అలా తాము బాసిజం చేసే అర్హత మనకు ఉందా లేదా అని కూడా ఆలోచించరు. జోతితష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు కూడా అంతే.. అందరిపై పెత్తనం, ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు.
మన చుట్టూ ఉన్నవారిలో చాలా మంది ఎదుటివారిపై ఆధిపత్యం చేయాలని ఆరాటపడతారు. వారి స్వభావమే అలా ఉంటుంది. ఇతరులకు ఆర్డర్ చేయడంలో ముందుంటారు. అందరిపైనా బాసిజం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలా తాము బాసిజం చేసే అర్హత మనకు ఉందా లేదా అని కూడా ఆలోచించరు. జోతితష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశులవారు కూడా అంతే.. అందరిపై పెత్తనం, ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...
27
1.మేష రాశి..
ఈ రాశివారు అందరిపైనా తమదే పెత్తనం అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీరు ఇతరుల మాట వినరు. ఇతరులు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోరు. వారికి నచ్చినట్లుగా.. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు. చాలా సార్లు.. వీరు ఇతరుల పట్ల వారు అందరిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అయితే... ఈ రాశివారు ఎంత బాసిజం చేసినా.. దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించరు.
37
2.సింహ రాశి..
ఈ రాశివారు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పటికీ లైమ్ లైట్ లో ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఏ పోటీలో అయినా తామే గెలవాలని అనుకుంటూ ఉంటారు. తాము చెప్పిందే.. ఇతరులు కూడా చేయాలని వారు అనుకుంటూ ఉంటారు. అందరి మీదా పెత్తనం చేస్తారు. ఎక్కువగా వీరు తమ స్వార్థం కోసం ఆలోచిస్తారు. కాబట్టి వీరిని నాయకుడిగా ఇతరులు తొందరగా అంగీకరించలేరు.
47
3.కన్య రాశి..
వారు ఆలస్యం లేదా అసంపూర్ణతను సహించలేరు. కాబట్టి పనులు జరగనప్పుడు వారు బాస్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారు కొన్ని సమయాల్లో చాలా నియంత్రణలో ఉంటారు, ఎందుకంటే వారి పరిపూర్ణత అన్నింటిని అధిగమిస్తుంది. అయితే.. బాస్ లాగా.. ఇతరులపై వీరు ఎక్కువగా విమర్శలు మాత్రం చేస్తూ ఉంటారు.
57
4.వృశ్చిక రాశి
ఈ రాశివారు అందరినీ తమ కంట్రోల్ లో పెట్టుకోవాలని అనుకుంటూ ఉటారు. వారి కోరికల ప్రకారం పనులు జరగకపోతే, వారు బాలిస్టిక్‌గా మారతారు. ఇతర వ్యక్తులు తమ ఆదేశాల ప్రకారం జీవించాలని వారు ఎల్లప్పుడూ ఆశిస్తారు. వృశ్చిక రాశిని ఎదుర్కోవడానికి చాలా ఓపిక అవసరం. వీరిని భరించడం కాస్త కష్టమైన విషయమే.
67
5.ధనస్సు రాశి..
అందరికీ చూడటానికి వీరు కూల్ గా కనిపిస్తారు. కానీ.. నిజంగా వీరు అంత కూల్ ఏమీ కాదు. ఎదుటివారిపై బాస్ లాగా ప్రవర్తించాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఇతరులు ఎలా ఉండాలో కూడా వీరే నిర్ణయిస్తూ ఉంటారు. కూల్ గా ఉంటూ.. స్వీట్ గా మాట్లాడుతూనే.. ఇతరులపై బాసిజం చెలాయిస్తారు.
77
వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభం, మీనం రాశులకు ఇతరులను అదుపులో ఉంచుకోవడం ఇష్టం ఉండదు. వారు తమను తాము తమ అధీనంలో ఉంచుకుంటారు. కానీ.. ఇతరులను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించరు.