astrology: మే నెల రాశిఫలాలు

First Published | May 1, 2020, 9:54 AM IST

మే నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

మేషరాశి:- ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి స్థిరమైన ఆలోచనా విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడును. కుటుంబ సభ్యుల సహాయం అవసరమగు సంఘటనలు. ధనాదాయం కొంత వరకు తగ్గును. ఉద్యోగ జీవనంలో స్థానచలనం ఏర్పడును. విదేశీ సంబంధ నివాస ప్రయత్నాలు చేయువారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధనవ్యయం అధికంగా ఏర్పడును. ఖర్చు విషయంలో జాగ్రత్త అవసరం. మానసిక చికాకులు బాధించు సూచన. విద్యార్ధులు శ్రమించ వలెను. వ్యాపార వర్గం వారు 14 తేదీ తదుపరి లాభాపడుదురు. ఈ మాసంలో 5, 9, 13 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృషభరాశి:- ఈ నెలలో గత మాసపు ఉద్యోగ జీవన ఒడిదుడుకులు తొలగును. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉండును. నిరుద్యోగులు మరింత దీక్షా , పట్టుదలను ప్రదర్శించాలి. చివరి వారంలో ఆత్మీయులతో ఉన్న వివాదాలు సర్దుబాటు చేసుకొందురు. ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషానికి పూర్తీ చేయగలుగుతారు. ప్రధమ అర్ధ భాగంలో వైవాహిక జీవనంలో పట్టుదల ఉద్రిక్తతలు ఎదుర్కొందురు. భూ సంబంధ కొనుగోలు ప్రయత్నాలు లాభించును. ధనాదాయం సామాన్యం. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు విఫలమగును. ఉన్నత అధికారులను ప్రతిభతో ఆకట్టుకుంటారు. స్నేహితులు సహకారం లభించును. రాజకీయ రంగంలోని వారికి ఊహించని అవకాశములు లభించును. ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు లాభించును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి:- ఈ నెలలో పని చేయు కార్యాలయంలో కపట స్వభావులు ఎదురగుదురు. కుటుంబ సమస్యల తీర్పులలో నిర్ణయాత్మకంగా ప్రధాన పాత్ర వహిస్తారు. నూతన ఆలోచనలు ఎలాంటి ప్రతి ఘటనలు లేకుండా అమలు చేయగలరు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా నడుచును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. బాగా తెలిసిన వ్యక్తుల వలన చక్కటి సంబంధాలు కుదురును. ఉద్యోగులకు దూర ప్రాంత ధనాదాయం ప్రాప్తించును. స్పెక్యులేషన్ లాభించును. నూతన ఒప్పందాలు లభిస్తాయి. స్థాన చలన అవకాశములు లేవు. మిత్ర వర్గంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈ మాసంలో 17, 18 తేదీలు మినహా మిగిలిన రోజులు అనుకూలంగానే ఉండును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది
కర్కాటకరాశి:- ఈ నెలలో వ్యక్త్రిగత జీవనంలో కొద్దిపాటి సమస్యలు. కుటుంబ బంధాలపై నమ్మకం దెబ్బతినును. చేపట్టిన పనులను మధ్యలోనే విడిచిపెట్టుదురు. వ్యతిరేక ఫలితాల వలన ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. కుల వృత్తులపై ఆధార పడిన వారికి తీవ్ర సమస్యలు. ఋణ బాధలు. ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. నూతన వ్యవహారాలు, వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం సమస్యలు కలిగించును. జీవిత భాగస్వామి బంధువులతో శతృత్వం. తృతియ , చతుర్ధ వారములలో సంతన సంబంధ శుభ వార్త. మొత్తం మీద ఈ మాసం ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి :-ఈ నెలలో కుటుంబానికి పూర్వ వైభవం తెస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జాతకంలో శని గ్రహం బలంగా ఉన్నవారికి రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం అనువైన కాలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు , నూతన ఉద్యోగ జీవన ప్రయత్నాలు విజయవంతం అగును. గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహించదేరు. అధికారుల ఒత్తిడి తగ్గును. 8 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఒక ఆపద నుండి బయటపడతారు. శత్రుత్వాలు తొలగి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకోగలరు. నూతన ఆరోగ్య పద్దతులు అలవాటు చేసుకొంటారు. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం ఆశించినంతగా ఉండును. అనుకూలమైన శుభాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
