వారఫలితాలు 25 జూన్ శుక్రవారం నుండి జులై 1 గురువారం 2021

First Published Jun 25, 2021, 10:42 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మీ మనస్సులో ఉన్న అంచనాలు నిజమవుతాయి

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయరంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అనుకున్న విధంగా అందుతాయి. ఈతిబాధలు కొంతమేర తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. మీ మనస్సులో ఉన్న అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. కొత్త ఆశలతో ముందుకు విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన విద్యావకాశాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మేరకు మార్పులు ఉంటాయి. కళారంగం వారి కలలు ఫలించే సమయం. వారం చివరిలో బంధువులతో విభేదాలు నెలకొంటాయి. కొంత అనారోగ్యం. కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అను కూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి నేర్పుగా బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఒత్తిడులు. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు ఎవరి సాయం లేకుండా నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహకరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు ఎట్టకేలకు దక్కుతాయి. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సఫలమవుతాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో చర్చలు ఫలిస్తాయి. స్థిరాస్తుల వృద్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం సమాజంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కాస్త ఊరట లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. వాహనయోగం కలుగుతుంది. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. నిరుద్యోగులకు పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ఆప్తులతో వివాదాలు. ధనవ్యయం. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. భాగస్వాముల సహకారం అందుతుంది. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉన్నా అవసరాలు తీరతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమయ్యే సమయం. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇంటాబయటా మీమాటే నెగ్గుతుంది. శత్రువులను కూడా నేర్పుగా ఆకట్టుకుంటారు. స్థిరాస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో తగినంత లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత నయమనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తుల విషయంలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. మీ సేవలు విస్తృతమవుతాయి. కొన్ని పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు. ఇంటి నిర్మాణయత్నాలు కొంత సానుకూలమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఒక సంఘటన మీలో మార్పు తేవచ్చు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు, సూచనలు పాటిస్తారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. దైవకార్యాలలో పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!