
ఈ టారోట్ రీడింగ్ ని మనకు ప్రముఖ జోతిష్యులు చిరాగ్ దారువాలా అందించారు. ఈ టారో రీడింగ్ లో ఆయనకు దాదాపు 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
మేషం:
కొన్ని ఇబ్బందుల వల్ల మానసిక అలసట ఏర్పడుతుంది. ఈ రోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. కానీ అసంపూర్తిగా పని చేయడం వల్ల నిరాశకు గురవుతారు. మీ సామర్థ్యానికి, మీ నిరీక్షణకు సమతుల్యతను కొనసాగించండి. ఆశించిన మార్పులు వచ్చినా.. సమాజంలో కీర్తిని పొందడం కాస్త ఆలస్యం అవుతుంది. సంబంధాల విషయంలో గందరగోళంగా ఉంటారు. ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పైల్స్ సమస్య రావొచ్చు.
శుభ వర్ణం:- నీలం
శుభ సంఖ్య:- 4
వృషభం:
మీ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే కొన్ని కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. వీటన్నింటికీ సిద్ధమయ్యి.. పట్టదలతో పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని త్వరలో సాధిస్తారు. కానీ దానిని సాధించే మార్గం సంక్లిష్టమైనది. చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. మీకు ఎలాంటి అడ్డంకి వచ్చినా ప్రయత్నాన్ని ఆపకండి. మీ పని రంగానికి సంబంధించి ఉన్నత స్థాయిని పొందేందుకు ప్రయత్నాలను మరింత పెంచుకోవాలి. మీ భాగస్వామి దాచిన విషయాల వల్ల మీరు నిరాశకు గురవుతారు. భుజాలలో నొప్పి కలగొచ్చు.
శుభ వర్ణం:- తెలుపు
శుభ సంఖ్య:- 4
మిథునం:
మీ మనస్సుకు నచ్చిన వ్యక్తులను, వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుస్తుంది. దీనివల్ల పెద్ద పెద్ద నష్టాలను నివారిస్తారు. మీ పనిని విస్తరించేందుకు ప్రస్తుతం ఎలాంటి రుణం తీసుకోవద్దు. ఎవరైనా మీకు, మీ భాగస్వామికి మధ్య దూరాన్ని పెంచడానికి ప్రయత్నించవచ్చు. మైగ్రేన్ సమస్య ఎక్కువగా ఉంటుంది.
శుభ వర్ణం:- ఆకుపచ్చ
శుభ సంఖ్య:- 8
కర్కాటకం:
పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ.. మనస్సులో తలెత్తే ప్రతికూల ఆలోచనల కారణంగా.. పనులను వాయిదా వేసే అవకాశం ఉంది. వర్తమానాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచనలలో మార్పుతో భవిష్యత్తును మార్చడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోండి. పనికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికి శ్రద్ధ చూపడం చాలా అవసరం. మీ ప్రేమ జీవితంలో.. ప్రస్తుతం మీ నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. నిద్రకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి ఇది మీకు మంచి సమయం.
శుభ వర్ణం:- ఎరుపు
శుభ సంఖ్య:- 6
సింహం:
మీ అంచనాలు, వాస్తవికత రెండింటిలోనూ తేడా ఉంటుంది. ఇది మీకు ఆందోళనను కలిగిస్తుంది. మీరు మీ ఆలోచనలతో పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ పనిని సరిగ్గా చేయకపోవడం వల్ల మీరు ఆశించిన మార్పును చూడలేరు. ఈ రోజుల్లో మీరొక్కరే మార్పును తీసుకురావడం చాలాకష్టం. కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాల ప్రభావం పని నాణ్యతపై కనిపిస్తుంది. జీవిత భాగస్వామి వల్ల కొంత ఆందోళన కలుగుతుంది. శరీరం నిర్జలీకరణం బారిన పడొచ్చు. ద్రవ ఆహారంపై దృష్టి పెట్టాలి.
శుభ వర్ణం:- కుంకుమ
శుభ సంఖ్య:- 3
కన్య
వ్యక్తులతో మాట్లాడటం వల్ల ఇప్పటి వరకు మీరు విస్మరించిన విషయాల గురించి చాలా జ్ఞానాన్ని పొందుతారు. వ్యక్తిగత సమస్యలలో కుటుంబం, స్నేహితులు జోక్యం అంత మంచిది కాదు. ఈరోజు మిమ్మల్ని మానసికంగా బాధించే విషయాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. అవసరమైతే డాక్టర్ సహాయం తీసుకోండి.