కన్యారాశి :- ఈ నెలలో ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు విజయవంతం అగును. లక్ష్యాలను చక్కగా పూర్తీ చేయగలరు. సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది. స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయి. సోదర వర్గం వలన లాభం. కళత్ర విషయాలు కొంత ప్రతికూలత ఎదుర్కొనును. కూడా అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించును. ధనదయం సామాన్యం. ప్రధమ వారంలో విమర్శలు ఎదుర్కొందురు. శుభకార్య సంబంధ విషయాల వలన వ్యయం అంచనాలను మించుతుంది. ఖర్చుపై నియంత్రణ అవసరం. వ్యాపార వర్గం వారు ఆకస్మిక ధననష్టం కలుగకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులరాశి :- ఈ నెలలో నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుచును. వినోద కార్యక్రమాలకై ధనం ఖర్చు అగును. ఆశించిన విధంగా నూతన జీవన విధానాలు ప్రారంభం అవుతాయి. ధనాదాయం సామాన్యం. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్ధులకు చక్కటి సంకేతిక విద్యలో ప్రవేశం లభించును. 9, 10, 11, 12 తేదీలలో వివాహ సంబంధ లేదా సంతాన సంబంధ శుభవార్తలు వింటారు. పరోపకారం వలన ఇతరుల మన్ననలు పొందుతారు. వృత్తి జీవనంలో కోరుకున్న గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.
వృశ్చికరాశి :- ఈ నెలలో సోదర సోదరి వర్గీయులకు సంబందించిన ఇబ్బందుల వలన మానసిక చికాకులు. 19,20,21 తేదీలలో మిత్ర సంబంధ వ్యవహారములలో గౌరవ నష్టం. అపవాదులు బాధించును. చివరి వారంలో శారీరక శ్రమ అధికం అగును. నరముల సంబంధిత సమస్యలు ఇబ్బంది కలిగించును. తల్లితండ్రులతో కుటుంబ బాధ్యతలకై తగాదాలు. అన్నివిధాలా ఆదాయం బాగుండును. వ్యాపార విస్తరణకు, నూతన ఆలోచనలు అమలుచేయుటకు ఈ మాసం కలసి వచ్చును. విదేశీ ప్రయత్నములు చేయుటకు, వివాహ ప్రయత్నములు - సంతాన ప్రయత్నములకు ఈ మాసం చక్కటి అనువైన కాలం. ఈ మాసంలో 3 వ తేదీ నుండి 15 వ తేదీ మధ్య కాలంలో ఆకస్మిక ప్రయాణములు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
ధనస్సురాశి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. రాజకీయంగా ఆసక్తి కలిగివున్న వారికి ఆశించిన పదవులు, ఉన్నత హోదా పొందుటకు ఇది అనువైన కాలం. విదేశీ సంబంధ స్థిర నివాసం కొరకు చేయు ప్రయత్నాలు ద్వితీయ వారంలో ఫలించును. తృతీయ వారంలో నిద్రలేమి సంబంధిత ఆరోగ్య సమస్యల వలన సమస్యలు. మీ ప్రమేయం లేకుండా అవమానములు, అపవాదులు భరించవలసి వచ్చును. ధనాదాయం సామాన్యం. మాసాంతంలో ప్రతిభకు తగిన ప్రోత్సాహం ఉండును. గృహ సంబంధ స్థానచలనం ఏర్పడును. ఈ మాసంలో 8 , 10 , 14, 17 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకుపశు,పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి :- ఈ నెలలో కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగును. సమాజంలో నూతన హోదా ను ఏర్పాటుచేయుదురు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాలలో తోడ్పాటు లభించును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా కొనసాగును. చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. ఈ మాసంలో 24, 25, 26 తేదీలలో యుక్త వయస్కులైన పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు. పితృ వర్గానికి చెందిన ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినడానికి సూచనలు ఉన్నాయి. ధన ఆదాయం అవసరాలకు తగిన విధంగా ఉండును. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఆశించిన ఫలితాలు ఏర్పడును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి :- ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలలో ఆశాభంగములు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి ఎదుర్కుంటారు. ధనాదాయం ఆశించిన విధంగా బాగుండును. అవసరములకు రావలసిన ధనం చేతికి వచ్చును. 12 వ తేదీ నుండి 18 వ తేదీ మధ్య కాలంలో ప్రయణాలందు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో వాహన ప్రమాద సూచన ఉన్నది. తృతీయ వారం సామాన్య ఫలితాలను కలుగ చేయును. చివరి వారంలో అధిక ధన వ్యయం మరియు సొంత ఆరోగ్య విషయాలలో చికాకులను కలుగచేయును. చివరి నిమిషంలో అవకాశములు కోల్పోతారు. 24, 25, 26 తేదీలలో ఉద్రేక సంభాషణల వలన ఒక నష్టం ఎదుర్కొందురు. ఉపయోగించు పదాల పట్ల జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి :- ఈ నెలలో కుటుంబ సంతోషములు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా కొనసాగును. నూతన ఆలోచనలు అమలుచేయుటకు ఈ మాసం కలసి వచ్చును. చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు. జీవనంలో గౌరవ హోదాలు పెరుగును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభించును. ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు. ద్వితీయ వారం తదుపరి నూతన వ్యాపారములు ప్రారంభించుటకు అనుకూలత లభించును. మాసాంతంలో సంతాన భవిష్యత్ గురించిన ఆందోళన ఏర్పడు సూచన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

Latest Videos

click me!