Solar Eclipse 2021:రేపే సూర్య గ్రహణం, భారత్ లో కనపడుతుందా..? గ్రహణ సమయంలో ఏం చేయకూడదు?

First Published Dec 3, 2021, 10:40 AM IST

ఈ సూర్య గ్రహణం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లోని అన్ని ప్రాంతాలతో కనపడనుంది. భారత కాలమాన ప్రకారం డిసెంబర్‌ 4న ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. 

ఈ ఏడాది మరో సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ   సూర్యగ్రహణం శనివారం( డిసెంబర్ 4)న ఏర్పడనుంది. కాగా.. ఈ ఏడాది ఇదే చివరి సూర్య గ్రహణం కావడం గమనార్హం.  అయితే.. ఈ సూర్య గ్రహణం... భారత్ లోని ఏ ప్రాంతంలోనూ కనపడదని నిపుణులు చెబుతున్నారు.
 

ఈ సూర్య గ్రహణం దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లోని అన్ని ప్రాంతాలతో కనపడనుంది. భారత కాలమాన ప్రకారం డిసెంబర్‌ 4న ఉదయం 10.59 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 3.07 గంటలకు ముగియనున్నది. 

డిసెంబర్ 4 సూర్యగ్రహణం సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణ పక్షంలోని మార్గశిర అమావాస్య తిథి (అమావాస్య రాత్రి) నాడు వస్తుంది. గ్రహణాలు చూడటానికి అందంగా ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది దీనిని అశుభకరమైన సంఘటనగా భావిస్తారు.

సూర్యగ్రహణం 2021 డిసెంబర్ 4న: సమయాలు 

డిసెంబర్ 4న ఉదయం 10.59 గంటలకు 12:30 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది, 

సంపూర్ణ గ్రహణం మధ్యాహ్నం 01:03 గంటలకు ప్రారంభమవుతుంది, 
గరిష్ట గ్రహణం మధ్యాహ్నం 1:36 గంటలకు ముగుస్తుంది. 

మధ్యాహ్నం 03.07 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది.
 

సూతకం అంటే ఏంటి..?

సూర్య గ్రహణానికి ముందు వచ్చే అశుభ సమయాన్ని సూతకం అంటారు. హిందువులు ఈ కాలంలో, సూతక్ సమయంలో భూమి వాతావరణం కలుషితమైందని , కాలుష్యం వల్ల ఎటువంటి హానికరమైన దుష్ప్రభావాలను నివారించడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని నమ్ముతారు.
 

సూతక కాలం...
దృక్ పంచాంగ్ ప్రకారం, సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు మొత్తం 8 ప్రహార్లు ఉన్నాయి. అందువల్ల సూర్యగ్రహణానికి 12 గంటల ముందు , చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతక కాలంగా భావిస్తారు.
 

గ్రహణ సమయంలో ఆహారం..
చాలా మంది గ్రహణ సమయంలో.. ఆహారం తీసుకోకూడదు అని అనుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణానికి ముందు పన్నెండు గంటల సమయంలో ప్రజలు ఆహారం తీసుకోకుండా ఉండాలి. అయితే, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, రోగులు , వృద్ధులు మాత్రం.. ఈ నియమానికి దూరంగా ఉండొచ్చు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో గ్రహణం కనిపించినప్పుడు మాత్రమే సూతకాన్ని పరిగణలోకి తీసుకుంటారు. రేపు శనివారం ఏర్పడుతున్న సూర్య గ్రహణం.. భారత్ లో కనపడదు కాబట్టి.. ఇది భారతీయులు పాటించాల్సిన అవసరం లేదు.
 

దృక్ పంచాంగ్ ప్రకారం, గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. రాహు , కేతువుల  దుష్ప్రభావాల కారణంగా, శిశువు వికలాంగులు అయ్యే ప్రమాదం ఉందని లేదంటే.. స్త్రీలకు గర్భస్రావవం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 


గ్రహణం రోజు చేయకూడని పనులు..
ఆయిల్ మసాజ్, నీరు తాగడం, మల,మూత్ర విసర్జన చేయడం, జుట్టు దువ్వడం, బ్రష్ చేయడం, లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం లాంటివి చేయకూడదు.

గ్రహణం వీడిన తర్వాత ఏం చేయాలంటే...
గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి, సూర్యగ్రహణానికి ముందు వండిన ఆహారాన్ని తీసుకోకూడదు. సూర్య గ్రహణం తర్వాత తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, గోధుమలు, బియ్యం, ఇతర తృణధాన్యాలు , ఊరగాయలు లాంటి వాటిని పారేయలేం కాబట్టి.. వాటిని తులసి ఆకులను జోడించడం ద్వారా రక్షించాలి. ప్రజలు బ్రాహ్మణులకు నైవేద్యాలు లేదా దానధర్మాలను కూడా చేయవచ్చు. ఇది వారికి ప్రయోజనాలు కలిగిస్తుంది. 

click me!