1.వృషభ రాశి...
వృషభ రాశివారు ఇంద్రియాలకు సంబంధించినవారు, స్పర్శలు గలవారు మరియు కృతనిశ్చయం గలవారు, ఎలాంటి సవాలునైనా అధిగమించగల సామర్థ్యం కలిగి ఉంటారు. వారు విధేయత, స్థిరత్వానికి విలువ ఇస్తారు. వారి నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఆచరణాత్మకంగా ఉంటారు. వృషభ రాశి పురుషులు మార్పును నిరోధిస్తారు. ఈ రాశివారు తమ జీవిత భాగస్వామిని కనుగొనడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎక్కువగా మాట్లాడరు. రిస్క్ తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. వీరు ప్రేమలో పడటానికి ఈ రాశివారు ఆలస్యం కావచ్చు. కానీ, జీవితంలో వచ్చిన భాగస్వామిని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటారు. తమ భాగస్వామి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కువ కేర్ చూపిస్తారు. తమ ప్రేమ, కోపం, విచారం అన్నీ చూపిస్తారు. గాఢంగా ప్రేమిస్తారు. ఎప్పుడు ఎలాంటి ప్రేమ చూపించాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశివారి జీవితంలోకి వచ్చేవారికి నిజమైన ప్రేమ లభిస్తుంది