ఈ రాశులవారు కుక్కలను అమితంగా ప్రేమిస్తారు..!

Published : Jul 03, 2023, 01:03 PM IST

తమ పిల్లలతో సమానంగా వీరు కుక్కలను పెంచగలరు. వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, సౌకర్య వంతంగా ఉండేలా చూసుకుంటారు. 

PREV
16
 ఈ రాశులవారు కుక్కలను అమితంగా ప్రేమిస్తారు..!

చాలా మంది కుక్కలను పెంచుకోవడాన్ని ఇష్టపడతారు. తమ ఇంట్లో పిల్లలకన్నా కూడా ఎక్కువగా వారు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.  సొంత బిడ్డల్లా  చూసుకుంటూ ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం ఈ కింది రాశులవారు కుక్కలను అమితంగా ప్రేమిస్తారు. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం....

26
telugu astrology


1.వృషభం
వృషభరాశి వ్యక్తులు జీవితంలో ప్రేమకు ఎక్కువ విలువ ఇస్తారు. మనుషులనే కాదు, వీరు కుక్కలను కూడా అమితంగా ప్రేమించగలరు. వీరికి కుక్కలు అంటే చాలా ఇష్టం. తమ పిల్లలతో సమానంగా వీరు కుక్కలను పెంచగలరు. వాటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, సౌకర్య వంతంగా ఉండేలా చూసుకుంటారు. 

36
telugu astrology


2.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారు చాలా దయగల స్వభావం గలవారు.  మనుషులతో సమానంగా వీరు జంతువులను కూడా ప్రేమించగలరు. ముఖ్యంగా కుక్కలను వీరు ఎక్కువగా ప్రేమిస్తారు.  కుక్కల భద్రత కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తపడతారు. వాటి కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. 

46
telugu astrology


3.సింహ రాశి..
సింహరాశివారు ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండటానికి ఇష్టపడతారు. వీరు అలా  అందరి దృష్టిని ఆకర్షించడానికి కుక్కలను పెంచుకోవాలని అనుకుంటారు. వీరికి కుక్కలు అంటే ఇష్టం. వాటిని తమతో ఉంచుకొని, అందరి ముందు ప్రదర్శించాలని వీరు అనుకుంటూ ఉంటారు. వాటితో సరదగా గడపడం, వాటిని బయటకు తీసుకువెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.   

56
telugu astrology


4.తులారాశి
తులరాశివారు సమతుల్యంగా ఉంటారు.వారు జీవితానికి సామరస్యపూర్వకమైన విధానాన్ని కలిగి ఉంటారు. వారు వారి సంబంధాలలో సాంగత్యం, శాంతిని కోరుకుంటారు. కుక్కలు వారికి పరిపూర్ణ సహచరులను అందిస్తాయి, ఎందుకంటే అవి మానవ-కనైన్ బంధంలో కనిపించే సామరస్యాన్ని, విధేయతను అభినందిస్తాయి. తులారాశి వారు సున్నితంగా, న్యాయంగా ఉంటారు. వీరు కుక్కలను అమితంగా ప్రేమించి, ఆదరిస్తారు.

66
telugu astrology


5.మీన రాశి..
మీన రాశివారు  అత్యంత సహజంగా ఉంటారు. చాలా సానుభూతిపరులు. వారు భావోద్వేగ ప్రపంచంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు. వీరు కుక్కలను అమితంగా ప్రేమిస్తారు.  ఎలాంటి షరుతులు లేని ప్రేమను  అందిస్తూ ఉంటారు. వీరు ప్రేమను పంచడంలో ఎప్పుడూ ముందుంటారు. వీరు తమ పెంపుడు జంతువులకు సౌకర్యాన్ని అందిస్తూ ఉంటారు. వారు తమ ఒత్తిడి నుంచి బయటపడటానికి కుక్కలను ఉపయోగించుకుంటూ ఉంటారు. 

click me!

Recommended Stories