ఈ వారం 6సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు రాశిఫలాలు

First Published Sep 6, 2019, 11:37 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉన్నత లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు. అసంతృప్తి పెరుగుతుంది. నిరాశ, నిస్పృహలు కలుగుతాయి. సుదూర ప్రయాణ భావనలు ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రలకు అనుకూలమైన సమయం. తప్పనిసరిగా దానధర్మాలు చేయాలి. పుణ్యలోపాలకు, చికాకులకు అవకాశం ఉంది. ఉన్నత విద్యారంగంలోనూ, కీర్తి ప్రతిష్టల విషయంలోనూ జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అధికారిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుతీసుకుంటాయి. పదోన్నతులకు, సామాజికమైన గుర్తింపులకు అవకాశం. శ్రీరామ జయరామ జయజయ రామరామ
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : అనుకోని సమస్యలు వస్తాయి. అనారోగ్య భావనలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది జాగ్రత్త అవసరం. నిర్ణయాదులు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్య కార్యాల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ ఆర్థికాంశాల్లోనూ జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు పనికి రావు. మాట విలువ తగ్గుతుంది. ఉన్నత వ్యవహారాలుంటాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుతీసుకుంటారు. సంప్రదింపులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, స్నేహానుబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామితో అపోహలకు అవకాశం ఏర్పడుతుంది. మానసిక బలహీనతకు అవకాశం ఉంది. ఇతరుల ప్రభావాలకు లోబడకుండా ఉండాలి. సామాజిక అనుబంధాల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. అనుకోని సమస్యలు, అనారోగ్య భావాలు తలెత్తుతాయి. ఆలోచనల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. నిర్ణయాదులు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. ఊహించని సంఘటనలు వస్తాయి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బంది. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీరంగంలో జాగ్రత్తగా మెలగాలి. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ. వ్యతిరేకతలు అధికం అవుతాయి. అన్ని పనుల్లోనూ ఒత్తిడులు తప్పవు. ఋణ రోగాదులు ఇబ్బంది పెట్టే అవకాశం. శత్రుభావనల నుండి దూరంగా మెలగాల్సి ఉంటుంది. ఖర్చులు పెట్టుబడుల్లోనూ జాగ్రత్త అవసరం. కాలం, ధనం, వ్యర్థం కావచ్చు. పరామర్శలకు అవకాశం. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. సామాజిక, భాగస్వామ్య అనుబంధాలతో అనుకూలత ఏర్పడుతుంది. సంతోషంగా కాలం గడుపుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఆలోచనల్లో ఒత్తిడులుంటాయి. సృజనాత్మకత లోపం ఏర్పడుతుంది. నిర్ణయాదుల్లో ఆలస్యం తప్పకపోవచ్చు. స్పెక్యులేషన్‌ల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. అన్ని పనుల్లోను జాగ్రత్త అవసరం. సంతానవర్గ వ్యవహారాల్లో లోపాలుంటాయి. తొందరపాటు కూడదు. ఆశించిన లాభాలు అందకపోవచ్చు. ఊహలు అధికమౌతాయి. అపోహలకు కూడా అవకాశం ఉంది. వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులుంటాయి. పోటీ రంగంలో గుర్తింపు. రోగ ఋణాదులపై విజయం. పోటీల్లో విజయం సాధిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఆహార విహారాల్లో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ ప్రాధాన్యం. ప్రాథమిక విద్యారంగంలోని వారికి శ్రమ అధికం. గృహ వాహనాది సౌకర్యాల విషయంలో చికాకులు ఏర్పడే అవకాశం. సౌఖ్యలోపం ఏర్పడుతుంది. ససమాజిక గౌరవం పెంచుకోవడానికి అధికంగా కృషి చేయాలి. అభీష్టాలు నెరవేరుతాయి. ఆలోచనలకు ఒక పర్‌ఫెక్ట్‌ రూపం. ప్లానింగ్‌తో జీవనం ఉంటుంది. వైజ్ఞానిక ధోరణి. సృజనాత్మక పెరుగుతుంది. కొత్త పనుల నిర్వహణ సంతోషాన్నిస్తుంది. శ్రీరామ జయరామ జయజయరామ జపం