ఈ రాశులవారు తరచూ తమ భార్యలను అనుమానిస్తూనే ఉంటారు..!

Published : Feb 18, 2022, 12:08 PM IST

వారి జీవితం అనుకున్నట్లుగా సాగదు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల పురుషులు.. నిత్యం తమ భార్యలను అనుమానిస్తూ ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా.  

PREV
16
ఈ రాశులవారు తరచూ తమ భార్యలను అనుమానిస్తూనే ఉంటారు..!
Spy Generic

ఒక బంధం అందంగా ఉండాలి అంటే... వారి మధ్య నమ్మకం, విశ్వాసం, విధేయత చాలా అవసరం. ఇవి లేకుంటే ఆ బంధానికి పునాదులు ఉండవు. ఆ బంధం ఎప్పుడు విరిగిపోతుందా అన్నట్లు ఉంటుంది.  ఒకరిపై మరొకరికి అసూయ, ద్రోహం లాంటి భావాలు పెరిగిపోతాయి. ముఖ్యంగా తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తిని నమ్మడం అలవాటు చేసుకోవాలి. లేదంటే.. వారి జీవితం అనుకున్నట్లుగా సాగదు. జోతిష్యశాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల పురుషులు.. నిత్యం తమ భార్యలను అనుమానిస్తూ ఉంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దామా.

26

1.మేష రాశి..
ఈ రాశివారు అన్ని విషయాల్లో చాలా ముక్కుసూటిగా ఉంటారు. కొంచెం కంగారు ఎక్కువ. ఎదుటివారు చెప్పేది కూడా వినరు. ఎప్పుడూ.. తమ భాగస్వామి తమను మోసం చేస్తోంది అనే భావనలో ఉండిపోతారు. అందులో నిజం ఎంత ఉంది అనేది ఆలోచించరు. తరచూ తమ భార్య  ఫోన్ చెక్ చేస్తూ ఉంటారు.

36

2.వృషభ రాశి..
వీరికి రిలేషన్ లో సీరియస్ గా ఉండటం తెలీదు.  వీరు నిజాయితీ ఉండనివారిని తమ జీవితంలో రానివ్వరు. ఇక వీరు తరచూ తమ భాగస్వామిపై అనుమానిస్తూ ఉంటారు. వారిపై సీక్రెట్ గా గూడచర్యం చేస్తుంటారు.

46

3.కన్య రాశి..
ఈ రాశివారు అన్ని విషయాల్లో చాలా పట్టుదలగా ఉంటారు. ముఖ్యంగా జీవితం, వృత్తి విషయంలో చాలా పట్టదలగా ఉంటారు. కానీ .. తమ భార్య విషయానికి వస్తే మాత్రం.. కనికరం చూపించరు. వారిపై గూఢచర్యం చేస్తారు. ఆ విషయం పట్టుపడకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు.

56

4.ధనస్సు రాశి..
సాక్ష్యాలను సేకరించేందుకు తమ భాగస్వామి ఫోన్‌లను తనిఖీ చేసిన విషయాన్ని కూడా వారు ఒప్పుకుంటారు. వారు అంతులేని గందరగోళం , సందేహాల లూప్‌లో కూరుకుపోవాలని కోరుకోరు, అందువల్ల వారి మనస్సును అన్నింటి నుండి విడిపించుకోవడానికి.. నిజం తెలుసుకోవాడానిక భార్యను తరచూ ఫాలో అవుతూ ఉంటారు. గూఢచర్యం చేస్తూ ఉంటారు.

66

5.మకర రాశి..
వారు జీవితంలో మంచిని కోరుకునే వారు. వారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు. అయితే భార్య విషయంలో మాత్రం కాస్త అనుమానం వీరిలో ఉండిపోతుంది.. మకరరాశి వారు తమ భాగస్వామిపై చాలా తెలివిగా గూఢచర్యం చేస్తారు. అది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడతారు.

click me!

Recommended Stories