ఈ వారం18 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ వరకు రాశిఫలాలు

First Published | Oct 18, 2019, 8:08 AM IST

వృశ్చికరాశివారు 19,20,21 తేదీల్లో, ధనుస్సు రాశివారు 22,23 తేదీల్లో మకరం వారు 24, 25 తేదీల్లో అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మానసిక చికాకులు అధికం అయ్యే సూచనలు. ఇప్పినుంచే నిరంతర జప స్తోత్ర పారాయణాదులు, దానాదులు చేస్తూ ఉండడం మంచిది.

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : అనవసర ప్రయాణాలుటాంయి. మీడియా రంగంలోని వారికి అనుకూలత ఏర్పడుతుంది. సంప్రదింపులలో జాగ్రత్తవహించాలి. కమ్యూనికేషన్స్‌లో లోపాలకు అవకాశం. సోదరవ్గ వ్యవహారాల్లో కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. గృహం, వాహనం మొదలైన అంశాలపై దృష్టి పెరుగుతుంది. ఆహార విహారాలుటాంయి. సౌఖ్యంగా కాలం గడిపే అవకాశం. సౌకర్యాలు సంతోషాన్నిస్తాయి. విద్యారంగంలోని వారికి అత్యంత అనుకూలం. కృషితో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. మాతృవర్గం వారి వ్యవహారాలపై దృష్టి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : కుటుంబ వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక నిర్ణయాలకు అనుకూలమైన సమయం. బంధువర్గంతో అప్రమత్తంగా మెలగాలి. నిల్వధనం కోల్పోయే అవకాశం. కాలం, ధనం వ్యర్థం కావచ్చు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. మంచి వార్తలు వింరు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. ఉన్నత విద్య, ఉద్యోగాదులపై దృష్టి సారిస్తారు. సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధకులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. సోదర వర్గంతో మంచి సంప్రదింపులకు అవకాశం. విందువినోదాల్లో పాల్గొటాంరు.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచి, తూచి వ్యవహరించాలి. తొందరపాటు పనికిరాదు. ఆత్మవిశ్వాస లోపాలకు అవకాశం. కాలం, ధనం వ్యర్థం కావచ్చు. ఎదుివారితో జాగ్రత్తగా మెలగాలి. భాగస్వామ్యాల్లో సమస్యలు తప్పవు. చికాకులకు అవకాశం. కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. బంధువర్గంతో సంతషంగా ఉంటారు. నిల్వధనం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు కూడా ఉండవచ్చు. సమస్యలను అధిగమిస్తారు. సంతోషంగా గడుపుతారు.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : వ్యర్థమైన ఖర్చులకు అవకాశం. పెట్టుబడులు అధికం అవుతాయి. కాలం, ధనం కోల్పోవచ్చు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పరామర్శలకు అవకాశం. ఆసుపత్రులను దర్శించే అవకాశం. పోటీరంగంలో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. వ్యర్థమైన ప్రయాణాలుటాంయి. దానధర్మాల వల్ల మేలు కలుగుతుంది. నిర్ణయాదులకు అనుకూలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కార్యనిర్వహణ దక్షత పెరుగుతుంది. అనేక బాధ్యతలుటాంయి. సంతోషంగా కాలం గడుపుతారు. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : లాభాలపైదృష్టి పెరుగుతుంది. ప్రయోజనాపేక్ష పెరుగుతుంది. పెద్దలతో కొంత జాగ్రత్త అవసరం. అతి లాభాలకోసం ఆశించి భంగపడే అవకాశం ఏర్పడవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త పనుల నిర్వహణలో సమస్యలు ఎదురౌతాయి. ఖర్చులు పెట్టుబడులు అధికం. వినోదాలు, విహారాల కోసం కాలం ధనం వెచ్చించే అవకాశం. విశ్రాంతి లభిస్తుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. వ్యతిరేకతలపై విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. వస్తు సముదాయం సమకూర్చుకుటాంరు. నిర్ణయాదులు లాభిస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులుటాంయి. అధికార వ్యవహారాల్లో లోపాలకు అవకాశం. