హగ్స్ ఇవ్వడంలో ఈ రాశివారు మాస్టర్స్..!

First Published | Sep 29, 2021, 2:04 PM IST

అదే.. ప్రేమను కౌగిలింత ద్వారా సులభంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. అయితే.. ఈ కౌగిలింతను కొందరు ఎక్కువగా కోరుకుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులవారికి హగ్ అంటే చాలా ఇష్టమట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..


మాటల్లో చెప్పలేని  చాలా విషయాలను చేతలతో చెప్పొచ్చు అని అంటూ ఉంటారు. ప్రేమ కూడా అంతే.. ఎంతలా ప్రేమిస్తున్నామంటే.. మాటల్లో చెప్పడం సాధ్యంకాకపోవచ్చు. అదే.. ప్రేమను కౌగిలింత ద్వారా సులభంగా అర్థమయ్యేలా చెప్పొచ్చు. అయితే.. ఈ కౌగిలింతను కొందరు ఎక్కువగా కోరుకుంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశులవారికి హగ్ అంటే చాలా ఇష్టమట. ఆ రాశులేంటో ఓసారి చూద్దాం..

1.మేషం..

ఈ రాశివారికి హగ్స్ ఇవ్వడమన్నా.. వారికి ఎవరైనా హగ్స్ ఇచ్చినా చాలా ఇష్టం. వీరు ప్రేమగా ఇచ్చే హగ్ ని ఎవరైనా ఇష్టపడాల్సిందే. ఇక వారి లైఫ్ పార్ట్ నర్ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిని కేవలం కౌగిలింతతో ఫిదా చేయవచ్చు. అాంతే అందమైన హగ్ పొందగలరు.


2.వృషభం..
ఈ రాశివారు హగ్స్ చాలా బాగా ఇవ్వగలరట. ఎదుటివారిపై తమకు ఉన్న ప్రేమను, అభిమానం, ఆప్యాయతలను కేవలం కౌగిలింతతో వీరు వివరిస్తారట. ఇక పార్ట్ నర్ విషయంలో.. హగ్ లో వీరు చాలా రొమాంటిక్ అని చెప్పొచ్చు. రొమాంటిక్ హగ్ ఇవ్వడంలో వీరికి వీరే సాటి.

3.కర్కాటక రాశి..
ఈ రాశివారు తమ మనసులోని విషయాన్ని కౌగిలింత ద్వారా చెబుతారు. అయితే.. వీరు అందరికీ హగ్స్ ఇవ్వాలని అనుకోరు. కేవలం.. తాము నమ్మిన వారికి మాత్రమే కౌగిలింతను ఇస్తారు.

4.సింహ రాశి.
ఈ రాశివారు  చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కౌగిలింతకు అభిమానులు. ఈ రాశి పిల్లలు ఎక్కువగా తమ పేరెంట్స్ నుంచి హగ్స్ కోరుకుంటారు. ఇక పెద్దవారు కూడా కౌగిలింతను ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడూ ఒకేలాంటి హగ్ కాకుండా భిన్నంగా ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. ముఖ్యంగా తమ పార్ట్ నర్ నుంచి వెనక నుంచి హగ్ కోరుకుంటూ ఉంటారు.

5.మీన రాశి..
ఈ రాశివారు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. తమకు నచ్చిన వారిని కౌగిలించుకునట్లు వీరు ఊహించుకుంటూ ఉంటారు. వీరికి నిద్రలో కూడా హగ్ కావాల్సిందే. తమ పార్ట్ నర్ ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడం వీరికి  చాలా ఇష్టం. 

Latest Videos

click me!