Zodiac signs
పంచాంగం
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీక మాసం
ఋతువు : శరదృతువు
పక్షం : కృష్ణపక్షము
వారము: ఆదివారం
తిథి : పంచమి రా.10.06ని. వరకు
నక్షత్రం : ఆరుద్ర ఉ.08.53ని.వరకు
వర్జ్యం: రా.10.10ని. నుండి రా.11.57ని.వరకు
దుర్ముహూర్తం:సా.03.51ని. నుండి సా.04.36ని. వరకు
రాహుకాలం:మ 4.30ని నుండి 6.00ని వరకు.
యమగండం:మ.12.00ని. నుండి మ.1.30ని. వరకు.
సూర్యోదయం : ఉ.06.06ని.లకు
సూర్యాస్తమయం : సా.05.22ని.లకు
Vijaya Rama krishna
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి... ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
అనవసర ప్రయాణాలు. మానసికంగా బలహీనంగా ఉంటుంది. కొత్త ప్రదేశంలో ఆహారం, నీరు మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. ఇతరులతోటి వాదనకు దూరంగా ఉండండి. చేయ పనులు యందు ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్యము నందు జాగ్రత్త వహించాలి.జీవిత భాగస్వామితోటి సఖ్యతగా ఉండాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వలెను.వృత్తి వ్యాపారం నందు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఉద్యోగమునందు అధికారుల యొక్క పని ఒత్తిడి ఎక్కువగా ఉండుట. ఉపాధ్యాయులు కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విదేశీయానం, రుణయత్నాలు ఫలిస్తాయి. బంధువుల రాకతో స్త్రీలకు అసౌకర్యం, చికాకులు తప్పవు.మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ కారణంగా గొడవలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి అధిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దుష్ట ఆలోచనలు లకు దూరంగా ఉండండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయం తగ జాగ్రత్తలు తీసుకొని వలెను. విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు. పనిచేయవారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును.కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. స్త్రీలకు ప్రకటనలు, స్కీంల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులను పూర్తి చేయాలి..ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగించును. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకొనవలెను . ఇంకా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతోటి మనస్పర్ధలు. చేయ పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును . ఉద్యోగమునందు పని ఒత్తిడి అధికంగా ఉండును. దైవ సంబందిత కార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు యందు జాగ్రత్తవసరం. ఇతరుల యొక్క విషయాలలో జోక్యం తగదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ఖర్చులు చేస్తారు.ఆస్తి వ్యవహారాలకు సంబంధించి సోదరీ సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. రుణాలు తీరుస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తవును. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం నందు లాభసాటిగా జరుగును .అనవసరమైన ఆలోచనలు తోటి వృధాగా కాలాన్ని గడపకండి. దుష్ట కార్యాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును. ఇతరులతోటి వాదనలు మానండి. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తగా తీసుకొనవలెను.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి . బంధువుల కోసం మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. మీ హోదా చాటుకోవటానికి ధనం బాగా వ్యయం చేయవలసి వస్తుంది. అనవసర ఖర్చులను పెరగకుండా తీసుకోవాలి. కీలక నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో టి పనులన్నీ పూర్తి చేయవలెను . ఉద్యోగ వ్యాపారం నందు శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతోటి కొద్దిపాటి కలహాలు ఏర్పడవచ్చును . ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. అనవసర ఆలోచనతో టి సమయాన్ని వృధా చేయకండి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులుగా ఉండును. మానసికంగా బలహీనంగా ఉంటుంది . అనవసరమైన ఖర్చులు ఏర్పడవచ్చును.వృత్తి వ్యాపారంలో ఉందో కష్టానికి ప్రతిఫలం లభించును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కొత్త ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తుంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములు లభించును. సంతానమునందు ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు . మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందించండి. సంఘమునందు చేయ వ్యవహారములు తెలివిగా వ్యవహరించవలెను .
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, అధికం. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది.వ్యాపారులో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చేయ పనుల యందు సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను. ఇతరులతోటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. భూగ్రహ కరవేకర్యాలు లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది .
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఉద్యోగస్తులు శక్తివంచన లేకుండా శ్రమించి అధికారులను మెప్పిస్తారు. మీపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. ఖర్చులు రాబడికి తగినట్టే ఉంటాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబం నందు శుభకార్య ఆలోచనలు చేస్తారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉంటాయి. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూడండి. కీలకమైన విషయాలలో ధైర్యంగా ముందడుగు వేయండి. కుటుంబ సభ్యులు యొక్క మద్దతు మీకు ఉంటుంది. బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గూర్చి ఆలోచనలు చేస్తారు .
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి. ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు. నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. గృహమునందు సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుందని. దేవాలయాలు సందర్శన చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనం, శారీరకశ్రమ వంటి ఇబ్బందు లెదుర్కుంటారు.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన బకాయిలను వసూలు చేసుకోవాలి. పోయిన వస్తువులు దొరకవచ్చు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. భూ గృహ క్రయ విక్రయాలు అనుకూలం. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత లభించును.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
కోపాన్ని అదుపులో ఉంచుకొని వలెను. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. ఇతరత్రా అవసరాలు మీ రాబడికి మించటం వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు.వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగించును. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):శుభవార్తలు వింటారు. ఆర్థిక సమస్యలు, ఇతర చికాకులు తొలగి మానసికంగా కుదుటపడతారు. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బాగుంటుంది.వ్యాపారులో మంచి లాభాలు సాధిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. చేయ పనుల యందు సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను. ఇతరులతోటి తొందరపాటు మాటలు మాట్లాడవద్దు. భూగ్రహ కరవేకర్యాలు లాభించును. పొదుపు మార్గాలను అన్వేషిస్తారు.కొన్ని సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది .