Aquarius Transit : కుంభరాశిలో సూర్య, శుక్ర, రాహువుల కలయికతో అరుదైన త్రిగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల మిథున, ధనుస్సు, మకర రాశుల వారికి విపరీతమైన ధనలాభం, అదృష్టం వరించనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష శాస్త్ర లెక్కల ప్రకారం సుమారు 100 ఏళ్ల తర్వాత కుంభరాశిలో ఒక అరుదైన, శక్తివంతమైన త్రిగ్రహ కూటమి ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ మాసంలో గ్రహాల కదలికలు కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఈ రాశిలో రాహువు కొలువై ఉన్నాడు. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కుంభరాశిలో సూర్య, శుక్ర, రాహువుల కలయికతో త్రిగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ అరుదైన యోగం వల్ల మూడు రాశుల వారికి చాలా ప్రయోజనాలు కలుగనున్నాయి.
25
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ త్రిగ్రహ కూటమి అత్యంత లాభదాయకంగా మారుతుంది. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీనివల్ల మీ కెరీర్‌లో అద్భుతమైన వృద్ధిని చూస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ప్రభావితం చేసేలా మారుతుంది. పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలిగి లబ్ధి పొందే అవకాశం ఉంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు లేదా ఉద్యోగులకు ఈ సమయం చాలా అనుకూలం. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఏదైనా శుభకార్యాల్లో లేదా ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.
35
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులకు ఈ గ్రహాల కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరపడటానికి ఇది సరైన సమయం. కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే యోగం బలంగా ఉంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాలలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. విదేశీ వ్యాపారాలు చేసే వారికి ఊహించని లాభాలు వస్తాయి. తోబుట్టువుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది లేదా కార్యాలయంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది.
మకర రాశి వారికి ఈ త్రిగ్రహ కూటమి వల్ల మనోధైర్యం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగవంతం అవుతాయి. మీ వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. కెరీర్ పరంగా కొత్త పుంతలు తొక్కుతారు. మకర రాశి వారు కూడా కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రేమ, సహకారం పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు, ప్రమోషన్ దక్కే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
55
అదృష్ట కాలం ఇప్పటి నుచే ప్రారంభం
ఈ ఫిబ్రవరి 13 నుండి ప్రారంభమయ్యే సూర్య, శుక్ర, రాహువుల కూటమి జ్యోతిషం రీత్యా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది వంద ఏళ్ల తర్వాత వస్తున్న అరుదైన అవకాశం కావడంతో, పైన పేర్కొన్న మూడు రాశుల వారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.