ఈ వారం రాశిఫలాలు( మే 8 నుంచి మే14)

First Published May 8, 2020, 8:43 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
మేషరాశికి :- ఈ వారం వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి :- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిథునరాశి :- ఈ వారం స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. వివాహాది వేడుకల నిర్వహణకు సన్నద్ధమవుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగి ఊరట లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం పొందుతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి:- ఈ వారం మీ ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహం. మధ్యమధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. వారం మధ్యలో బంధువుల నుంచి ఒత్తిడులు. శ్రమాధిక్యం. అనారోగ్యం.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. మిత్రులు మీకు సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి:-ఈ వారం వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వీరికి పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి:- ఈ వారం వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గే అవకాశం. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి:- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. మొదట్లో ఎదురయ్యే ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. పనులు చకచకా పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి:- ఈ వారం సేవాకార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. చిరకాల స్వప్నం ఫలిస్తుంది. నిరుద్యోగుల శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, ఇళ్లు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి సత్తా చాటుకుంటారు. మీ ఆశయాలు నెరవేరే సమయం. పలుకుబడి పెరుగుతుంది. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి:-ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి విశేష ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు, సమస్యలు తీరే సమయం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు చకచకా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి:- ఈ వారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు కాస్త తగ్గే సూచనలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి:- ఈ వారం ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ప్రారంభంలో కొద్దిపాటి చిక్కులు, సమస్యలు ఎదురైనా క్రమేపీ అధిగమిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. గృహం, వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి:- ఈ వారం వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పరిచయాలు మరింత పెరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది .
undefined
click me!