Today Horoscope: ఓ రాశివారికి బంధువుల తాకిడి, డబ్బు బాగా ఖర్చవుతుంది

Published : Apr 10, 2024, 05:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

PREV
112
Today Horoscope: ఓ రాశివారికి బంధువుల తాకిడి, డబ్బు బాగా ఖర్చవుతుంది
telugu astrology

10-4-2024, బుధవారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు:-(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు)నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.

భరణి నక్షత్రం వారికి జన్మతార(జన్మతారాధిపతి రవి) అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

కృత్తిక నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ)ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

దిన ఫలం:-ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రత్యర్ధులు పై పైచేయి సాధిస్తారు.మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించిన ధన లాభం పొందుతారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.కీలకమైన సమస్య కు కుటుంబ వ్యక్తుల సహాయ సహకారాలు లభిస్తాయి.ఓం లక్ష్మీ నరసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

212
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్ర)విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

మృగశిర నక్షత్రం వారికి నైధనతార(నైధనతారాధి శని)తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఆకస్మిక ధన లాభం కలుగును. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.కుటుంబంలో ఆనందకరమైన ఆహ్లాదకరంగా ఉంటుంది.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మనస్సునందు ఉన్న ఆలోచన ఆచరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.ఇంటా బయట గౌరవం లభిస్తుంది.గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

312
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి సాధన తార(సాధన తారాధిపతి చంద్రుడు)అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

పునర్వసు నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు )అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

దిన ఫలం:-కుటుంబ కలహాలు రాగలవు. సమస్యలో  తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వాదప్రతివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సంఘటనలు ఉద్రేకాలు కి దారి తీయను.మిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు.ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.ఉద్యోగాలలో అధికారులు తో మనస్పర్థలు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం అని ఓం ఆదిత్యాయ నమః జపించండి శుభ ఫలితాలను పొందండి.

412
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి క్షేమతార( క్షేమ తారాధిపతి గురువు)పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

ఆశ్రేష నక్షత్రం వారికి విపత్తార(విపత్ తారాధిపతి రాహువు)వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

దిన ఫలం:-తలపెట్టిన కార్యాలలో విజయం చేకూరును.శారీరక శ్రమ తగ్గి బలపడతారు.వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది.చేసే పనుల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు.కీలకమైన సమస్య పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు.ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

512
telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు)నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

పూ.ఫ నక్షత్రం వారికి జన్మతార(జన్మతారాధిపతి రవి)అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి పరమ మిత్ర తార(పరమ మిత్ర తారాధిపతి కుజ)ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకతను తగ్గించుకుని వ్యవహరించాలి.

దిన ఫలం:-మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు.సమాజంలో ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.శరీర సౌఖ్యం లభిస్తుంది.చేసే పనుల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఉద్యోగాలు అనుకూలంగా ఉంటాయి.నూతన అవకాశాలను పొందగలరు.ఓం కుమారాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

612
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్ర)విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

చిత్త నక్షత్రం వారికి  నైధనతార(నైధనతారాధి శని)తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

దిన ఫలం:-ముఖ్యమైన పనులు వాయిదా పడును. సంఘములో నిందారోపణలు రాగలవు. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలి.శారీరక శ్రమ పెరుగుతుంది.సంతానంతో విరోధాలు ఏర్పడవచ్చు.అకారణంగా కలహాలు ఏర్పడగలవు.మానసికంగా నిరుత్సాహంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వృత్తి వ్యాపారాలలో  ఆశించిన ధనలాభం కనబడదు.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

712
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

విశాఖ నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

దిన ఫలం:-ఇతరుల మీద ద్వేషం అసూయ లు రాగలవు.ఆకస్మిక పరిణామాలు ఎదురవచ్చు. కీలకమైన సమస్యల వలన మనస్సు నందు చికాకుగా ఉంటుంది.మిత్రులతో మనస్పర్థలు ఏర్పడగలవు.అనుకోని ఖర్చులు పెరిగి ఆందోళనకు గురవుతారు. తలపెట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడును.శారీరకంగా మానసికంగా బలహీన ఉంటారు. ఉద్యోగాలలో అధికారులు తో కలహాలు ఏర్పడును.వృత్తి వ్యాపారాలు మందగమనం గా ఉంటాయి.ఓం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

