వృషభం
ఈ రాశి వారు చాలా మొండి వారు. అలాగే ఎప్పుడూ కోపంగా కూడా ఉంటారు. ఈ రాశి వాళ్లు చాలా త్వరగా కోపగించుకుంటారు. అలాగే వీళ్ల కోపాన్ని తమకు ఇష్టమైన, దగ్గరగా ఉన్న వ్యక్తిపైనే ప్రదర్శిస్తారు. వీళ్లు కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. తమ భాగస్వామి తమను అర్థం చేసుకుంటారని, అలాగే సహనాన్ని కోల్పోయినందుకు వారిని క్షమిస్తారని వీళ్లు మనసులో అనుకుంటారు. కానీ అలా అస్సలు జరగదు. ఇదే వారికి ఎన్నో చిక్కులు తెచ్చిపెడుతుంది.