికి తగిన గౌరవం గుర్తింపు లభించును. ఉద్యోగము నందు అనుకూలంగా ఉండును. తలచిన కార్యములు అవలీలగా పూర్తి చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓంరుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Latest Videos

click me!