వారఫలితాలు తేదీ 3 డిసెంబర్ శుక్రవారం నుండి 9 డిసెంబర్ గురువారం 2021

First Published Dec 3, 2021, 9:15 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి  ఈ వారం ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిపరివిధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాగలవు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగాలలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో  మానసిక అశాంతి. బంధువులతో మాటపట్టింపులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు మరింతగా దగ్గరవుతారు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనయోగం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కళారంగం వారికి విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో వృథా ధనవ్యయం. ఇంటాబయటా సమస్యలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో వ్యతిరేకత పెరుగుతుంది. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కొన్ని డాక్యుమెంట్లు జాగ్రత్తపరచుకోండి. ఆర్థిక విషయాలలో కొంత ఆందోళన తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం పనులు సమయానికి పూర్తి చేస్తారు.  మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అనుకూల పరిణామాలు. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం యత్నకార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికంగా మరింత బలపడి ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో  బంధువిరోధాలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యలు తీరతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఊహించనిరీతిలో బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబసమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాల సాధనలో కుటుంబసభ్యులు చేయూతనందిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష గుర్తింపు. వారం మధ్యలో మిత్రులతో విరోధాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలకు మరింత పదను పెడతారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మరింత సానుకూలంగా పూర్తి కాగలవు. సోదరులతో వివాదాలు కొలిక్కి వస్తాయి, సఖ్యత కోసం చేసే యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. గృహ, వాహనయోగాలు ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులు విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల చిరకాల కోరిక నెరవేరే సమయం. వారం ప్రారంభంలో వృధా ధనవ్యయం. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
click me!