వార ఫలాలు 28 మే నుంచి 3జూన్ 2021

First Published May 28, 2021, 10:03 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు, సహచరులు అన్ని విధాలా సహకరిస్తారు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా.. ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు ఆశించిన మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు, సహచరులు అన్ని విధాలా సహకరిస్తారు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు మొదట్లో నిరాశపర్చినా క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త విధులు ఉత్సాహంగా కొనసాగిస్తారు. పారిశ్రామిక వర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం కొన్ని పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల చర్యలను గమనిస్తూ ఉండండి. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త విధులు సవాలుగా మారవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొన్ని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. చర్చలు సఫలం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు సాధిస్తారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయ వర్గాలకు ప్రజాదరణ మరింత లభిస్తుంది. వారం చివరిలో మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం నిరుద్యోగుల కృషి కొంతమేర ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి, శ్రమ కొంతమేర తగ్గుతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బందువులతో విభేదాలు. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో కొత్త విధులు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి అవకాశాలు మరిన్ని దక్కే సూచనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత ఉంటుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. తగింత లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో దన వ్యయం. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పనులు కొంత నిదానంగా కొనసాగిస్తారు. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహణపై చర్చలు జరుపుతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం కొన్ని వేడుకలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. ఉన్నత హోదాలలో ఉన్న వారితో పరిచయాలు. ఒక సంతోషకరమైన సమాచారం రాగలదు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. కళారంగం వారికి వివాదాలు సద్దుమణుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!