2026 Horoscope: కొత్త ఏడాదిలో తొలిరోజే శుభ యోగం, ఈ 4 రాశులకు మొదటిరోజు నుంచే అదృష్టం

Published : Dec 10, 2025, 11:25 AM IST

2026 Horoscope: కొత్త సంవత్సరం 2026 జనవరి 1న బుధుడు, నెప్ట్యూన్ గ్రహాల వల్ల శుభ సంయోగం ఏర్పడుతోంది. దీని వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం దక్కుతుంది. వీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. 

PREV
15
కొత్త ఏడాదిలో తొలి శుభయోగం

పంచాంగం ప్రకారం 2026 జనవరి 1 గురువారం సాయంత్రం 7:01 గంటలకు తొలి శుభయోగం ఏర్పడుతుంది. బుధుడు, నెప్ట్యూన్ ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల ఈ కోణీయ స్థానం శుభప్రదంగా ఉంటే చాలు కొన్ని రాశుల వారికి కలిసివస్తుంది. దీనిని సంకోణ యోగం అని పిలుస్తారు. అలాగే దీన్ని కేంద్ర దృష్టి యోగం అంటారు. జనవరి 1న ఏర్పడే ఈ శుభ యోగం వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.

25
వృషభ రాశి

వృషభ రాశి వారికి కొత్త ఏడాది మొదటి రోజు నుంచి శుభప్రదంగా ఉంటుంది. బుధ, నెప్ట్యూన్ గ్రహాల కలయిక వల్ల వీరికి సంపద, విజయాన్ని అందిస్తుంది. వీరికి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోను కూడా విపరీతంగా కలిసివస్తుంది.  ఈ రాశి వారి కుటుంబ, సామాజిక గౌరవం చాలా పెరుగుతుంది.  కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం.  పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఈ కాలం అనుకూలమైనది. అర్థాంతరంగా మిగిలిపోయిన పనులను మీరు పూర్తి చేస్తారు. భాగస్వామ్యంగా మొదలుపెట్టిన వ్యాపారాలు లాభాలను తెచ్చి పెడతాయి. మీరు అప్పుడప్పుడు ధ్యానం, యోగా వంటివి చేస్తే మంచిది.

35
సింహ రాశి

సింహ రాశి వారికి కొత్త ఏడాది మొదటి రోజు అదృష్టాన్నిస్తుంది. గ్రహాల కలయిక మీకు  కీర్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ వ్యాపారంలో విజయం అందుతుంది. ఆర్థిక లాభాలు రావడం మొదలవుతాయి. కొత్త అవకాశాలు మీకు ఎదురు వస్తాయి. కుటుంబం, సామాజిక జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. మీ నాయకత్వ నైపుణ్యాలు మీకెంతో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో  మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు స్నేహితులు, సహోద్యోగుల నుంచి సాయం లభిస్తుంది.

45
ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి జనవరి 1వ తేదీ ఎంతో అద్భుతమైన రోజు. బుధ, నెప్ట్యూన్ గ్రహాల కలయిక మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. విద్య, వ్యాపారం, కెరీర్‌లో ఎన్నో లాభాలు కలిగే ఛాన్స్ ఉంది.   వైవాహిక జీవితంలో కూడా అంతా కలిసివస్తుంది. లక్ష్యాలపై దృష్టి పెట్టి కష్టపడితే కచ్చితంగా కలిసివస్తుంది. కొత్త ప్రయత్నాలు ఏవైనా మీకు ఫలవంతమవుతాయి. కొత్త పెట్టుబడులు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. 

55
మీన రాశి

మీన రాశి వారికి  ఈ శుభ యోగం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభం, వ్యాపార విజయం దక్కి తీరుస్తాయి. సమాజంలో మీకెంతో గౌరవం పెరుగుతుంది. ప్రేమ, కుటుంబ జీవితంతో సంతోషం నిండి ఉంటుంది. మీకు  కళాత్మక పనుల వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. పాత గొడవలన్నీ పరిష్కారమవుతాయి. కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టులు మీకు బాగా కలిసివస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories