వామ్మో ఈ రాశివారు.. తమ పార్ట్ నర్స్ పై మైండ్ గేమ్స్ ఆడతారు..!

First Published Jan 14, 2022, 12:25 PM IST

కొందరైతే.. తమ పార్ట్ నర్స్ తో మైండ్ గేమ్స్ ఆడేస్తూ ఉంటారు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.  మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

ఏ ఒక్కరి మనస్తత్వం ఒక్కలా ఉండదు.  అందరూ తమ పార్ట్ నర్స్ తో ఒకేలా ఉండరు. కొందరు తమ పార్ట్ నర్స్ కి వెంటనే ప్రేమను తెలియజేస్తారు. కానీ కొందరు మాత్రం అలా ఉండరు. కొందరైతే.. తమ పార్ట్ నర్స్ తో మైండ్ గేమ్స్ ఆడేస్తూ ఉంటారు. అలాంటివారిని జోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పేయవచ్చట.  మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా..

1.మిథున రాశి..
సాధారణంగానే ఈ రాశివారు.. ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు.  వీరు.. తమ పార్ట్ నర్స్ పై మైండ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు.  వాళ్లు.. మైండ్ గేమ్ ఆడుతున్నారనే విషయాన్ని వారు అంగీకరించరు. కానీ.. వారు అలానే చేస్తారు. వీరికి.. తమ పార్ట్ నర్ పై పూర్తి నమ్మకం ఉండదు. దీంతో.. అసురక్షిత భావనతో ఉంటారు. కేవలం పార్ట్ నర్ ని మాత్రమే కాదు.. ఎవరినీ అంత తొందరగా నమ్మరు. అందుకే.. తమ ప్రేమను నిరూపించుకోమంటూ.. పార్ట్ నర్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు.

2.తుల రాశి..

ఈ రాశివారు.. ఒక రిలేషన్ లో ఉండటానికి ఇష్టపడతారు. అయితే.. ఏదైనా తేడా వచ్చి.. భాగస్వామితో విడిపోవాల్సి వస్తే... మరో ఆలోచన లేకుండా.. మరో వ్యక్తితో కనెక్ట్ అయిపోతారు. అయితే.. రిలేషన్ లో ఉన్నప్పుడు.. తమ పార్ట్ నర్ పై  మైండ్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారు.
 

3.వృశ్చిక రాశి..
రిలేషన్ షిప్ లో ఈ రాశివారు  చాలా తీవ్రంగా ఉంటారు. ప్రతి విషయంలో పార్ట్ నర్ తో గొడవ పడుతూ ఉంటారు. వారిపై మైండ్ గేమ్స్ ఆడి.. వారు బాధపడుతుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. పార్ట్ నర్ తో గొడవ పడటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వారి భాగస్వాములు తమను ప్రేమిస్తున్నారని పదే పదే చెప్పేలా చేస్తారు. వారు తమ భాగస్వాములను చాలా పరీక్షిస్తారు.

4.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎక్కువగా స్వేచ్ఛను కోరుకుంటారు. అయితే.. తమ పార్ట్ నర్ తమను బంధిస్తారేమో అనే భయం వారిలో ఉంటుంది. ఆ భయంతో.. వారు.. ఏమీ చేయకపోయినా..ముందుగానే అభద్రతా భావంతో.. వారిపై మైండ్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు. తమ పార్ట్ నర్ ని  విపరీతంగా బాధిస్తూ ఉంటారు.

5.మీన రాశి..
ఈ రాశివారు చాలా మంచివారు. కానీ..  వారి సహనాన్ని ఎవరైనా పరీక్ష పెడితే మాత్రం.. వీరిలో దుర్మార్గుడు బయటకు వస్తాడు. రిలేషన్ లో ఉన్నప్పుడు  1000 శాతం ప్రేమను  చూపిస్తారు కానీ.. తేడా వస్తే మాత్రం.. మైండ్ గేమ్స్ తో.. తమ పార్ట్ నర్ కి చుక్కలు  చూపిస్తారు. 

click me!