1.మేష రాశి..
ఈ రాశివారికి ఒకేసారి ఎక్కువ పనులు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఒత్తిడి గురౌతూ ఉంటారు. అలా ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ రాశివారు నిర్ణయాలు తీసుకోలేరు. పైగా తమ చుట్టూ ఉన్నవారు చేసే పనులను కూడా వీరు నమ్మలేరు.
212
telugu astrology
2.వృషభ రాశి..
జీవితంలో అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు, కొత్త సమస్యలు ఎదురైనప్పుడు వీరు ఒత్తిడికి గురౌతారు. ఈ సమస్యను పరిష్కరించడానికి వీరు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు.
312
telugu astrology
3.మిథున రాశి...
ఈ రాశివారికి జీవితంలో ఏ కొత్త సవాళ్లు ఎదురవ్వకుండా సాధారణంగా సాగిపోతే, అప్పుడు ఈ రాశివారు ఒత్తిడికి గురౌతారు.
412
telugu astrology
4.కర్కాటక రాశి..
తమ జీవితం తాము అనుకున్నట్లుగా ఉండటం లేదని, ఏదైనా తప్పు జరుగుతోంది అనిపించినప్పుడు ఈ రాశివారు ఎక్కువగా ఒత్తిడికి గురౌతారు.
512
telugu astrology
5.సింహ రాశి..
ఈ రాశివారు ఎప్పుడూ స్పాట్ లైట్ లో ఉండాలని కోరుకుంటారు. అలా తాము ఉండేలకపోతున్నాం. తమను ఎవరూ పట్టించుకోవడం లేదు అనుకున్నప్పుడు ఈ రాశివారు ఒత్తిడికి గురౌతారు.
612
telugu astrology
6.కన్య రాశి..
కన్య రాశివారు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా ఎక్కువగా ఆలోచించి లేని ఒత్తిడి తెచ్చుకుంటారు. ఎమోషన్స్ కూడా వీరికి ఎక్కువ. తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి మరీ వీరు ఎక్కువ సమస్య తెచ్చుకుంటారు.
712
telugu astrology
7.తుల రాశి..
ఈ రాశివారు తమను ఎవరూ పట్టించుకోవడం లేదు అని తెలిసినప్పుడు ఎక్కువ ఒత్తిడికి గురౌతారు. తమ లైఫ్ ని తాము మిస్ అయిపోయినట్లు వీరు ఫీలౌతారు.
812
telugu astrology
8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు తాము ఇష్టపడిన వారు తమను మోసం చేసినప్పుడు ఎక్కువ బాధపడతారు. అలా బాధపడి ఎక్కువగా ఒత్తిడికి గురౌతుంటారు.
912
telugu astrology
9.ధనస్సు రాశి..
ఎవరైనా ప్రతి విషయంలో తమపై అజమాయిషీ చేయడం, అన్నీ వారు చెప్పినప్పుడు ఈ రాశివారు ఎక్కువగా ఒత్తిడికి గురౌతుంటారు.
1012
telugu astrology
10.మకర రాశి..
తాము జీవితంలో ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నామని ఆలోచిస్తూ..లేని ఒత్తిడి తెచ్చుకుంటారు. తాము అనుకన్నది జరగనప్పుడు వీరు ఒత్తిడికి గురౌతుంటారు.
1112
telugu astrology
11.కుంభ రాశి..
కుంభ రాశివారు ఇతరుల గురించి కూడా ఆలోచించి ఒత్తిడి తెచ్చుకుంటూ ఉంటారు. ఈ రాశివారు తమవి కాని సమస్యల గురించి కూడా ఆలోచించి మరీ ఒత్తిడి తెచ్చుకుంటారు.
1212
telugu astrology
12.మీన రాశి..
ఈ రాశివారు చాలా ఎమోషనల్ పర్సన్స్. ప్రతి విషయం లోనూ అతిగా ఆలోచిస్తారు. ఈ ఎమోషన్స్ కారణంగా, ఈ రాశివారు ఒత్తిడి కి గురౌతూ ఉంటారు.