నిత్యం గొడవలు పడుతూ ఉంటే ఎవరికైనా మనసుకు ప్రశాంతత అనేది ఉండదు. ప్రశాంతంగా, ఒకరి కోసం మరొకరు అనేలా, ఒకిరికి మరొకరు అండగా ఉంటే, ఆ దాంతప్య జీవితం ఆనందంగా సాగుతుంది. అయితే, ఆ కంపాటబులిటీ అందరు దంపతుల మధ్య ఉండకపోవచ్చు. వారు మంచిగా ఉండాలి అనుకన్నా కూడా , వారి జాతకంలో పలు గ్రహాలు వారిని ప్రశాంతంగా ఉండనివ్వవు. కానీ, జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశుల మధ్య కంపాటిబులిటీ అదిరిపోతుంది. ఈ కింది రాశులవారు బెస్ట్ కపుల్స్ కాగలరు. మరి,అందులో మీ రాశి, మీ పార్ట్ నర్ రాశి కూడా ఉందో లేదో, మీది బెస్ట్ జోడి అవునో కాదో తెలుసుకోండి.. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
మేషం, ధనుస్సు: మేషం , ధనుస్సు రెండు రాశులవారు ఆహ్లాదకరంగా ఉంటారు. ఈ రాశివారు ఒకరికొకరు అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. తోడుగా ఉంటారు. ఒకరికి మరొకరు స్వేచ్ఛను ఇస్తాను. సాధ్యమైనంత ఉత్తమమైన పరిస్థితులను ఎలా సృష్టించాలో వారికి తెలుసు. ఒకరికొకరు అనుకూలంగా ఉంటారు.
వృషభం , మకరం: వృషభ, మకర రాశుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మకరరాశి వారి ప్రణాళికలకు కట్టుబడి ఉంటారు. వృషభ రాశివారు కూడా దీనిని ఇష్టపడతారు. ఈ రెండు రాశుల ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఈ రెండు సంకేతాలు ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి, కానీ వారి కలలను నెరవేర్చాలనే కోరిక కూడా ఉన్నాయి. ఈ రెండు రాశుల మధ్య కంపాటబులిటీ ఎక్కువగా ఉంటుంది.
మిథున, తుల: ప్రేమ , కమ్యూనికేషన్ విషయంలో ఈ రెండు రాశుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. మిథున రాశివారు మాట్లాడటానికి ఇష్టపడతారు, తులారాశివారు చాలా ఓపికగా వినడానికి ఇష్టపడతారు. ఈ రెండు రాశులు ప్రేమలో ఉన్నప్పుడు భావవ్యక్తీకరణ , వారి భాగస్వాములు సంతోషంగా ఉండేలా చూసుకుంటారు.
కర్కాటకం, మీనం:ఈ రెండు రాశుల కాంబినేషన కూడా చాలా బాగుంటుంది.. మీనం చూపించే ప్రేమ, సృజనాత్మకత కర్కాటక రాశివారి ఆాలోచనలకు బాగా సూట్ అవుతాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు.
సింహం , వృశ్చికం: ఈ రెండు రాశులవారు మొండి స్వభావం కలిగి ఉంటారు. కానీ ఒకేలా ప్రేమిస్తారు. సింహరాశి , వృశ్చిక రాశివారు ఒకరితో ఒకరు సరళంగా , సున్నితంగా ఉండే అద్భుతమైన కెమిస్ట్రీని కలిగి ఉంటారు. ఈ జంట కాంబినేషన్ బాగుంటుంది.
కన్య , కుంభం: ఈ జంట మంచి స్నేహితులు అవుతారు. వీరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఈ రెండు రాశులవారు ఒకరికొకరు అన్ని విషయాల్లోనూ సమతుల్యం చేసుకుంటారు. ఈ రెండు రాశులవారు వారికి నచ్చే పనులు మాత్రమే చేస్తారు. ఒకరికొరు అండగా నిలుస్తారు. ఆలోచనలన్నీ ఒకేలా ఉంటాయి.