ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారికి అనారోగ్య సమస్యలు తప్పవు..జాగ్రత్త

First Published | Apr 1, 2023, 4:43 AM IST

ఈ రోజురాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు  వృత్తి వ్యాపారములు సానుకూలంగా ఉండును. వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చలు జరుపుతారు. మీ పని నిదానంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
    
పంచాంగం    
  
తేది :     1  ఏప్రిల్     2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రం
ఋతువు : వసంత ఋతువు
పక్షం :  శుక్ల పక్షము                                                                                          
వారము: శనివారం
తిథి :   ఏకాదశి తె.4.01ని.వరకు
నక్షత్రం :    ఆశ్లేష తె.4.41 ని. వరకు  
యోగం:- ధృతి రాత్రి 2.46 ని.వరకు
కరణం:- వణిజి మధ్యాహ్నం 2.58 భద్ర(విష్టి) తె.4.01 ని.వరకు
వర్జ్యం:    సాయంత్రం 4.14ని ల6.01 ని. వరకు    
అమృత ఘడియలు:  రాత్రి 2.53 ని ల 4.40 ని. వరకు
దుర్ముహూర్తం: ఉ.05.59 ని నుండి ఉ.7.36 ని వరకు
రాహుకాలం: ఉ.9.00ని. నుండి ఉ.10.30ని. వరకు
యమగండం: మ.01.30ని నుండి మ.3.00ని. వరకు 

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

మీప్రత్యర్థులు బలహీన పడతారు .నూతన వ్యవహారాలు వైపు మొగ్గు చూపుతారు. బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించండి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది . ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారములలో రాణిస్తారు.  వ్యవహారము నందు కఠినంగా మాట్లాడడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ధనాధాయ మార్గంములు అన్వేషణ చేస్తారు. ఈరోజు ఈ రోజు వారు ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగుతుంది. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.  స్థిరాస్తి  విషయాలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయాలని చూస్తారు.  విద్యార్థులు కొత్త విషయాలు మీద ఆసక్తి పెరుగుతుంది . కుటుంబ సమస్యలు పరిష్కారమగును.పెద్దల సాంగత్యము వలన అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.విలువైన బహుమానాలు సన్మానాలు సత్కారాల అందుకుంటారు. స్నేహితులతో మీ సంబందాలు పెపెరుగును. ఈరోజు ఈ రాశి మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగం పనులపై బయటకు వెళ్లాల్సి రావచ్చు. సహోద్యోగులతో మీ స్నేహం పెరుగుతుంది. మీరు ఆసక్తికరమైన పని చేసే అవకాశాలను పొందుతారు. మనసు ఆనందంగా ఉంటుంది. ఇతరులతోటి విభేదాలుంటే తొలిగిపోతాయి. చేయు పని యందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి వ్యాపారములు సానుకూలంగా ఉండును. వ్యాపార భాగస్వామ్యం గురించి చర్చలు జరుపుతారు. మీ పని నిదానంగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన విషయాలు గూర్చి ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులు పనివిషయంలో మీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు. వివిదాస్పద విషయాలకు దూరంగా ఉండవలెను. మిత్రులు తోటి కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేస్తారు.కుటుంబ కలహాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులకు కావలసిన సౌకర్యం అందుతుంది. వ్యాపారం యందు లాభం కనబడను. శత్రు భాదల నుండి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తప్పవు..జాగ్రత్త . ఈ రాశి వారు ఈ రోజు ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
కుటుంబమునందు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల సహాయం అందుతుంది.చేయు పనులు లో అలసత్వం వహించవద్దు.   శుభవార్తలు వింటారు.ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారం నందు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వివిధరకాల మార్గాల నుంచి ఆదాయం ఉంటుంది. సమాజం నందు ప్రతిభ తగ్గ గౌరవం లభించును.పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం మహాలక్ష్మి నమోస్తుతే అని జపించండి శుభ ఫలితాలు పొందండి .

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చిన్న  పని భావించే పనుల యందు సమస్యలు ఏర్పడగలవు.  సన్నిహితుల వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. చేయి వ్యవహారము నందు మృదువుగా  వ్యవహరిస్తూ వ్యవహారాలను చక్కబెట్టుకోవలెను.. కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఉంది. ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము సమాజము నందు వ్యతిరేకతలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం మృత్యుంజయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి .

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
సామాజికంగా నూతన వ్యక్తుల తోటి పరిచయాలు ఏర్పడతాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యాలయంలో  పనితీరు బాగుంటుంది.విద్యార్థులు  తలచిన  పనులు అనుకున్న సమయానికి ముందే పూర్తవుతాయి. కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. రోజంతా ఖాళీ లేకుండా ఉంటారు.మంచి పనులు చేపడతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది.ఖర్చులు అధికంగా ఉంటాయి.ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఈరోజు ఈ రాశి వారు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి
 

telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
పాత వివాదాలు తలెత్తి చికాకు పుట్టించును. రుణాలు ఇవ్వడం గానీ తీసుకోవడం గాని  చేయవద్దు. ఇతర ఆలోచనలు మాని  వ్యాపారాన్ని చూసుకోవడం మంచిది. ఇతరులకు ఆర్థిక హామీలకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండటం మంచిది. బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు. శ్రమతో కూడిన పనులు పూర్తి అగును.పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. కొన్ని విషయాలలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఈ రాశి వారు ఈ రోజు ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
చేయు కార్యాలయంలో పనిభారం  అధికంగా ఉండి ఒత్తిడి లకు లోనవుతారు..  అనుకోకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది.  ప్రతి విషయంలోను తొందర పాటు నిర్ణయాలు తీసుకొనవద్దు. డబ్బు ఆదా చేయడంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు శుభవార్త వింటారు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. కోపావేశాలు తగ్గించుకొనవలెను. వ్యాపారస్తులు ఓర్పు సహనం పాటించవలెను. ఆరోగ్య జాగ్రత్తలు చూసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

ఆగిపోయిన పనులు ప్రారంభంమగును. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యాపార ఒప్పందాలను అమలు చేస్తారు. పనిచేసే విధానంలో మార్పులు చేర్పులు చేయదురు.వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.   గృహమునందు ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ రాశి వారు ఈ రోజు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

నూతనపనులు చేయకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించాలి.పారిశ్రామిక రంగంలోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనవ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగమునందు అధికారులతోటి సమస్యలు ఏర్పడతాయి.సభలు, సమావేశాలలో మీ ప్రతిభ తోటి అందరినీ ఆకట్టుకుంటారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండవలెను. వదిలిపెట్టిన అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
వృత్తి వ్యాపారములు లలో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని విషయాలలో పట్టుదలగా వ్యవహరిస్తారు. వచ్చిన అవకాశాలను చేజార్చుకోవద్దు. ఉద్యోగమునందు అధికారుల నుండి ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఆర్థిక కార్యకలాపాలు యందు కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబం నందు సమస్యలు ఏర్పడి చికాకు పుట్టించును. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు.పనుల్లో ఆటంకాల ఏర్పడవచ్చు.బంధుమిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడగలవు. అనారోగ్య సమస్యలు రాగలవు. ఈరోజు ఈ రాశి వారు ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

Latest Videos

click me!