మకర రాశివారు ప్రేమలో పడ్డారు అనడానికి సంకేతాలు ఇవే..!

Published : Oct 04, 2022, 09:56 AM IST

నిత్యం చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ.. అలా కాకుండా వారు పరధ్యానంలో ఉన్నారు అంటే.. వారు ఎవరినైనా ప్రేమిస్తున్నారని అర్థం. వారు ప్రేమలో పడితే పరధ్యానంగా ఉంటారు. 

PREV
16
 మకర రాశివారు ప్రేమలో పడ్డారు అనడానికి సంకేతాలు ఇవే..!

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడాల్సిందే. అయితే.. ఎవరు ఎప్పుడు ఎలా పడతారు అనేది మాత్రం మనం చెప్పలేం. కాగా... ప్రేమలో పడిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు. మరి జోతిష్యశాస్త్రం ప్రకారం... మకర రాశివారు ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తే.. ఎలా ఉంటారు..? వారితో ఎలా ప్రవర్తిస్తారో ఓసారి చూద్దాం...

26

సాధారణంగా, మకర రాశి పురుషులకు పని పట్ల ఆసక్తి ఎక్కువ. ఎక్కువ శాతం వారు డబ్బు సంపాదించాలని.. లక్ష్య సాధనలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగాలలో ఉత్తమంగా నిలవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నిత్యం చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ.. అలా కాకుండా వారు పరధ్యానంలో ఉన్నారు అంటే.. వారు ఎవరినైనా ప్రేమిస్తున్నారని అర్థం. వారు ప్రేమలో పడితే పరధ్యానంగా ఉంటారు. 
 

36

ఈ రాశికి చెందిన పురుషులు భౌతికవాదులుగా ప్రసిద్ధి చెందారు. వారు కోరుకున్నంత వరకు డబ్బు ఖర్చు చేయరు. అతను మిమ్మల్ని డేట్ కి వెళ్లడానికి బయటకు అడుగుతూ, మీతో సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అంటే.. అతను మీతో ప్రేమలో ఉన్నాడని అర్థం. మకర రాశి పురుషులు తాము ప్రేమించిన అమ్మాయిని తరచూ డిన్నర్ కి బయటకు తీసుకువెళుతూ ఉంటారు.

46
মকর (Capricorn)

మకర రాశికి చెందిన పురుషులు ఎవరినైనా ప్రేమిస్తే... వారితో ఎక్కువ సేపు సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫోకస్ అంతా ఆ అమ్మాయిపైనే పెడతారు. మీతో పాటు.. మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల గురించి కూడా తెలుసుకోవాలని.. వారితో మాట్లాడాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. 

56
Capricorn


ఈ రాశివారు ప్రేమలో ఉన్నప్పుడు.... వారు ప్రేమించిన వారిని సర్ ప్రైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సర్ ప్రైజ్ గా బర్త్ డే పార్టీలు ఇస్తారు. లేదంటే.. మీకు తెలీకుండా మీ స్నేహితులందరినీ పిలిచి.. మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే అవకాశం ఎక్కువగా ఉంది.

66

నిజానికి ఎవరూ తమ ఫోన్ ని మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ... ఈ రాశివారు ఎవరినైనా ప్రేమిస్తే... వారికి తమ ఫోన్ ఇవ్వడానికి అస్సలు వెనకాడరు. వారి వాట్సాప్, ఇతర సోషల్ మీడియా యాప్ లను మీరు పరిశీలించడానికి కూడా వారు వెనకాడరు. నిజంగా ప్రేమించిన వారికి మాత్రమే వారు ఆ అనుమతి ఇవ్వగలరు.

click me!

Recommended Stories