ఈ వారం( సెప్టెంబర్ 27నుంచి అక్టోబర్ 4 వరకు) రాశిఫలాలు

First Published Sep 27, 2019, 10:31 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వ్యతిరేకలు అధికమౌతాయి. పోటీలు ఒత్తిడులను అధిగమించాలి. వ్యాపారాదుల్లో అనుకూలత. ఋణవిముక్తమయ్యే ప్రయత్నం. క్రమంగా భాగస్వామ్యాలలో అనుకూలత. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. వ్యాపార వ్యవహారాల్లోకొంత అప్రమత్తంగా మెలగాలి. మనస్సు అనిశ్చితంగా ఉండే అవకాశం. కార్యనిర్వహణ దక్షత ఉంటుంది. అనుకోని ఇబ్బందులు, అనారోగ్య భావనలు. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ముఖ్య నిర్ణయాదులను వాయిదా వేయటం మంచిది. గౌరవలోపాలకు అవకాశం ఏర్పడుతుంది.
undefined
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆలోచనల్లో ఒత్తిడులకు అవకాశం ఏర్పడుతుంది. కొంత ఆందోళన తప్పకపోవచ్చు. సంతానవర్గ వ్యవహారాల్లో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. సృజనాత్మకత తగ్గుతుంది. క్రమంగా వ్యతిరేకతలను అధిగమిస్తారు. పోటీల్లో విజయం సాధిస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. వ్యవహారాల్లో శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఋణ రోగాదులపై విజయం సాధిస్తారు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. భాగస్వామ్యాల అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు, స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సౌకర్యాలు ప్రభావితం చేస్తాయి. శ్రమాధిక్యం పెరుగుతుంది. ఆహార విహారాల్లో ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాదుల్లో సమస్యలు వస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. గృహ, వాహనాది విషయాల్లో సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. క్రమంగా ఆలోచనల్లో పరిణతి వస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం. సంతానవర్గంతో సంతోషంగా గడుపుతారు. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. వ్యతిరేకతలు ఉన్నా విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు సాధిస్తారు.
undefined
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సంప్రదింపులకు అనుకూలంగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. కాని సమస్యలకు కూడా అవకాశం ఏర్పడుతుంది. సోదరవర్గంతో ఒత్తిడులు ఏర్పడతాయి. వ్యాపారాదుల్లో సంతృప్తి లభిస్తుంది. శుభాశుభ వర్తమానాలు వినే అవకాశం. క్రమంగా సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలకు అనుకూలం. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. విద్యారంగం వారికి అనుకూలమైన సమయం. అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతానవర్గంతో సంతృప్తి ఏర్పడుతుంది.
undefined
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. బంధువర్గంతో సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట విలువ తగ్గే సూచనలు. మౌనంగా ఉండడం మంచిది. తొందరపాటు పనికిరాదు. స్పందనలు తగ్గించుకోవాలి. క్రమంగా సంప్రదింపులు పెరుగుతాయి. స్త్రీవర్గ సహకారం లభిస్తుంది. కాంక్టులు లాభిస్తాయి. విహార యాత్రలకు అవకాశం ఏర్పడుతుంది. మంచి వార్తలు వినే అవకాశం. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సౌకర్యాలపైదృష్టి పెరుగుతుంది. ఆహార విహారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌఖ్యంగా గడుపుతారు.
undefined
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నిర్ణయాదుల వల్ల సమస్యలుటా యి. ఆత్మ విశ్వాసం లోపాలు ఏర్పడతాయి. అనేక రకాల భావాలు ఇబ్బందిపెట్టే సూచనలు. తొందరపాటు పనికిరాదు. బాధ్యతల నిర్వహణలో శ్రమ తప్పకపోవచ్చు. క్రమంగా కుటుంబ ఆర్థికాంశాల్లో శుభపరిణామాలు ఏర్పడతాయి. బంధువర్గీయులతో అనుకూలత ఏర్పడుతుంది. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొన్ని అనూహ్య పరిణామాలకు అవకాశం ఏర్పడుతుంది. వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. శుభమైన వార్తలు వినే అవకాశం. సంప్రదింపులకు అనుకూలమైన సమయం.
