జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
పంచాంగం :
తేది : 20అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము
వారము: గురువారం
తిథి : దశమి మ.01.39ని.ల వరకు
నక్షత్రం : ఆశ్రేష ఉ.09.23ని.ల వరకు తదుపరి మఖ
వర్జ్యం:రా.10.25ని.ల నుండి రా.12.08ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉ.09.49ని. నుండి ఉ.10.35ని. వరకు తిరిగి మ.02.28ని. నుండి మ.03.14ని.ల వరకు.
రాహుకాలం:మ.01.30ని.నుండి మ.03.00ని. వరకు
యమగండం: ఉ.06.00ని. నుండి ఉ.07.30ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:56ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:34ని.లకు
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఉద్యోగాలలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. వాహనంచోదకులకు ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టువిడిపించుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.విలువైన వస్తు ఆభరణాలు కొనుగొలు చేస్తారు. సన్నిహితులతో కలిసి అందంగా గడుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించండి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం కాగలదు. ఉపాధ్యాయులకు చికాకులు తప్పవు. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ఇంటా బయటా చికాకులు.ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అనవసరమైన వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.ఉద్యోగంలో పై అధికారులు ఒత్తిడులు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. - ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండటం మంచిది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. విలువైన పత్రాలు, రశీదులు అందుకుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా చికాకులు.ఆర్థికంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. అనవసరమైన వివాదాలు కోపతాపాలకు దూరంగా ఉండండి.ఉద్యోగంలో పై అధికారులు ఒత్తిడులు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనవసరమైన ప్రయాణాలు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమ అధికం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. మీ సంతానం పట్ల శ్రద్ధాసక్తులు కలిగి మెళుకువ వహించండి. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందుల వలన కొంతమేర రుణాలు చేయవలసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ఉపాథి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. విద్యార్థినులకు తోటివారి వల్ల మాటపడవలసి వస్తుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసరమైన కలహాలు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కళాకారులకు అనుకూలం. భాగస్వామికులతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించటం క్షేమదాయకం. స్త్రీలకు దైవకార్యానికి సంబంధించిన ఆహ్వానం అందుతుంది.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కొంతమేర రుణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. కీలకమైన వ్యవహరాలు గోప్యంగా ఉంచండి. ఎదుటివారిని నొప్పించకూడదన్న స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. షేర్లు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలుంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు.అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి.రిప్రజెంటటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. గృహ మరమ్మతులు, నిర్మాణాలు చేపడతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. ఎదుటివారిని నొప్పించకూడదన్న స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. షేర్లు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహంతప్పదు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. కొంత మొత్తం సహాయం చేసి వారిని సంతోషపెట్టండి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ముఖ్యమైన పనుల్లో అవరోధాలు ఎదురవుతాయి. సలహాలు ఇచ్చేవారే కాని సహాయం చేసేవారు ఉండరు. ప్రియతముల రాక మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. విద్యార్ధుల ఆలోచనల పక్కదోవ పట్టే ఆస్కారం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్ధికపరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సంతాన విషయంలో శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతో మాట పట్టింపులు. ఆకస్మిక ప్రయాణం సూచనలు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎదుటివారిని నొప్పించకూడదన్న స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. షేర్లు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులతో పర్యటనలుంటాయి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి నిరుత్సాహంతప్పదు. వాహన సౌఖ్యము.దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.