దసరా రాశి ఫలాలు : ఓ రాశి వారు అమ్మవారి అనుగ్రహం పొందుతారు

Published : Oct 05, 2022, 06:41 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కొంతమేర రుణాలు చేయవలసి రావచ్చు.

PREV
114
దసరా రాశి ఫలాలు : ఓ  రాశి వారు అమ్మవారి అనుగ్రహం పొందుతారు

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
 

214

పంచాంగం:                                                                                                                                                                                                                      
 
 తేది : 5 అక్టోబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆశ్వయుజ
ఋతువు : శరదృతువు
పక్షం : శుక్లపక్షము                                                                                          
వారము: బుధవారం
తిథి : దశమి ఉ.11.14 ని.ల  వరకు
నక్షత్రం : శ్రవణం రా.09.34ని.ల వరకు
వర్జ్యం: రా.01.18ని.ల నుండి రా.02.48ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉ. 11.25ని.ల నుండి మ.12.13ని.ల వరకు.           
రాహుకాలం:  మ. 12.00ని.నుండి మ. 1.30ని.వరకు
యమగండం:  ఉ. 07.30ని. నుండి ఉ. 9.00ని. వరకు
సూర్యోదయం : ఉదయం 5:54ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 05:45ని.లకు
విజయదశమి
 

314
Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల నుండి బయటపడతారు.అనుకోని కొన్ని అవకాశాలు లభిస్తాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

414
Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. కొంతమేర రుణాలు చేయవలసి రావచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.

514
Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఉద్యోగాలలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఆకస్మిక ధనలాభం. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.విలువైన వస్తు ఆభరణాలు కొనుగొలు చేస్తారు. సన్నిహితులతో కలిసి అందంగా గడుపుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన.

614
Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తలపెట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. వ్యాపారాలలో లాభాలు.

714
Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పుణ్య‌‌క్షేత్రాలు సందర్శిస్తారు.వాహన సౌఖ్యము.దూరప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యం.విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

814
Zodiac Sign

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. తలపెట్టిన పనులు విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దూర ప్రాంతాల నుండి వచ్చిన శుభవార్తలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి.

914
Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ముఖ్యమైన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనవసరమైన కలహాలు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.ఆదాయానికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

1014
Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

1114
Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శ్రమ అధికం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశను కలిగిస్తాయి. ఆరోగ్యక ఇబ్బందుల వలన కొంతమేర రుణాలు చేయవలసొస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ప్రయాణాలు.

1214
Zodiac Sign

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.నిరుద్యోగుల ప్రయత్నాలు పలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు పెట్టుబడికి తగిన లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భూ గృహ స్థిరాస్తి క్రయవిక్రయాలలొ లాభాలు పొందుతారు.

1314
Zodiac Sign

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సన్నిహిత సహకారంతో అనుకున్న పనులు విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలు తీసుకుంటారు.

1414
Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
సన్నిహితుల సహకారంతో తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంఘం నందు గౌరవం పెరుగుతుంది.ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహన యోగం.

click me!

Recommended Stories