Lucky Zodiac signs: ఆగస్టు నెలలో అదృష్టమంతా ఈ రాశులదే..!

Published : Jul 15, 2025, 05:45 PM IST

గ్రహాలలో మార్పులు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఈ గ్రహాలలో మార్పులు కొన్ని రాశులపై చాలా ఎక్కువ ప్రభావం చూపించనుంది.

PREV
16
ఆగస్టులో గ్రహాల మార్పులు

జోతిష్యశాస్త్రం ప్రకారం గా ఈ ఏడాది ఆగస్టు నెల ఎంతో కీలకంగా మారనుంది. ఎందుకంటే, ఈ నెలలో బుధుడు తిరోగమనం చేయనున్నాడు. అదేవిధంగా కుజుడు తుల రాశిలోకి ప్రవేశించడం వంటి ముఖ్యమైన గ్రహమార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ మార్పుల ప్రభావం కొన్ని రాశుల జీవితాలపై మంచి ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కలగనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం...

26
సింహ రాశి...

ఆగస్టు నెలలో సింహ రాశివారికి చాలా శుభ ఫలితాలు దక్కనున్నాయి. గతంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం కూడా బాగా పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కూడా కలగనున్నాయి.

36
మేష రాశి

ఆగస్టు నెల మొత్తం మేష రాశి వారికి శుభమే శుభం. గతంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ప్రయత్నాలు ఫలించి, జీవితంలో కొత్త ఆశలు, అవకాశాలు కనిపించబోతున్నాయి. విజయం మీ చెంత ఉంటుంది.

46
తులా రాశి

వృత్తిపరంగా తులారాశి వారికి ఇది అత్యుత్తమ సమయం. స్థిరమైన ఆదాయం, అదనపు లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. మంచి.. ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

56
ధనుస్సు రాశి

కెరీర్ పరంగా ధనుస్సు రాశి వారు ముందుకు సాగే సమయం ఇది. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం అందుకునే అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉంటారు. మీ శక్తి స్థాయిలు మరింత పెరుగుతాయి.

66
కర్కాటక రాశి

ఈ నెల బృహస్పతి అనుగ్రహంతో కర్కాటక రాశి వారికి అనూహ్యంగా ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. శ్రద్ధగా కృషి చేస్తే మీరు ఆశించిన దానికంటే ఎక్కువను పొందే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories