ఈ వారం (మార్చి 8 నుంచి మార్చి 14వరకు) రాశిఫలాలు

First Published Mar 8, 2019, 9:06 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. నూతన కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. వ్యవహార దక్షత పెరుగుతుంది. నిల్వధనం పెంచుకుటాంరు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. శ్రమాధిక్యం ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడులు తప్పకపోవచ్చు. ఇతరుల సహకారం ఆశించినంతగా లభించకపోవచ్చు. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ప్రారంభంలో ఖర్చులు పెట్టుబడులు అధికంగా ఉంటాయి. విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు. కావలసిన ప్రశాంతత దొరకకపోవచ్చు. యాత్రలకు ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. కొంత సంతోషం ఉంటుంది. క్రమంగా నిర్ణయాదులకు అనుకూలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : లాభాలు సంతోషాన్నిస్తాయి. గౌరవాన్ని పెంచుకుటాంరు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆశించిన ప్రయోజనాలు ఇంకా అందకపోవచ్చు. భాగస్వామ్యుల్లో కొంత నైరాశ్యం ఏర్పడుతుంది. స్త్రీలమూలక సమస్యలు ఉంటాయి. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికమౌతాయి. విశ్రాంతి లభిస్తుంది. అన్ని పనుల్లోనూ కొంత జాగ్రత్తగా ఉంటాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. శ్రీమాత్రేనమః జపంమంచిది.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వృత్తి ఉద్యోగాదులపై ప్రత్యేకదృష్టి ఉంటుంది. పదోన్నతుల గూర్చిన ఆలోచనలు ఉంటాయి. అధికారులకు ఆదరణ లభిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. పితృవర్గ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. పోటీరంగంలో కొంత జాగ్రత్త అవసరం. పరిచయాలు విస్తరిస్తాయి. భాగస్వామితో చర్చలు చేస్తారు. క్రమంగా లాభాలు సంతోషాన్నిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి ఉంటుంది. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఉన్నత విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక, దైవ కార్యనిర్వహణ చేస్తారు. కొంత ఘర్షణాత్మక వాతావరణం ఉంటుంది. వ్యవహార దక్షత ఏర్పడుతుంది. ఆలోచనల్లో ఒత్తిడి తప్పకపోవచ్చు. నైరాశ్య భావనలు ఉంటాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. భాగస్వాములతో ఒత్తిడి ఏర్పడుతుంది. లాభాలపైదృష్టి ఉంటుంది. శ్రీమాత్రేనమః జపం మంచిది.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : అనుకోని సమస్యలు, అనారోగ్యభావనలు. ఉంటాయి. ఊహించని కష్టనష్టాలకు అవకాశం ఉంటుంది. ఇబ్బందికరమైన సంఘటనలకు అవకాశం ఏర్పడుతుంది. సౌకర్యాల వల్ల సమస్యలు ఉంటాయి. గృహ వాహనాదుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయి. మానసికమైన ఒత్తిడి ఏర్పడుతుంది. సంతానవర్గంతో గడిపేఅవకాశం ఉంటుంది. ముఖ్య నిర్ణయాదులు వాయిదా వేసుకోవాలి. లక్ష్యాలను సాధిస్తారు. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శ్రమతో విజయాలు సాధిస్తారు. ఋణవ్యవహారాలపై దృష్టి ఉంటుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో శుభ పరిణమాలు ఉంటాయి. పరిచయాలు స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. వ్యవహార దక్షత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. అన్ని పనుల్లోనూ అనుకూలత ఏర్పడుతుంది. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం. గృహ వాహనాదుల వ్యవహారాలపై దృష్టి ఉంటుంది. అనారోగ్య భావనలు ఉంటాయి. శ్రీమాత్రేనమః
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సంతానంతో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉంటాయి. విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. గుర్తింపు లభిస్తుంది. సామాజిక వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. తీవ్రమైన పోటీలను ఎదుర్కొటాంరు. కుటుంబ సంబంధాల్లో జాగ్రత్త అవసరం. సంప్రదింపులు ఉంటాయి. వార్తల విషయంలో కొంత చికాకు తప్పకపోవచ్చు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సౌకర్యాలపై దృష్టి పెడతారు. వారం ప్రారంభంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతానవర్గంతో సంతోషంగా ఉంటారు. కొత్త నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు. శ్రమతో కార్యక్రమాల రూపకల్పన ఉంటుంది. ఋణాదులను గూర్చిన చర్చలుటాంయి. పరిచయాలు స్నేహబంధాలు విస్తరిస్తాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : కమ్యూనికేషన్లు అనుకూలిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సహకారం లభిస్తుంది. ఆహార విహారాల్లో అనుకూలం ఏర్పడుతుంది. గృహ వాహనాది నిర్ణయాలకు అనుకూలత ఏర్పడుతుంది. సౌఖ్యంగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. కొత్త ఆలోచనలకు రూపకల్పన ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుటాంరు. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొత్త ప్రణాళికలు అనుసరిస్తారు. వ్యతిరేకతలు పెరిగే సూచనలు. శ్రీమాత్రే నమఃజపంమంచిది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో అనుకూల ఏర్పడుతుంది. ఆర్థిక నిల్వలపై దృష్టి పెరుగుతుంది. సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. మంచివార్తలు వింరు. ఇతరుల సహకారం లభిస్తుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొటాంరు. ప్రయాణాల్లో సంతోషం ఏర్పడుతుంది. గృహ వాహనాల విషయంలో కొత్త ఆలోచనలకు అవకాశం. శ్రీ మాత్రేనమః జపం మంచిది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శారీరక శ్రమ ఉంటుంది. అనుకున్న పనులు పూర్తిచేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. నిల్వధనం పెంచుకునే ఆలోచనలు చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. ఆచి, తూచి వ్యవహరించాలి. సంప్రదింపులు అనుకూలిస్తాయి. శుభవార్తలను వింరు. వృత్తి ఉద్యోగాదుల్లో నిరుత్సాహం ఏర్పడుతుంది. సౌకర్యవంతమైన ప్రయాణాలు చేస్తారు. శ్రీ దత్త శ్శరణం మమ జపం మంచిది.
undefined
click me!