Vrishabha Rasi 2024:'వృషభ రాశి కొత్త సంవత్సర రాశిఫలం..వృత్తి, వ్యాపారాల్లో లాభాలు..!

First Published | Dec 15, 2023, 3:00 PM IST

2024లోకి మనం అడుగుపెడుతున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశివారి జాతకం ఎలా ఉండనుందంటే, ఈ ఏడాది   విశ్వం   మీ దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తుంది . అయితే ఎంతకష్టమైనా, విశ్రాంతి తీసుకోవడానికి ,  మీరు సాధించిన విజయాలను ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చించడం మర్చిపోవద్దు.  
 

Taurus


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో

గురు:- ఏప్రిల్ నెలాఖరు వరకు వ్యయ స్థానంలో సంచరించి మే నెల నుండి జన్మరాశిలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా రాజస్థానమైన కుంభరాశిలో  సంచారము

రాహు:-ఈ సంవత్సరమంతా లాభ స్థానంలో సంచారము

కేతు:-ఈ సంవత్సరమంతా పంచమ  స్థానంలో సంచారము

ఈ సంవత్సరం  కెరీర్ పరంగా కొన్ని ఛాలెంజ్ లను తీసుకురావచ్చు, కానీ మీ దృఢసంకల్పం మరియు తెలివితేటలతో మీరు వాటిని అధిగమించి మరింత బలంగా బయటపడగలరు. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి అలాగే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తున్నప్పుడు పరీక్షలు ఎదురౌతాయి. విశ్వం   మీ దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తుంది . అయితే ఎంతకష్టమైనా, విశ్రాంతి తీసుకోవడానికి ,  మీరు సాధించిన విజయాలను ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చించడం మర్చిపోవద్దు.  

సంవత్సరం ప్రారంభంలో, ప్రధాన గ్రహాలు ప్రభావం బాగా ఉంటుంది. అయితే దేవుని, పెద్దవారి  ఆశీర్వాదాలలతో మీరు సమస్యలు దాటి  సంతోషంగా ఉంటారు. మీరు మీ ప్రాజెక్ట్‌ల వైపు దృష్టి పెట్టగలుగుతారు, మీ పని సామర్థ్యం పెరుగుతుంది, ఇది మీ పని విధానంలో కనిపిస్తుంది. మీ యజమాని మీ కృషికి సంతోషిస్తారు, మీరు కొత్త ప్రమోషన్ పొందాలని ఆశిస్తారు. మీరు మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీరు కొన్ని రియల్ ఎస్టేట్‌లో మరియు కొన్ని బాండ్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తారు, ఇది సమీప భవిష్యత్తులో మీకు లాభాలను ఇస్తుంది. చుట్టుపక్కల వారితో మాట్లాడేటప్పుడు మీరు వినయంగా ఉండండి. అదే విజయం తెచ్చిపెడుతుంది. అందరూ మిమ్మల్నే గమనిస్తూంటారనే విషయం మర్చిపోకండి.  మీరు జీవిత భాగస్వామితో మర్యాదగా వ్యవహరించండి. అప్పడే మీ  జంట మధ్య పరస్పర గౌరవాన్ని సృష్టిస్తుంది. పెళ్లికాని ఆడవాళ్లు..తమ సోల్ మేట్ ని ఇట్టే దొరకిపుచ్చుకుంటారు.  


Taurus 1

అలాగే ఈ సంవత్సరం వృషభ రాసి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభి స్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఏప్రియల్ చివర నుండి సెప్టెంబర్ వరకు ముఖ్య గ్రహాల అనుకూలతతో  ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకకస్మిక భయాందోళనలు దూరమవు తాయి. ఋణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. రహస్య శతృబాధలుండే అవకాశం వుంది.

Taurus

అయితే సెప్టెంబర్ నుండి సంవత్సరాంతం వరకు కొన్ని రకాల  అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తినివ్వవు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బం దులు దూరమవుతాయి.  ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో విరోధ మేర్పడే అవకాశాలుంటాయి. పిల్లల పట్ల పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయండి.
 

Astro

చివరగా ఒకటే సూచన...మీ యజమాని మీతో చిరాకు పడతారు. అయితే వినమ్రతే విజయం. మీ  బాస్‌తో ఎలాంటి వాదనలు చేయకుండా ఉండమని మీకు సలహా ఇస్తున్నాు.  గ్రహ సంచారం  మిమ్మల్ని ప్రతికూల పరిస్దితుల వైపు లాగుతుంది. అయినా లొంగకండి.  మీరు ప్రత్యర్థులు , కనపడని శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ వృత్తిలో మెలుకవగా ఉండాలి.  మీ ఆఫీస్ లో ఎవరితోనైనా ఎక్కువ చర్చించకండి. భాగస్వామితో మాట్లాడే విధానాన్ని మీరు కంట్రోలులా ఉంచుకోవాలి.  మీ కఠినమైన మాటలు భాగస్వామితో పరస్పర సంబంధంలో అనేక సమస్యలను సృష్టించవచ్చు.రిలేషన్ షిప్స్  మధ్య   గజిబిజి పరిస్థితిని నివారించడానికి మీరు మీ పనిపై దృష్టి పెట్టాలని, పని తో  ఎక్కువ సమయం గడపాలని ఈ సంవత్సరం మీకు సలహా ఇవ్వబడింది. విద్యార్థులు చదువులో అలసత్వం, అజాగ్రత్తలను నియంత్రించుకోవాలని సూచన.


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

వృషభ రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం
 

Latest Videos

click me!