ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈ రోజు ధనలాభం

ramya Sridhar | Updated : Sep 26 2023, 04:47 AM IST
Google News Follow Us

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును

113
ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి ఈ రోజు ధనలాభం
Sun visible in Cancer sign

26  సెప్టెంబర్ 2023,  మంగళ వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

పంచాంగం
 
తేది :   26సెప్టెంబరు  2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం  :- భాద్రపద మాసం
పక్షం :- శుక్ల పక్షం                                                                         
వారము:- మంగళవారం
తిథి :- ద్వాదశి రాత్రి 11.15 ని॥వరకు
నక్షత్రం :-    శ్రవణం ఉ॥7.45 ని॥వరకు తదుపరి  ధనిష్ఠ తె. 6.05 ని॥వరకు
యోగం:-  సుకర్మము ఉ॥10.58  ని॥వరకు
కరణం:- బవ మ॥12.27 బాలవ రాత్రి 11.15 ని॥వరకు
అమృత ఘడియలు:- రాత్రి 8.24 ని॥ల 9.53 ని॥వరకు
దుర్ముహూర్తం: ఉ॥ 08:16ని॥ల ఉ॥ 09:04ని॥వరకు  తిరిగి రా.10:41ని॥ల రా.11:29ని॥వరకు
వర్జ్యం:- మ॥11.29 ని॥ల 12.05 ని॥వరకు
రాహుకాలం: మ॥ 03:00ని॥ల సా॥ 04:30 ని॥వరకు
యమగండం: ఉ॥.9.00. ని॥ల ఉ॥  10:30 ని॥వరకు
సూర్యోదయం :        5.52 ని॥లకు
సూర్యాస్తమయం:    5.53  ని॥లకు

ఈరోజు తారాబలం వీటిలో  జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో)
ఈరోజు తారా బలము:-
అశ్విని నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను.వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు

భరణి నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును

దిన ఫలం:-ఉద్యోగమునందుఅధికారుల ఒత్తిడి అధికంగా ఉండును. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు ఏర్పడగలవు. పనుల యందు నిరాసక్తత. దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు. శారీరకమైన బాధలు పెరుగును. మనస్సు నందు అనేకమైన ఆలోచనలతోటి చికాకుగా నుండును. వాదోపవాదములకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశి వారు ఈరోజు ఓం హేరమ్బాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు:-(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

ఈరోజు తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును

రోహిణి నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

దిన ఫలం:-అనుకోని కలహాలు. ప్రయాణాలు వలన చిరాకుగా ఉండును. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు. వ్యవహారాలు చాకచక్యంతోటి సరి చేసుకుని ముందుకు సాగవలెను. అనవసర విషయాలకు దూరంగా ఉండవలెను.బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో చికాకులు.  అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

Related Articles

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈరోజుతారాబలం:-
మృగశిర నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మానసికంగా శారీరకంగా ఆనందంగా గడుపుతారు. ఏ పని నైనా అతి సులువుగా చేస్తారు. వృత్తి ఉద్యోగమునందు ధన లాభం కలుగును. చేయ వ్యవహారం నందు పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈరోజు ఈ రాశి వారుఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు:-(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈరోజు తారాబలం.:-
పునర్వసు నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు

ఆశ్రేష నక్షత్రం వారికి ఈరోజు (సాధన తార):- బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత

దిన ఫలం:-అనవసరమైన ఆలోచనలు చేస్తారు. చేయ పనులలోఇతరులసహాయం తోటి పూర్తి చేస్తారు. వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘమునందు ప్రతికూలత వాతావరణం. ఊహించని ఖర్చులు పెరుగును. వాహన ప్రయాణం నందు జాగ్రత్త అవసరము. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః  అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

613
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు-:-(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈరోజు తారాబలం:-
మఘ నక్షత్రం వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్త వహించవలెను.వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు

పూ.ఫ నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

దిన ఫలం:-విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్థి వృద్ధి ఆలోచనలు కలిసి వస్తాయి. తలపెట్టిన పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు. సమాజము నందు పెద్దల యొక్క ఆదరణ అభిమానులు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీ రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

713
telugu astrology


క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-)
ఈరోజు తారాబలం:-
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

హస్త నక్షత్రం వారికి ఈరోజు (సంపత్తార):- బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

చిత్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళన గాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి


దిన ఫలం:-అనవసరమైన గొడవలు ఏర్పడగలవు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు. క్షణిక ఆవేశమునకు దూరముగా ఉండడం మంచిది. వాహన ప్రయాణమునందు జాగ్రత్త అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా కాళ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
నామ నక్షత్రములు:-(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఈరోజు తారాబలం:-
చిత్త నక్షత్రం వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళన గాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

స్వాతి నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

విశాఖ  నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.
దిన ఫలం:-ఉద్యోగ అధికారులతోటి విభేదాలు ఏర్పడగలవు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ సంబంధిత  వ్యవహారాలు సానుకూలంగా నుండును. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. సమాజము నందు అవమానాలు కలుగును.  వ్యాపారం నందు ఆకస్మికముగా నష్టములు ఏర్పడ గలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మిత్రాయ నమః అని శుభ ఫలితాలు పొందండి

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు:-(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈరోజు తారాబలం:
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

అనూరాధ నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

జ్యేష్ట నక్షత్రము వారికి ఈరోజు (సాధన తార):- బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత


దిన ఫలం:-బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారం ఆకస్మిక ధన లాభం కలుగును. నూతన వ్యక్తుల పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహనాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు. ఈరోజు ఈ రాశి వారు విజయలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

1013
telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామనక్షత్రములు:-(యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈరోజు తారాబలం:-
మూల నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార):- ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు,జాగ్రత్తవహించవలెను.వ్యాపారమునందు ధన నష్టము. పనుల యందు ఆటంకాలు

పూ.షా  నక్షత్రం వారికి ఈరోజు (క్షేమతార):- సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును

దిన ఫలం:-వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.   సమాజం నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తుంటారు. మానసంగా ఉల్లాసంగా ఉంటారు. అన్ని రంగాలలోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. నూతన అనుబంధాలు ఏర్పడతాయి. చేయి వ్యవహారము దూర దృష్టితో చేయవలెను. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు:-(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈరోజు తారాబలం:
ఉ.షా నక్షత్రము వారికి ఈరోజు (విపత్తార):-  వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘమునందు అవమానాలు కలగ గలవు.చేయు వ్యవహారమునందు కోపం అధికంగా ఉండును

శ్రవణం నక్షత్రము వారికి ఈరోజు (సంపత్తార):- బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

దిన ఫలం:-వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు.బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. రావలసిన బాకీలు చేతికి అందును. ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు ఓం శ్రీనివాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1213
telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈరోజు తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార):- శారీరక బాధలు పెరుగును. అధికారుల వలన భయాందోళనగాఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార):- వాహన ప్రయాణాలయందు జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రాగలదు

పూ.భా నక్షత్రం వారికి ఈరోజు  (మిత్రతార):- వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. కుడుమునందు ఆనందకరమైన వాతావరణం. శుభవార్తలు వింటారు. శుభ కార్యా ఆలోచనలు చేస్తారు. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. చేయు ఖర్చు యందు జాగ్రత్త అవసరము. సంగం నందు గౌరవ హోదాలో పెరుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం షణ్ముఖయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

1313
telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు:-(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈరోజు తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార):-  వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు. దూరం ప్రాంతము నుండి శుభవార్తలు వింటారు.

ఉ.భా  నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార):- మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు

రేవతి నక్షత్రం  వారికి ఈరోజు (సాధన తార):- బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత


దిన ఫలం:-శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభించును. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

click me!
Recommended Photos