శుభ వర్ణం:- ఊదా
శుభ సంఖ్య:- 5
తుల:
ధనానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇది మంచి సమయం. ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్లాన్ చేయడం ద్వారా ఆర్థికంగా లాభాలను పొందొచ్చు. ఈ రోజు భూమి కొనుగోలు అస్సలు మంచిది కాదు. వ్యాపార రంగంలో నిమగ్నమైన వ్యక్తులు ఖాతాదారులతో సంబంధాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. వ్యక్తిగత విషయాలలో చాలా బిజీగా ఉండటం వల్ల భాగస్వామి దూరమవుతారు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
శుభ వర్ణం:- తెలుపు
శుభ సంఖ్య:- 8
వృశ్చికం:
ఎదుటివారు చెప్పే మాటల వల్ల మీ లక్ష్యం నుంచి తప్పుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. మనస్సులో తలెత్తే చంచలత్వం కారణంగా.. ప్రతిదానికీ వెంటనే సమాధానం పొందాలనే కోరిక ప్రబలుతుంది. ఇది తప్పులకు దారితీయవచ్చు. పనిపై శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేయకండి. కెరీర్ కు సంబంధించిన ప్రణాళికను మార్చుకోవడం అవసరం. ప్రతిసారీ భాగస్వామి అనుభవించే నిరాశను మీరు అధిగమించలేరని అర్థం చేసుకోవాలి. జలుబు, దగ్గు సమస్య తగ్గుతుంది.
శుభ వర్ణం:- పసుపు
శుభ సంఖ్య:- 1
ధనుస్సు
మీ సంకల్ప శక్తిని బలోపేతం చేసుకుంటూ అహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు చేసిన తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంది.. దేనికీ భయపడకండి. ముఖ్యంగా నిందలు, అవమానానికి అస్సలు భయపడి. సత్యాన్ని అస్సలు వదులుకోవద్దు. ఆశించిన విధంగా పని సంబంధిత విషయాలలో మార్పులు చేసుకోవచ్చు. కానీ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. భాగస్వామితో సంయమనం పాటించాలి. కడుపు మంట సమస్య వస్తుంది.
శుభ వర్ణం:- ఆకుపచ్చ
శుభ సంఖ్య:- 2
మకరం:
సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే.. సమస్యలు వస్తాయి. ప్రజల అంచనాలు ఎంత వరకు ముఖ్యమైనవో తెలుసుకుంటారు. మీపై బాధ్యత, కర్తవ్యం పెరుగుతుంది. ఈ రెండు విషయాలను తప్పక పాటించాలి. ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఏ పనికి సంబంధించి సోమరితనంగా ఉండంకండి. భాగస్వాములు కలిసి తమ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్లు పెద్ద సమస్యలను కలిగిస్తాయి.
శుభ వర్ణం:- పసుపు
శుభ సంఖ్య:- 1
కుంభం:
కుటుంబంలోని ప్రతి ఒక్కరి పట్ల బాధ్యతగా ఉంటారు. ఈ రోజు శారీరక శక్తి లోపిస్తుంది. ఏ వ్యక్తితోనైనా పారదర్శకత లేకపోవడం వల్ల ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. ఇది అపార్థాలకు కూడా దారి తీస్తుంది. పని ప్రదేశంలో మార్పు కారణంగా పని భారం పెరుగుతుంది. భాగస్వామి తన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. దగ్గు, జలుబు సమస్య పెరుగుతుంది.
శుభ వర్ణం:- నీలం
శుభ సంఖ్య:- 9
మీనం:
మరికొన్ని రోజుల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి వ్యక్తిత్వంలో తగిన మార్పులు చేసుకోవాలని భావిస్తారు. ఒకరి తప్పులను గ్రహించడం వల్ల వారి జీవితాన్ని మార్చినట్టుగా అనిపిస్తుంది. మారుతున్న వ్యక్తుల గురించి చింతించకండి. విదేశాల్లో మీ పనిని విస్తరించుకోవడానికి స్నేహితుడి సహాయం తీసుకోండి. సంబంధాలకు సంబంధించిన సానుకూల, ప్రతికూల విషయాలను ఎదుర్కొంటారు. దగ్గు సమస్య పెరిగే అవకాశం ఉంది.
శుభ రంగు: గులాబీ
శుభ సంఖ్య:- 7