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. అనేక రకాల పనులు వరుసగా ఇబ్బంది పెడుతాంయి. వ్యాపార వ్యవహారాలు, సేవారంగంలో ఆచి, తూచి వ్యవహరించాలి. పితృవర్గం వారితో చికాకులుటాంయి. అన్ని పనుల్లో ప్రయోజనాలుటాంయి. కొత్త పనులపై దృష్టి సారిస్తారు. మంచి ఆలోచనలు చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం. పెద్దల నుంచి ఆశీస్సులు అందుతాయి. వేరు వేరు రూపాల్లో లాభాలు అందుతాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఉన్నత లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రయాణాలు చేస్తారు. అసంతృప్తి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక యాత్రల వల్ల మేలు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు తగ్గిపోయే అవకాశం. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. సేవకవర్గ సహకారంపై ధృష్టి పెరుగుతుంది. సోదరులతో విభేదాలు వస్తాయి. సంప్రదింపుల్లో సమస్యలు వచ్చే సూచనలు. సామాజిక గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు. వ్యాపారాదుల్లో గుర్తింపు లభిస్తుంది. లాభాలు వస్తాయి. ఆహార విహారాలపై దృష్టి సారిస్తారు. సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : అనుకోని సమస్యలు వస్తాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అన్ని పనుల్లోనూ అప్రమత్తంగా మెలగాలి. ముఖ్య కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనిశ్చితమైన పనులు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. నిల్వధనం కోల్పోయే అవకాశం. మాట విలువ తగ్గుతుంది. చికాకులు అధికం అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం ఏర్పడుతుంది. విద్య, వైజ్ఞానిక యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొటాంరు. ఉన్నత ఉద్యోగాదులకు అవకాశం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : భాగస్వామితో సమస్యలు. పరిచయాలు స్నేహాలు ఇబ్బంది పెట్టవచ్చు. సామాజిక అనుబంధాలు ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. నిర్ణయ లోపాలు ఏర్పడతాయి. ఆలస్యం, బద్ధకం పెరుగుతుంది. అప్రమత్తంగా మెలగాలి. తొందరపాటు వ్యవహారాలు కూడదు. అనుకోని సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య భావనలు వచ్చే సూచనలు. అన్ని పనుల్లోనూ జాగ్రత్త అవసరం. కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది. మాట విలువ పెరగవచ్చు. ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : పోటీలు ఒత్తిడులు చికాకులు ఏర్పడతాయి. విజయసాధనకోసం ప్రయత్నం చేస్తారు. మొండితనంతో వ్యవహరిస్తారు. వ్యతిరేకతలను అధిగమిస్తారు. ఋణాదులు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడాలి. పోటీరంగంలో అప్రమత్తంగా మెలగాలి. వ్యర్థమైన ఖర్చులుటాంయి. భాగస్వామ్యాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పరిచయాలు స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలకు అవకాశం. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పాత మిత్రులు గుర్తుకు వస్తారు. కార్యనిర్వహణ చేస్తారు.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. నిర్ణయ లోపాలకు అవకాశం. స్థిమితంగా ఉండాలి. సంతానవర్గసంబంధ సమస్యలుటాంయి. పనుల నిర్వహణలో ప్రణాళికా లోపాలకు అవకాశం. సృజనాత్మకత శక్తి ఉన్నా రాణింపు తక్కువగా ఉంటుంది. వ్యతిరేకతలు, పోటీలు అధికంగా వస్తాయి. వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. శ్రమతో కార్యక్రమాలను నిర్వహిస్తారు. గుర్తింపు లభిస్తుంది. రోగ ఋణాలను అధిగమించాలి. విజయం సాధిస్తారు. ఖర్చులు పెట్టుబడులు అధికం అవుతాయి. విశ్రాంతికోసం ప్రయత్నం చేస్తారు.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సౌకర్యాదులపై దృష్టి సారిస్తారు. ఆహార విహారాలున్నా ఆశించిన సంతృప్తి ఉండకపోవచ్చు. శ్రమతో కార్యక్రమాల నిర్వహణ చేస్తారు. గృహ, వాహనాదుల విషయంలో అప్రమత్తంగా మెలగాలి. సామాజిక గౌరవం తగ్గే సూచనలు కనబడుతున్నాయి. శ్రమాధిక్యం ఏర్పడుతుంది. పితృవర్గంతో సమస్యలు వస్తాయి. కార్యనిర్వహణలో జాగ్రత్త అవసరం. ఆలోచనలకు రూపకల్పన ఏర్పడుతుంది. సంతోషంగా సంతానంతో కాలం గడుపుతారు. సృజనాత్మకత పెరుగుతుంది. నిర్ణయాలు సంతోషాన్నిస్తాయి. ప్రణాళికాబద్ధమైన వ్యవహారం చేస్తారు.

Latest Videos

click me!