Zodiac sign: ఈ రాశుల వారికి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ..!

Published : Jul 20, 2022, 10:01 AM IST

అందరితోనూ సరదాగా, ఫన్నీగా ఉండటం అందరి వల్లా కాదు. ఇది చాలా కష్టమైన పని అనే చెప్పొచ్చు. అయితే...జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశుల వారిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువట.

PREV
16
Zodiac sign: ఈ రాశుల వారికి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ..!

సెన్సాఫ్ హ్యూమర్ అందరికీ ఉండదు. ఇది చాలా అరుదు. అందరితోనూ సరదాగా, ఫన్నీగా ఉండటం అందరి వల్లా కాదు. ఇది చాలా కష్టమైన పని అనే చెప్పొచ్చు. అయితే...జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశుల వారిలో సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

26

1.మిథున రాశి..
మిథున రాశివారికి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. వీరు  చాలా ఫన్నీగా ఉంటారు. వారు అందరినీ నవ్వించడంలో చాలా ఫేమస్. చాలా చురుకుగా మాట్లాడతారు. తమ మాటలతో అందరినీ నవ్విస్తూనే ఉంటారు. అయితే.. వీరు సెన్సాఫ్ హ్యూమర్ ని చాలా మంది గుర్తించరు.  కానీ.. వీరు మాత్రం చాలా  ఫన్నీగా ఉంటారు. వీరితో  ఉంటే  చాలా సరదాగా ఉంటుంది.
 

36

2.సింహ రాశి..

సింహరాశి వారికి తమ చుట్టూ ఉన్నవారిని ఎలా నవ్వించాలో తెలుసు. వీరికి సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. అంతే కాకుండా.. వీరు అందరిలోనూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి అనుకుంటారు. అందుకే.. వీరు తమ మాటలతో అందరినీ నవ్విస్తూ.. తమను పాపులర్ చేసుకుంటారు. అందరినీ ఆకర్షిస్తారు. వీరు కాస్త కష్టపడితే.. స్టాండప్ కమెడియన్ లుగా కూడా గుర్తింపు పొందగలరు.

46

3.కన్య రాశి..

కన్య రాశివారిలోనూ సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. మనం ఊహించని పరిస్థితుల్లోనూ వీరు అందరినీ తమ మాటలతో నవ్వించగలరు. వీరి జోక్స్ కూడా చాలా తెలివిగా ఉంటాయి. వీరు  తమ మాటలతో ఎంతటి వారినైనా నవ్వించగలరు. అందరికీ వీరు తెగ నచ్చేస్తూ ఉంటారు. ఇలా అందరినీ తమ మాటలతో మాయ చేస్తుంటే.. కొందరు అసూయపడే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి జోకులు వేయాలో వీరికి బాగా తెలుసు. 

56

4.ధనస్సు రాశి..

ధనస్సు రాశివారిలోనూ సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. చాలా ఉద్రిక్తంగా ఉన్న వాతావరణాన్ని కూడా వీరు తమ మాటలతో ఆహ్లాదంగా చేయగలరు. వీరి మాటలకు ఎవరైనా నవ్వేయాల్సిందే. అయితే.. వీరికి ఎక్కడ జోకులు వేయాలో.. ఎక్కడ వేయకూడదో తెలీదు. సీరియస్ సమయాల్లో జోకులు వేసి.. అందరిచేతా తిట్లు తినే సందర్భాలు కూడా ఎక్కువ.

66

5.మేష రాశి..

మేషరాశివారు తేలికపాటి హాస్యాన్ని కలిగి ఉంటారు. వీరు అందరిపై జోకులు వేస్తారు కానీ వారు మనోభావాలను దెబ్బతీయకుండా చూసుకుంటారు. వారు తమ సహచరులు, స్నేహితులు మొదలైన వారితో బంధం కోసం జోక్‌లను ఉపయోగిస్తారు. వీరి జోకులు  చాలా సరదాగా ఉంటాయి.
 

click me!

Recommended Stories