Monthly Horoscope: జూన్ 2022 మాసఫలాలు - ఓ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి

First Published | Jun 1, 2022, 8:52 AM IST

ఈ జూన్ మాసం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు పదోన్నతులు. ప్రయాణాలలో లాభాలు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. 

Daily Horoscope 2022 - 03

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 

మేషం (Aries) (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబము నందు శుభ కార్యక్రమములు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాసవంతమైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు విశేష ధన లాభం. మంచి కార్యక్రమాలు చేపడతారు. సాధారణ నుండి సహకారం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు దత్తాత్రేయ పూజలు చేయుట మంచిది .


వృషభం  (Taurus) (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. బంధు,మిత్రుల కలయిక. ఆధ్యాత్మిక చింతన. పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి. గృహమునందు దైవ కార్యాచరణ. ఉద్యోగము నందు పదోన్నతులు. ప్రయాణాలలో లాభాలు. వృత్తి వ్యాపారాల యందు లాభాలు. ఇతరులకు ఉపకారం చేయాలనె మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. భవిష్యత్  గురించిన ఆలోచనలను చేస్తారు. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడిన పట్టుదలతో పూర్తి చేస్తారు. జీవన విధానం సాఫీగా సాగుతుంది. భూ గృహ క్రయవిక్రయాల యందు లాభాలు. ఈ రాశి వారు శివ పూజలు చేయుట మంచిది .

మిథునం (Gemini)(మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

సంతానం మూలకంగా లాభం. నూతన వాహన ఆభరణాల కొనుగోలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. బంధుమిత్రులతో అకారణంగా కలహాలు. వ్యాపార భాగస్వాములతో తెలివిగా వ్యవహరించవలెను. అనుకున్న పనులలో స్తబ్దత. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం. వివాహ ప్రయత్నాలు మందగమనం. రుణ శత్రుబాధలు. సోదరుల యొక్క సహకారం అంతంతమాత్రంగా ఉండును. ధనాదాయ మార్గాలు సామాన్యం. స్థానచలనం. శరీర నిస్సత్తువ. తలపెట్టిన పనులలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈ రాశి వారు శనైశ్చరునుకి తైలాభిషేకాలు చేయుట మంచిది. 

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం. అధికారుల యొక్క మన్నన. సోదరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. చేయు పని వారి యొక్క సహకారంతో వ్యాపార వృద్ధి. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. బంధుమిత్రులతో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఈ రాశి వారు సుబ్రమణ్యస్వామి పూజలు చేయుట మంచిది.

సింహం   (Leo) (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆధ్యాత్మిక చింతన. దానధర్మాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. అకారణంగా ప్రయాణాలు. తొందరపాటు నిర్ణయాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది. మా మాసాంతంలో శుభ కార్యాచరణ. వివాహ ప్రయత్నాలు మందగమనం. కొంతమేర శత్రు, రుణ బాధలు వేధిస్తాయి. సంఘంలో కలహాలు. కుటుంబంలో ప్రతికూల వాతావరణం.ఈ రాశి వారు ఈ నెలలో ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించవలెను. ఈ రాశి వారు శుక్రవారం నాడు దుర్గా దేవికి పూజలు చేయుట మంచిది.

కన్య  (Virgo) (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

వ్యవహారాల విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ శత్రు బాధలు తొలగును. బంధు మిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. నష్ట ద్రవ్యం తిరిగి లభిస్తుంది. వృత్తి వ్యాపారాల యందు కొద్దిగా ఖర్చులు ఇబ్బందిపెడతాయి. భవిష్యత్తు ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనులలో జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదా వాయిదా వేసుకోవడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు మంగళవారం రోజున ఆంజనేయస్వామి పూజలు చేయుట మంచిది.
 

తుల  (Libra)(చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. కుటుంబ వృద్ధి కోసం కొంతమేర ధనాన్ని వెచ్చిస్తారు. వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. జీవిత భాగస్వామితో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు.ఈ రాశి వారు శనివారం నాడు శనైశ్చరునుకి తైలాభిషేకాలు చేయుట మంచిది.

వృశ్చికం  (Scorpio) (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు అధికారుల మన్నన లభించును. సంఘంలో అపనిందలు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం. మానసిక ఒత్తిడి. శుభకార్యాల వలన అధిక ఖర్చులు. ఆభరణాలు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ. రుణ శత్రుబాధలు కొంతమేర ఇబ్బంది పెడతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్నదమ్ముల సహకారం అంతంతమాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఈ రాశి వారు శనికి తైలాభిషేకాలు చేయుట మంచిది .

ధనస్సు (Sagittarius)(మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

నిరుద్యోగ శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పదోన్నతులు అనుకూలమైన బదిలీలు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అనుకూలం. గృహమునందు శుభ కార్యక్రమాలు చేస్తారు. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం. రావలసిన బాకీలు వసూలు అవును. కోర్టు వ్యవహారాలు అనుకూలం. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. దానధర్మాలు చేస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. ఈ రాశి వారు గురువారం దత్తాత్రేయస్వామి పూజలు చేయుట మంచిది .

మకరం  (Capricorn) (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

కుటుంబంలో శుభకార్యములు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు వహించవలెను. వృత్తి వ్యాపారులకు సామాన్యం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధుమిత్రులతో చికాకులు. కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పై అధికారులు ఒత్తిడి. తలపెట్టిన కార్యాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు. సోదరుల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారాల యందు పరిష్కార మార్గాలు లభించును. దానధర్మాలు చేస్తారు. ఈ రాశి వారు లక్ష్మీగణపతి పూజలు చేయుట మంచిది.
 

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఖర్చుల యందు తెలివిగా వ్యవహరిస్తారు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. జీవిత భాగస్వామితో చికాకులు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి. ప్రభుత్వ వ్యవహారాలలో ఆటంకాలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిదొక్కుకుంటారు. సంతాన మూలకంగా ఖర్చులు. సంఘంలో ఆచితూచి వ్యవహరించవలేను. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ రాశి వారు ఆరోగ్యం కోసం మంగళవారం అంగారక అర్చనలు ,పూజలు చేయవలెను.

మీనం (Pisces)(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
వృత్తి వ్యాపారాల్లో లాభాలు. ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పెట్టినప్పటికీ నిలదొక్కుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. గృహమునందు శుభ కార్యాచరణ. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. నిరుద్యోగులకు శుభసమయం. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ఆధ్యాత్మిక చింతన. సత్కర్మలు చేస్తారు. సంఘంలో పెద్ద వారిని కలుస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాసాంతం లో రుణ శత్రుబాధలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ఈ రాశి వారు దుర్గా సూక్తం పారాయణ చేయుట మంచిది.

Latest Videos

click me!