undefined
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కాలం, ధనం, శ్రమ కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. ప్రయాణాదుల్లో జాగ్రత్త అవసరం. సౌఖ్యలోపం ఏర్పడుతుంది. క్రమంగా ఆత్మవిశ్వాసంతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. బాధ్యతలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి ఏర్పడుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకున్నా ఖర్చులు తప్పకపోవచ్చు. విహార యాత్రలకు అవకాశం. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గ వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక జరుగుతుంది.
undefined
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : ప్రారంభంలో లాభాలు సంతోషాన్నిస్తాయి. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలుటా ంయి. కొత్త పనులపై దృష్టి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వ్యాపారాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. కార్యనిర్వహణలో సంతోషం కలుగుతుంది. క్రమంగా ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. ధనాన్ని కాలాన్ని సంతోషం కోసం వెచ్చిస్తారు. సౌఖ్యంగా గడిపే ప్రయత్నం. ఆలోచనలకు రూపకల్పన అవసరం. గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. బాధ్యతలు విస్తరిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయటం మంచిది.
undefined
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు ఏర్పడతాయి. అధికారుల వల్ల సమస్యలు వస్తాయి. అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. సామాజిక గౌరవం ఉన్నా అధిక శ్రమ తప్పదు. అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా మెలగాల్సిన అవసరం ఉంటుంది. సౌకర్యాలు పెంచుకుటాంరు. ప్రయాణావకాశాలు పెరుగుతాయి. క్రమంగా అన్ని పనుల్లోనూ లాభాలుటాయి. ప్రయోజనాలు సంతోషాన్నిస్తాయి. సంతృప్తినీ ఇస్తాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు. కీర్తి ప్రతిష్టలు విస్తరించే అవకాశం. ఖర్చులు అధికం అవుతాయి. సౌఖ్యంగా గడుపుతారు.
undefined
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉన్నత లక్ష్యాలపై దృష్టి పెరుగుతుంద సుదూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక వ్యవహారాల విషయంలో అసంతృప్తి ఏర్పడుతుంది. అధికారిక గుర్తింపుపై ప్రీతి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంప్రదింపులు ఉంటా యి. సామాజిక గౌరవం పెరుగుతుంది. క్రమంగా వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నతి లభిస్తుంది. పదోన్నతులకు కూడా సరియైన సమయం. తండ్రి తరఫు వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. గురువులను, పెద్దలను సందర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. సంతానవర్గంతో అనుకూలత ఏర్పడుతుంది.
undefined
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. అనుకోని సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు పెరుగుతాయి. ఊహించని సంఘటనలు వస్తాయి. కార్యనిర్వహణ లోపం ఏర్పడుతుంది. కాలం, ధనం, వ్యర్థమయ్యే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. క్రమంగా ఉన్నత కార్యక్రమాలపై దృష్టి పెరుగుతుంది. సుదూర లక్ష్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక స్థలాల దర్శనం ఉంటుంది. వ్యవహారాల్లో సమున్నత దృష్టి పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది.
undefined
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : భాగస్వామ్యాల్లో ఒత్తిడులుటాయి. పరిచయాలు స్నేహానుబంధాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనేక రకాల వ్యవహారాలతోనూ, వ్యక్తులతోనూ కలిసి పనిచేయాల్సి రావచ్చు. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. వ్యాపారానుబంధాలు విస్తరిస్తాయి. క్రమంగా అనుకోని సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు ఏర్పడతాయి. అన్ని పనుల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఊహించని సంఘటనలు ఏర్పడతాయి. ఆర్థిక సామాజికంశాల్లో సమస్యలకు అవకాశం కలుగుతుంది. కొత్త నిర్ణయాలు వాయిదా వేయుట మంచిది. దానధర్మాల వల్ల మేలు
undefined
click me!