ఈ రాశి పిల్లలంటే.. టీచర్లకు చాలా ఇష్టం.. ఎందుకంటే....

Published : Apr 22, 2022, 10:52 AM IST

క్లాస్ రూంలో వందమంది పిల్లలున్నా.. టీచర్లకు ఇష్టమైన వాళ్లు కొంతమందే ఉంటారు. దీనికి కారణం వారు బాగా చదవడమో, అన్నింట్లో యాక్టివ్ గా ఉండడమో కారణం అయి ఉంటుంది. ఏ రాశి పిల్లలు ఎంతవరకు టీచర్లకు ప్రియాతిప్రియంగా ఉంటారో చూడండి. 

PREV
112
ఈ రాశి పిల్లలంటే.. టీచర్లకు చాలా ఇష్టం.. ఎందుకంటే....
Gemini

మిధునరాశి (Gemini) :  మెర్క్యురీ గ్రహానికి చిహ్నంగా చెప్పే మిధునరాశి.. పిల్లలు చదువు, ఉపన్యాసం, కమ్యూనికేషన్, పాటలు పాడడంలాంటివాటిల్లో ముందుంటారు. దీంతో ఈ రాశి పిల్లలు టీచర్లుకు బాగా ఇష్టమైన విద్యార్థులుగా ఉంటారు. 

212
(Cancer)

కర్కాటకరాశి (Cancer) : కర్కాటక రాశిలో పుట్టినవారిమీద చంద్ర గ్రహం ప్రభావం బాగా ఉంటుందని చెబుతారు. అందుకే ఈ రాశి పిల్లలు ఉన్నత చదువులు చదువుతారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తారు.

312

కన్యారాశి ( Virgo) : కన్యారాశికి చెందిన వారిలో ముఖ్యంగా అమ్మాయిలు చదువులో చాలా బాగుంటారు. చదువుతో పాటు ఆర్ట్ లోనూ మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. ఏ రంగంలో వారు అభిరుచి చూపించినా అందులో ఏదో ఒకటి సాధిస్తారు. అందుకే కన్యారాశి పిల్లల మీద టీచర్లకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. 

412
Scorpio

వృశ్చికరాశి ( Scorpio)  : వృశ్చికరాశి పిల్లలు చాలా డీసెంట్ గా, ఆర్గనైజ్డ్ గా ఉంటారు. తమ అసైన్ మెంట్లు పూర్తి చేయడంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. వీరి హోంవర్క్, అసైన్ మెంట్లు, చదువు విషయంలో పెండింగ్ అనే మాట ఉండదు. అదే టీచర్లను మెచ్చుకునేలా చేస్తుంది.

512
Capricorn

మకరరాశి (Capricorn) : మకరరాశి విద్యార్థుల్లో బాగా పోటీతత్వం ఎక్కువ. అందుకే టీచర్లకు అత్యంత ప్రీతిపాత్రులుగా ఉంటారు. అంతేకాదు కెరీర్ కు సంబంధించిన మంచి సలహాలు, సూచనలు కావాలంటే వీరికి మించినవారు మరొకరు ఉండరు. 

612
Aries

మేషరాశి (Aries) : మేషరాశివారు సహజంగా ప్రేరణ పొందుతారు. ఈ రాశివారు తమకు సరైన వృత్తిని కనుగొనగలిగితే.. ఇక వీరిని గురువులు విపరీతంగా ఆరాధిస్తారు. అంతగా కృషి చేస్తారు ఆ రంగంలో. 

712
Taurus

వృషభరాశి (Taurus) : చివరి నిమిషంలో వచ్చే ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో బాగా తెలిసిన వ్యక్తు వృషభరాశివారు. అది అసైన్ మెంట్ కానీ, ప్రాజెక్ట్ వర్క్ కానీ వృషభరాశి వారు చివరి నిమిషంలో పనిచేసి.. టైం కు ముందు సబ్మిట్ చేయడంలో దిట్టలు.

812
Leo

సింహరాశి (Leo) : సింహరాశి పిల్లలు టీచర్లకు కంటి రెప్పల్లా ఉంటారు. ఈ రాశి పిల్లలు ఇంకాస్త కష్టపడితే మరింత మెరుగ్గా ఉంటుంది. 

912
Libra

తులారాశి ( Libra)  : మొదటి చూపులో తులారాశి పిల్లలు చాలా బ్యాలెన్స్ డ్ గా ఉన్నారనిపిస్తుంది. అయితే, వీరు స్కూల్ లో మంచి ప్రతిభ చాటాలంటే మాత్రం మరింత ప్లానింగ్, ఆర్గనైజేషన్ స్కిల్స్ అవసరం పడతాయి. 

1012

ధనుస్సురాశి  (Sagittarius) : వీరికి కుతూహలం చాలా ఎక్కువ. అందుకే టీచర్లకు బాగా నచ్చుతారు. అయితే కొన్నిసార్లు ఇది హద్దులు దాటి ప్రతీ విషయంలోనూ అదే స్వభావాన్ని చూపించడం టీచర్లకు విసుగును తెప్పిస్తుంది. 

1112
কুম্ভ রাশি (Aquarius)

కుంభరాశి (Aquarius) : చదువులో, గాసిపింగ్ లో ఏకసమయంలో ఉంటారు. అటు చదువుతుంటారు.. ఇటు ఎంజాయ్ చేస్తుంటారు. దీంతో టీచర్లకు పట్టుబడేవరకు వీరు మంచి విద్యార్థులుగానే ఉంటారు.

1212
Pisces

మీనరాశి (Pisces) : మీనరాశి పిల్లలు ప్రతీదాన్ని వాయిదా వేస్తుంటారు. ఈ అలవాటు కనుక మానుకుంటే వీరికి మించిన మంచి విద్యార్థులు క్లాస్ రూంలో మరొకరు ఉండరు. 

click me!

Recommended Stories