telugu astrology
1.వృషభ రాశి..
వృషభ రాశివారికి ఫుడ్ అంటే మహా ఇష్టం. వీరు ప్రాణమైనా ఇస్తారు.. కానీ తమ ఫుడ్ ని మాత్రం అస్సలు షేర్ చేయరు. తమ వస్తువులను కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. వీరికి ఏదైనా తమ వస్తువు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తమకు సంబంధించిన వాటిని వేటినీ ఎవరికీ పంచుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితి వస్తే.. వీరు చాలా నిరాశకు గురౌతారు.
telugu astrology
2.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారికి ఫుడ్ విషయంలో కనెక్షన్ చాలా ఎక్కువ. ఈరాశివారు ఫుడ్ తో ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఏర్పరుచుకుంటారు. అందుకే ఈ రాశివారు తమ వస్తువులు, ఫుడ్ ఇలా దేనినీ ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తమ ఫుడ్ ని షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. చాలా హెసిటేట్ అవుతారు. ప్రపంచలో ఎక్కడా లేని బాధ తమకే వచ్చినట్లు భావిస్తారు.
telugu astrology
3.సింహ రాశి..
సింహ రాశివారు అందరూ తమను చూడాలని, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ, తమ ఫుడ్ విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఫుడ్ అనే కాదు.. తమకు సంబంధించిన ఏ వస్తువును ఎవరితోనూ షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు. ఈ రాశివారు మొదట తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. తమ అసవరం తీరే అంత వరకు ఎవరికీ ఒక్క మెతుకు కూడా పెట్టరు. అన్నీ తమకే దక్కాలి అనే భావనలో ఉంటారు.
telugu astrology
4.కన్య రాశి...
కన్య రాశివారికి అన్ని విషయాల్లో ఫోకస్ చాలా ఎక్కువ. ఈ ఫోకస్ ని ఫుడ్ మీద కూడా పెడుతూ ఉంటారు. ఈ రాశివారు ఇతరుల ఫుడ్ ని తీసుకొని తింటారు.. కానీ తమ ఫుడ్ ని షేర్ చేసుకోవడం మాత్రం వీరి వల్ల కాదు.
telugu astrology
5.మకర రాశి..
ఈ రాశివారు వారు తినే ఆహారం.. తాము పడిన కష్టానికి వచ్చిన గుర్తింపులాగా భావిస్తారు. అందుకే.. అది తమకు మాత్రమే దక్కాలని భావిస్తూ ఉంటారు. తాము అంత కష్టపడిన సంపాదించిన ఫుడ్ ని మరొకరితో షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చని పని. చాలా ఇబ్బందిగా ఫీలౌతారు. దాదాపు షేర్ చేయరు కూడా. అంతేకాదు.. తాము తినే ఆహారం తమ స్టేటస్ లా ఫీలౌతారు. అందుకే వేరేవాళ్లతో షేర్ చేసుకోవడం వీరికి నచ్చదు.