
మన జీవితంలోని చీకటి మొత్తాన్ని పారదోలి... వెలుగులు నిండాలనే భావనతో మనం దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ దీపావళి సందర్భంగా... మనం లక్ష్మీ దేవిని పూజిస్తాం. లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ధంతేరాస్ రోజున కూడా లక్ష్మీ దేవికి పూజ చేస్తారు. ఈ ధంతేరాస్ రోజున ఏ రాశివారు ఏం కొనుగోలు చేయడం వల్ల వారికి లక్ష్మీ కాటాక్షం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
1.మేష రాశి..
మేష రాశివారు ఈ రోజు పసుపు వస్తువుల కొనుగోలు లాభదాయకంగా ఉంటుంది. తాబేలు వంటి వస్తువులను ఇంటి అలంకరణ వస్తువులో పెట్టాలి.పూల మొక్కలు కొనుగోలు చేసి ఇంట్లోనే పెంచాలి. ఇలా పెంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. అలంకార వస్తువులను కొనుగోలు చేయడం వల్ల వారికి శుభం కలుగుతుంది.
2.వృషభ రాశి...
మీ వ్యక్తిత్వాన్ని పోలిన వస్తువులను కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. బంగారం, రాగి వస్తువులను కొనుగోలు చేయాలి. ఈ రాశివారికి వీటిని కొనుగోలు చేయడం వల్ల ప్రయోజనం కలిగించవచ్చు. ముఖ్యంగా ఎరుపు రంగు గాజులను కొనుక్కోవడం మంచిది.
3.మిథున రాశి...
మిథున రాశివారు బంగారం కొనుగోలు చేయడం వల్ల మీకు శుభ్రప్రదంగా ఉంటుంది. మీరు మీ వాతావరణంలో మార్పులను తీసుకువచ్చే దుస్తులు, అలంకరణ మొక్కలను కూడా కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల మీకు అంతా శుభం జరుగుతుంది.
4.కర్కాటక రాశి..
వజ్రాలు, విలువైన రాళ్లు, ఆభరణాలు కొనుగోలు చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. లేదంటే.. ఏదైనా పెంపుడు జంతువు ను కొనుగోలు చేయడం లేదంటే... ఏవైనా బొమ్మను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు.
5.సింహ రాశి..
వెండి లేదా బంగారు విగ్రహాలలో లక్ష్మీ దేవిని కొనుగోలు చేయడం చాలా శుభప్రదం. అమ్మవారికి సంబంధించిన ఏదైనా వస్తువు కొనవచ్చు. అంత ఖర్చు పెట్టలేకపోతే... పూలు, ధాన్యాలు, దుస్తులు కొనడం లాభదాయకంగా ఉంటుంది.
6.కన్య రాశి..
ఈ రాశివారు ఆకుపచ్చ రంగుతో ఏదైనా విలువైన వస్తువు కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ పరిమితికి మించిన కొనుగోళ్లను నివారించండి. పువ్వులు లేదా పువ్వులతో కూడిన ఫ్రేమ్‌ను కొనుగోలు చేయడం సానుకూలతను తీసుకురావచ్చు.
7.తుల రాశి...
వజ్రాలు, ప్లాటినం, బంగారం, వెండి వంటి ఖరీదైన ఏదైనా కొనుగోలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన వారం. ఏదైనా అధిక నాణ్యత గల రాయిని కూడా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణ ప్రణాళికలతో పాటు డిజైనర్ దుస్తులను కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
8.వృశ్చిక రాశి..
మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయాలి. బంగారం, వజ్రాలు, పుస్తకాలు, నీటికి సంబంధించిన ఏవైనా వస్తువుల కొనుగోలు అనుకూలం. తెలివిగా కొనుగోళ్లు చేయండి.
9.ధనస్సు రాశి...
మీరు ఇతరులకు బహుమతిగా ఇవ్వగల ఏదైనా కొనుగోలు చేయండి.మీ కోసం కాకుండా... ఇతరుల కోసం ఏదైనా కొనుగోలు చేయాలి. మీకోసం ఏదైనా కొనుగోలు చేసుకోవాలి అంటే... వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవడం ఉత్తమం. దాని వల్ల మీకు మంచి జరుగుతుంది.
10.మకర రాశి..
బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టండి. మీరు నీటికి సంబంధించిన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు. బట్టలు కొనడం చాలా అనుకూలమైనది. అది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారంలో కొత్త శక్తి పెరుగుతుంది.
11.కుంభ రాశి..
ఈ రాశివారు ప్రయోజనం చేకూరాలంటే.... దేనిలోనైనా పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. ముఖ్యంగా బంగారం, పసుపు నీలమణి రూబీ స్టోన్ వంటివి కొనుగోలు చేయడం ఉత్తమం.
12.మీన రాశి...
మీరు కొన్ని అలంకార వస్తువులు, లక్ష్మి/గణేశ వెండి నాణేలు, విగ్రహాలు ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తే శుభం జరుగుతుంది. వెండి వస్తువులు కొనుగోలు చేయడం ఈ వారం లాభదాయకంగా ఉంటుంది.