జీవితంలో గెలుపు, ఓటమిలు చాలా సహజం. కొన్ని సార్లు మనం గెలుస్తాం.. కొన్ని సార్లు ఓడిపోతూ ఉంటాం. ప్రతిసారీ అన్నింట్లోనూ మనమే గెలవాలి అంటే అది సాధ్యం కాకపోవచ్చు. కానీ.. కొందరు మాత్రం అన్నింట్లోనూ తమదే విజయం కావాలని అనుకుంటూ ఉంటారు. ఓటమిని అస్సలు తట్టుకోలేరు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
telugu astrology
1.మేష రాశి...
మేష రాశివారు చాలా పోటీతత్వం కలిగి ఉంటారు. వీరు గెలవడాన్ని మాత్రమే ఇష్టపడతారు. వారు విజయం సాధించడానికి ఏమైనా చేస్తారు. వారు ఓడిపోతే తట్టుకోలేరు. చాలా డిప్రెషన్ కి గురౌతారు. విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఓడిపోవడాన్ని వీరు పెద్ద వైఫల్యంలా చూస్తారు. దానిని జీర్ణించుకోలేరు.
telugu astrology
2.సింహ రాశి..
ఓటమిని ఇష్టపడని మరో రాశి సింహ రాశి. ఈ రాశివారు తమను తాము చాలా గర్వంగా ఫీలౌతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ రాశివారు తమను ఇతరులు కంట్రోల్ చేయడాన్ని ఇష్టపడరు. వారు తమను తాము విజేతలుగా మాత్రమే చూడగలరు. వీరికి పోటీతత్వం చాలా ఎక్కువ. ఈ రాశివారికి ఓడిపోవడం నచ్చదు. ఓటమి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా వారు ఫీలౌతారు. వీరు అన్ని విషయాల్లోనూ విజయం సాధించడానికే వీరు కృషి చేస్తారు.
telugu astrology
3.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశివారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. వారు పోటీని చాలా తీవ్రంగా తీసుకుంటారు. గెలవడం మాత్రమే వీరి లక్ష్యం. దేనికీ వీరు భయపడరు. ఓటమి వీరికి నచ్చదు. ఓడిపోతే దానిని తట్టుకోలేరు. ప్రతీకారం తీర్చుకునేదాకా వీరు ఊరుకోరు. వ్యక్తిగతంగా దాడిచేయడానికి కూడా వెనకాడరు.
telugu astrology
4.మకర రాశి..
మకరరాశి వారు ప్రతిష్టాత్మకంగా, కష్టపడి పనిచేస్తారు. వారు తమను తాము ఉత్తమంగా ఉంచుకోవడానికి పోటీని ఒక మార్గంగా చూస్తారు. గెలవడానికి కష్టపడి పనిచేయడానికి వారు భయపడరు. ఓటమిని వీరు పెద్దగా తట్టుకోలేరు. నిరాశకు గురౌతారు. నిరుత్సాహానికి గురౌతారు.
telugu astrology
5.ధనస్సు రాశి..
ధనుస్సు రాశివారు సరదాగా గడపడానికి ఇష్టపడతారు, కానీ వారు గెలవడానికి కూడా ఇష్టపడతారు. వారు సాహసోపేత, పోటీతత్వం కలిగి ఉంటారు. వారు పైకి రావడానికి రిస్క్ తీసుకోవడానికి భయపడరు. ఓడిపోవడం వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది, కాబట్టి వారు దానిని నివారించడానికి తమ వంతు కృషి చేస్తారు.