812
telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి క్షేమతార( క్షేమ తారాధిపతి గురువు)పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఆనందంగా గడుపుతారు

జ్యేష్ట నక్షత్రం వారికి విపత్తార(విపత్ తారాధిపతి రాహువు)వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

దిన ఫలం:-మనస్సులో అనేకమైన ఆలోచనలతో  చికాకుగా ఉంటుంది.చేసే పనుల్లో అలసత్వం పెరుగుతుంది.వృత్తి  వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని సంఘటనల వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు.సమాజంలో కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహరించాలి.చేసే ఖర్చు యందు నియంత్రణ అవసరం. వాహన ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది.కుటుంబం పట్ల తగు శ్రద్ధ వహించవలెను.ఓం నమో వెంకటేశాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

912
telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ  1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  సంపత్తార(సంపత్ తారాధిపతి బుధుడు)నూతన వ్యక్తులు తో స్నేహ సంబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి

పూ.షాఢ నక్షత్రం వారికి  జన్మతార(జన్మతారాధిపతి రవి)అధికారుల వలన ఇబ్బందులు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.

ఉ.షాఢ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ)ఆర్థిక విషయాలు చికాకుగా ఉంటుంది. చేసే వ్యవహారంలో ఉద్రేకం తగ్గించుకుని వ్యవహరించాలి.

దిన ఫలం:-వ్యాపారములో  తొందరపాటు నిర్ణయాల వలన కొత్త సమస్యలు రాగలవు. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.గృహమున. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు ఏర్పడగలవు.ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం. సమాజంలో అవమానం జరిగే అవకాశం.మనస్సులో  అనేక ఆలోచనలతో ఆందోళనకరంగా ఉంటుంది.కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి.ఓం త్రయంబకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1012
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి మిత్ర తార(మిత్ర తారాధిపతి శుక్ర)విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉన్నతాధికారులతో స్నేహ సంబంధాలు బలపడతాయి.

ధనిష్ఠ నక్షత్రం వారికి నైధనతార(నైధనతారాధి శని)తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడును. అధికారులు తో నూతన సమస్యలు రాగలవు.

దిన ఫలం:-శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.సమాజంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది.  తలపెట్టిన పనులు అన్నీ సకాలంలో పూర్తవుతాయి.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  సాధన తార(సాధన తారాధిపతి చంద్రుడు)అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అగును. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

పూ.భా నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు.

దిన ఫలం:-పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.వ్యాపారం లాభసాటిగా జరుగును.రావలసిన బాకీలు వసూలు అవును.ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు.అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు.ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వివాదాలు కేసులు అనుకూలంగా ఉండును.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఓం నమశ్శివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1212
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భా  నక్షత్రం వారికి క్షేమతార( క్షేమ తారాధిపతి గురువు)పెద్దల ఆదరాభిమానాలు పొందగలరు.ధన విషయంలో రావలసిన బాకీలు వసూలు చేస్తారు.ఆనందంగా గడుపుతారు

రేవతి నక్షత్రం  వారికి విపత్తార(విపత్ తారాధిపతి రాహువు)వృత్తి వ్యాపారాలలో ఆశించిన ధన లాభం పొందడం కష్టం కరంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

దిన ఫలం:-ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది.మిత్రులతో సఖ్యతగా వ్యవహరించాలి.  కోపా ఆవేశాలకు దూరంగా ఉండవలెను.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.నమ్మిన వారి వలన సమస్యలు ఏర్పడగలవు.ఇతరులతో వాగ్వాదం లకు దూరంగా ఉండాలి.బంధువుల తాకిడి వీటికి తోడవుతుంది.  కుటుంబంలో ప్రతికూలత వాతావరణం.మనస్సులో  అనేక ఆలోచనలతో  చికాకుగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Read more Photos on
click me!

Recommended Stories