మేష రాశి..
సూర్యుడు కర్కాటక రాశిలో అడుగుపెట్టడం మేష రాశివారికి చాలా అనుకూలంగా మారుతుంది. నెల రోజుల పాటు ఈ రాశులకు శుభ ఫలితాలు అందుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఎలాంటి సవాలు అయినా ఎదుర్కునే సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసొస్తుంది. మంచి లాభాలు పొందుతారు.డబ్బు బాగా కలిసొస్తుంది.ఈ నెలలో శుభవార్త కూడా వింటారు.