Today Horoscope: ఓ రాశివారికి శ్రమ ఫలిస్తుంది..శుభ వార్తలు వింటారు

First Published Dec 14, 2022, 4:30 AM IST

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
  
పంచాంగం: 
తేది :14 డిసెంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం  .మార్గశిరం
ఋతువు : హేమంత ఋతువు
పక్షం : కృష్ణపక్షం                                                                                         
వారము: బుధవారం
తిథి :షష్టి రాత్రి 7:37 ని వరకు
నక్షత్రం :.మఖ రాత్రి 02.07    వరకు
వర్జ్యం:  మధ్యాహ్నం 12.59 ని ల2.44 ని  వరకు
దుర్ముహూర్తం:మ.11.32ని. నుండి మ.12.16ని. వరకు.            
రాహుకాలం:మ.12.00ని.నుండి మ.01.30ని.వరకు
యమగండం:ఉ.07.30ని. నుండి ఉ.09.00ని. వరకు
సూర్యోదయం : ఉ.06.25ని.లకు
సూర్యాస్తమయం: సా.05.24ని.లకు

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
చేయ పనులను పనులు యందు కోపాన్ని తగ్గించుకొని వ్యవహరించవలెను. అధికారులతోటి సఖ్యతగా ఉండవలెను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చు. రాజకీయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. కొత్త సమస్యలు ఏర్పడవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను ఈ రాశి వారు ఈ రోజు ఓం ఆదిత్యాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేయ పనులు పనులలో బుద్ధి కుశలత తగ్గి ఆటంకాలు ఏర్పడతాయి. సమాజము నందు మీరు చేయని పనులకు బాధ్యతలు మీ  మీద   పడి అనువాదాలు కి గురవుతారు. వాదనలకు దూరంగా ఉండండి. కొన్ని సమస్యలు మనసు నందు చికాకులు పుట్టించును. దురాచనులకు దూరంగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేయ ఖర్చులు యందు ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు ఓం నమశ్శివాయ అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
చేయ పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు పని ఒత్తిడిగా ఉంటుంది. పిల్లలతోటే సరదాగా గడపండి. అనుకోని కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. మనసునందు అనేక ఆలోచనలతోటి భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం ఏర్పడుతుంది. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు తగ్గును. ఈరోజు ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
శారీరక శ్రమ అధికమై శరీర బాధలు పెరుగును. కొన్ని విషయాలు వినడం వలన మానసికంగా బాధపడతారు. చేయ పనులలో తొందరపాటు నిర్ణయాల వలన ఆటంకాలు ఏర్పడను. బంధుమిత్రుల తోటి కలహాల రావచ్చు. వస్తువులు యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని వలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. కుటుంబ సభ్యుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఈ రాశి వారు ఈ రోజు దుర్గా యే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పట్టుదలతో చేసిన పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు మనసునందుకు చికాకు పుట్టించును. సంఘం ప్రతికూలత వాతావరణం. వాహన ప్రయాణాలు జాగ్రత్త అవసరం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడను. భూ గృహ సంబంధిత పనులలో ధనలాభం కలుగును. ఉద్యోగం నందు అధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాయ నమః అని 11జపించండి శుభ ఫలితాలు పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
వృత్తి వ్యాపారాల యందు ఉహించని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి  బంధుమిత్రుల తోటి చర్చిస్తారు. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ప్రభుత్వ సంబంధిత పనులన్నీ సజావుగా సాగును. ఉద్యోగం నందు పై అధికారుల ఆశీస్సులు లభించును. సమాజమునందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ప్రయాణాలు లభిస్తాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగును. ఈ రాశి వారు ఈరోజు మహాలక్ష్మి నమః అని 11జపించండి శుభ ఫలితాలు పొందండి

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేయ పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి.సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు., నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు గురవే నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. గృహమునందు ఆనందకరమైన వాతావరణం. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. సంఘము నందు మీ  ప్రతిభకు తగ్గ గౌరవం పెరుగుతుంది. మానసికంగా శారీరకంగా బలపడతారు. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.  కీలకమైన సమస్యలను బుద్ధి కుశలత తో పరిష్కారం చేస్తారు. ఈ రాశి వారు ఈ రోజు ఓం దామోదరాయ నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను . ఇంకా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతోటి మనస్పర్ధలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును . ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు యందు జాగ్రత్తవసరం. ఇతరుల యొక్క  విషయాలలో జోక్యం తగదు. ఈరోజు ఈ రాశివారు ఓం అర్కాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి 

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది.వ్యాపారులో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చేయ పనుల యందు సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను. ఇతరులతోటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. భూగ్రహ కరవేకర్యాలు లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది .
ఈరోజు ఈ రాశి వారు ఓం మహాదేవాయ నమః అని 11 సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
తలపెట్టిన పనులన్నీ వెంటనే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల యిందు ధనలాభం కలుగుతుంది. నూతన పరిచయాలు కలిసి వస్తాయి ఉద్యోగమునందు అధికారుల యొక్క ఆదర అభిమానములు లభించును. సమాజము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. సమస్యలన్నీ పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు . కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు ఈరోజు దుర్గాదేవి నమః అని 11సార్లు జపించండి శుభ ఫలితాలు పొందండి

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును. నూతన పరిచయాలు లాభం కలిగించును.చెడు ఆలోచనలకు దూరంగా ఉండండివృత్తి వ్యాపారలయందు కష్టపడిన ధన లాభం కలుగును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి విలాసవంతమైన వస్తువులకు ఖర్చ చేస్తారు.ఉద్యోగమనందు సహోద్యోగులు నుండి మంచి సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంఘము నందు నీ మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారు ఓం పురుషోత్తమాయ నమః అని 11 జపించండి శుభ ఫలితాలు పొందండి

click me!