ప్రేమ గురించి ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలు, కలలు ఉంటాయి. మీ ప్రియమైన వారు ఇలా ఉండాలని కోరుకోవడం సహజం. కొంతమంది తమ ప్రేమ పరిపక్వంగా ఉండాలని, కలకాలం కలిసి ఉండాలని కోరుకుంటారు, మరికొందరు కలిసి సాహసాలు చేస్తూ ఉత్తేజకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అలాగే కొందరు ప్రేమ కోసం కష్టతరమైన జీవితాన్ని ఎంచుకుంటారు. జీవిత భాగస్వామి కోసం ఏమైనా చేసేవాళ్లు ఉంటారు. అదే ఆసక్తిని హాబీలపై ఉంచుకుని జీవితాన్ని ఆనందంగా గడిపేవారూ ఉన్నారు. కొంతమందికి ప్రేమించడం మాత్రమే తెలుసు, ఎలా ఇవ్వాలో తెలియదు. కొంతమందికి నిస్వార్థంగా ప్రేమించడం మాత్రమే తెలుసు. సాధారణంగా, ప్రతి ఒక్కరికి ప్రేమ గురించి భిన్నమైన అనుభూతి, ఆలోచనలు ఉంటాయి. కొందరు మాత్రం సినిమాటిక్ ప్రేమను కోరుకుంటారు. సినిమాల్లో కనిపించే ప్రేమను కోరుకుంటారు. సినిమాల్లో చూపించినట్లుగా ప్రపోజ్ చేయాలని.. లైఫ్ మొత్తం కూడా అలానే ఉంటుందని అనుకుంటూ ఉంటారు. జోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కింద రాశుల వారు.. సినిమాటిక్ లవ్ స్టోరీలను కోరుకుంటారట. మరి ఆ రాశులేంటో ఓసారి చూద్దాం...