Today Horoscope:ఈ రాశివారు కార్యక్రమాలలో విజయం సాధిస్తారు

Published : May 27, 2022, 04:44 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగంలో మేలుచేసేవారున్నారు. గొప్ప ఆలోచనలు వస్తాయి, సకాలంలో ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది.  అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. 

PREV
114
  Today Horoscope:ఈ రాశివారు కార్యక్రమాలలో విజయం సాధిస్తారు
Daily Horoscope 2022 - 07

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

214

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  

ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మంచి పనులు చేసి ప్రశంసలు పొందుతారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. బాధ్యతలను సకాలంలో పూర్తిచేయండి. అనుకున్న స్థానం లభిస్తుంది.  సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.

314

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. మనోబలంతో ముందుకుసాగండి. నిదానంగా మిత్రులతో కలిసి చేసే పనులు త్వరగా కార్యసిద్ధిని ఇస్తాయి. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.
 

414

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

అధికారుల ఒత్తిడి. అకారణంగా కోపం. తగినంత కృషి చేయండి. ప్రయత్నాలు ఫలించే సమయం. ఉద్యోగంలో మేలుచేసేవారున్నారు. గొప్ప ఆలోచనలు వస్తాయి, సకాలంలో ఆచరణలో పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది.  అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.

514

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

అనవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి.వ్యాపారంలో స్వల్ప విఘ్నాలున్నాయి. అసార్థాలకు అవకాశమివ్వకూడదు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి.  చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. తెరాస క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.

614
Leo Zodiac

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

అనవసరమైన ఆలోచనలు చేస్తారు.వ్యాపారంలో స్వల్ప విఘ్నాలున్నాయి. అసార్థాలకు అవకాశమివ్వకూడదు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఆనందించే అంశాలున్నాయి. కల నెరవేరుతుంది. విష్ణుసహస్రనామం చదవండి, శుభవార్త వింటారు. ఇతరులసహాయం తీసుకుంటారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. 

714

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

శుభవార్తలు వింటారు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మనసు పెట్టి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలున్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.  

814

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది. భవిష్యత్తును నిర్మించుకునే కాలమిది. సదవకాశాలు వస్తాయి.  ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలుంటాయి. స్థిరత్వం వస్తుంది. వ్యాపారబలం పెరుగుతుంది.  ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక.  

914

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి చేస్తారు.  వ్యాపార లాభాలుంటాయి. గత వైభవం సిద్ధిస్తుంది. తగినంత మానవప్రయత్నంతో సంకల్పాన్ని సాధించగలరు.  అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.
 

1014

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.

1114

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం, సమాజంలో పేరు లభిస్తాయి. ఇంట్లోవారి సూచనలను స్వీకరించాలి. విఘ్నాలు చికాకు కలిగిస్తాయి.  వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి.
 

1214

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

శుభవార్తలు వింటారు. లక్ష్మీఅనుగ్రహం లభిస్తుంది. ఆవేశపరిచే పరిస్థితులు ఉంటాయి. సంయమనాన్ని పాటించండిమొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.

1314


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.

1414
Daily Horoscope 2022 - 24

పంచాగం

27 మే 2022 శుక్రవారం

శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
కృష్ణపక్షం
ద్వాదశి మ.12:55ని.ల వరకు
అశ్విని నక్షత్రం రా.తె 03:21ని|| వరకు
వర్జ్యం రా.11:12ని.ల లగాయతు రా.12:52ని.లవరకు     
దుర్ముహూర్తం ఉ. 08:03ని. లగాయతు ఉ.08:55ని.ల వరకు తిరిగి మ.12:22ని‌ల లగాయతు మ.01:13ని.ల వరకు
రాహుకాలం ఉ. 10:30ని.ల లగాయతు మ. 12:00ని.ల వరకు
యమగండం మ. 03:00ని.ల లగాయతు సా.04:30ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:29ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:24ని.లకు.


 

Read more Photos on
click me!

Recommended Stories