మంచిది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. సేవక వర్గ సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలకు మంచిది. కమ్యూనికేషన్స్‌లో ఇబ్బందికి అవకాశం. వార్తల వల్ల కొంత మానసికమైన ఒత్తిడి ఉంటుంది. సమస్యలను వినడం వల్ల చలించిపోయే అవకాశం. దేశాంతర ప్రయాణాదులకు ప్రయత్నాలకు అవకాశం. ఉన్నత లక్ష్యాలను సాధిస్తున్నా అసంతృప్తి తప్పదు. ఆహార విహారాల్లో అనుకూలత. సంతోషంగా గడుపుతారు. సౌఖ్యం పెరుగుతుంది. విద్యారంగంలోని వారికి అభివృద్ధి. పిల్లలకు సంతోషం. మాతృవర్గం వారు కొత్త పనులను నిర్వహిస్తారు. శ్రీమాత్రేనమజపం.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కుటుంబంలోనూ బంధువర్గ వ్యవహారాల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం తగ్గిపోవచ్చు. మాటల్లోనూ చికాకులు ఏర్పడతాయి. మాట విలువ తగ్గిపోతుంది. దాచుకున్న సంపదపై మమకారం తగ్గించుకోవాలి. అనుకోని సమస్యలుంటాయి. అనారోగ్య భావాలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. మధ్యమంలో సంప్రదింపుల్లో అనుకూలత. ఇతరుల సహకారం పూర్ణంగా లభిస్తుంది. మంచి వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. మిత్రుల గొంతులు వింటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపంమంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : నిర్ణయాదుల్లో జాగ్రత్త అవసరం. అన్ని పనుల్లోనూ ఒత్తిడులుంటాయి. కార్యనిర్వహణ బాధ్యతలు శ్రమకు గురి చేస్తాయి. ఆలస్య నిర్ణయాలుంటాయి. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లోనూ అపోహలకు అవకాశం. చెప్పుడు మాటలు వినవద్దు. దాచుకునే సంపదను పెంచుతీసుకుంటారు. బంధువర్గంతో అనుకూలత పెరుగుతుంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం సంతృప్తి జరుగుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి ఉన్నా అనుకోని సమస్యలు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. వ్యర్థంగా కాలం ధనం కోల్పోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పరామర్శలకు అవకాశం లభిస్తుంది. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. విశ్రాంతిలోపం వస్తుంది. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. వ్యతిరేక ప్రభావాల వల్ల శ్రమాధిక్యం ఏర్పడుతుంది. నిర్ణయాదులు సంతోషాన్నిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. ఆలోచనలకు రూపకల్పన జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అన్ని పనుల్లోనూ ప్రయోజన దృష్టి. సరియైన లాభాలు లేక ఇబ్బందులు పడతారు. పెద్దలతో జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది. అపోహలకు అవకాశం ఏర్పడుతుంది. అన్ని పనుల్లోనూ అప్రమత్తం అవసరం. సృజనాత్మకత పెరిగినా కార్యక్రమాల్లో మాత్రం ఒత్తిడులు వస్తాయి. ఆధ్యాత్మిక దృష్టి వల్ల మేలు కలుగుతుంది. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. అన్ని పనుల్లోనూ శ్రమ ఉన్నా ఫలితాలు తప్పవు. విశ్రాంతి లభిస్తుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. సౌఖ్యంగా కాలం గడుపుతారు. శ్రీమాత్రేనమః జపం మంచిది..
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుంటాయి. అధికారిక వ్యవహారాల్లో సమస్యలు అధికం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. పనిచేసే చోట కొన్ని సమస్యలు ఉండే అవకాశం. ఆహార విహారాల్లో అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాదులకు అనుకూలత. శ్రమతో కార్యాలు చేస్తారు. అన్ని పనుల్లోనూ లాభాలుంటాయి. ప్రయోజనం సంతోషాన్నిస్తుంది. పెద్దల ఆశీస్సులు ఫలిస్తాయి. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. సోదరవర్గంతో గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతాన వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుతీసుకుంటారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ.
undefined
click me!