ఈ రోజు రాశిఫలం: ఓ రాశివారికి ధన లాభం, విందు వినోదాలు

Published : Sep 23, 2022, 04:15 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయిన తొలగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చిక్కులు. ఆకస్మిక ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

PREV
114
ఈ రోజు రాశిఫలం: ఓ రాశివారికి ధన లాభం, విందు వినోదాలు
daily horoscope

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

214
Daily Horoscope

పంచాంగం :
 
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : భాద్రపదం
ఋతువు : వర్షఋతువు
పక్షం : కృష్ణపక్షము                                                                                       
 వారము: శుక్రవారం
తిథి :   త్రయోదశి రా 01.36 వరకు
నక్షత్రం : మఘా తెల్లవారుజామున 04.12వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03.12 నుండి 04.56 వరకు
దుర్ముహూర్తం:ఉ.08.16ని.నుండి ఉ.09.04ని.వరకు తిరిగి మ.12.17ని. ల01.05 వరకు
రాహుకాలం:ఉ.10.30ని.నుండి మ. 12.00ని. వరకు
యమగండం: మ.3.00ని. నుండి సా. 4.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:52ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:57ని.

314
Zodiac Sign


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. నూతన కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు.

414
Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ఎదురయిన తొలగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చిక్కులు. ఆకస్మిక ప్రయాణంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

514
Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ముఖ్యమైన  పనులలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది.ఉద్యోగాలలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు. సంతానం నుండి ధన వస్తు లాభం పొందుతారు.

614
Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధు మిత్రుల కలయిక. వృత్తి వ్యాపారాలలో ఎదురైన చిక్కులు తొలగుతాయి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. ఆర్దికాభివృద్ధి సాధిస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.పెట్టుబడులకు తగిన లాభాలు. సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

714
Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కోపతాపాలు వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పై అధికారుల నుండి చికాకులు.శారీరక శ్రమ. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. మిత్రులతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

814
Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు.విద్యార్థులు నూతన విద్యపై ఆసక్తి చూపుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

914
Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఆర్థిక లావాదేవీలు లాభసటిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూ గృహ క్రయవిక్రయాలలో లాభాలు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆరోగ్యం పట్లశ్రద్ద అవసరం.సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది

1014
Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నూతన వస్తు,వాహన ప్రాప్తి. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ఆర్దిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.దూరప్రాంతాల నుండి ఆహ్వానాలు. ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో కలిసి ఆనదంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల అభివృద్ధి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
 

1114
Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడిన అధిగమించి ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ధన లాభం. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.బంధుమిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు.

1214
Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. సంతానమునకు విద్య ఉద్యోగ అవకాశాలు. బంధువులను కలిసి ఆనదంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. గృహ నిర్మాణ ఆలోచనలు కలసి వస్తాయి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు.మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుతాయి.

1314
Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. స్వల్ప ధన లాభం. గృహ నిర్మాణ ఆలోచనలు చేస్తారు.దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి

1414
Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నూతన మిత్రుల పరిచయమై సాయం అందిస్తారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధి. వాహన యోగం. కాంట్రాక్టులు పొందుతారు. ప్రయాణాలలో లాభాలు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు.పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

click me!

Recommended Stories