ఫ్లర్టింగ్ లో ఈ రాశులవారు తోపులు..!

Published : Jun 11, 2022, 11:03 AM IST

 చాలా మంది అమ్మాయిలకు కూడా అబ్బయిలు ఫ్లర్ట్ చేస్తే బాగా నచ్చుతుందట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు ఫ్లర్టింగ్ చేయడంలో  తోపులట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

PREV
16
 ఫ్లర్టింగ్ లో ఈ రాశులవారు తోపులు..!

ఫ్లర్టింగ్ చేయడం అంత సులువేమీ కాదు. తమ మాటలతో.. ఎదుటివారికి ఎలాంటి కోపం కలగకుండా.. వారు కూడా ఆనందపడేలా ఫ్లర్ట్ చేయడం చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యమౌతుంది. చాలా మంది అమ్మాయిలకు కూడా అబ్బయిలు ఫ్లర్ట్ చేస్తే బాగా నచ్చుతుందట. జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ కింద రాశుల వారు ఫ్లర్టింగ్ చేయడంలో  తోపులట. మరి ఆ రాశులేంటో ఓసారి చూసేద్దామా...

26

1.మేష రాశి..
ఈ రాశి వారు అప్పటికప్పుడు అయినా మాటలతో గారడి చేయగలరు. వారు మిమ్మల్ని గెలవాలని నిశ్చయించుకుంటే మిమ్మల్ని బుట్టలో వేసుకునేందుకు పొగడ్తల వర్షం కురిపించేందుకు కూడా వెనకాడరు.వారు చాలా సరసమైన స్వభావం కలిగి ఉంటారు. వారి టాలెంట్ మొత్తం బయటపెడతారు. ఫ్లర్ట్ చేయడంలో వీరు తోపులు అని చెప్పొచ్చు.

36

2.మిథున రాశి..
ఈ రాశివారు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. వారు సన్నిహితంగా ఉండాలనుకునే వ్యక్తికి ఏమి చెప్పాలో ఖచ్చితంగా తెలుసు. వీరు ఫ్లర్టింగ్ చేయడంలో తోపులు. మాటలతో మాయ చేసేస్తారు. ఎవరినైనా ఆకర్షించడానికి అద్భుతమైన అభినందనలతో ముందుకు వస్తారు. వారు తమ వ్యూహాలతో ప్రజలను చాలా సులభంగా ఒప్పించగలరు. వీరి మాటలకు ఎవరైనా పడిపోవాల్సిందే.

46
flirting

3.సింహ రాశి..
ఈ రాశివారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటారు. మాటలతో మాయ చేసేస్తారు. వీరు ఫ్లర్టింగ్ లో తోపులు. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు. ఎదుటివారిని ఆకట్టుకునే సమయంలోనూ ఈ రాశి వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు.

56
flirting

4.తుల రాశి..
ఈ రాశివారు చాలా  స్పాంటేనియస్ గా మాట్లాడతారు. అంతేకాకుండా వీరి మాటలు చాలా చమత్కారంగా ఉంటాయి. చాలా బాగా ఫ్లర్ట్ చేస్తారు. వారు ఎవరి హృదయాలలోనైనా తమ మార్గాన్ని ఆకర్షిస్తారు. తుల రాశివారు  చాలా దయ ,ప్రశాంతత కలిగి ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ ఆరాధించే లక్షణం. ఇతరులను ఫ్లర్ట్ చేయడాన్ని ఇష్టపడతారు.

66

5.ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారు చాలా  కూల్ గా ఉంటారు.  అందరితోనూ ... చాలా స్నేహంగా ఉంటారు. మాటలతో గారడి చేస్తారు. అందరినీ ప్రశంసిస్తూ ఉంటారు.  వీరి ప్రశంసలకు ఎవరైనా పడిపోవాల్సిందే. అయితే.. వీరు ఆ ప్రశంసల విషయంలోనూ చాలా నిజాయితీగా ఉంటారు. అందరినీ ఆకర్షించగల సత్తా వీరిలో ఉంటుంది. వీరి చిరునవ్వు అందరినీ ఆకర్షిస్తుంది. 

click me!

Recommended Stories