డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ నెలలో ప్రారంభం నుండి 20 వ తేదీ వరకూ ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందులు ఎదుర్కొనును. ఆశించిన విజయాలు చివరి నిమిషంలో చేజారును. ఆరోగ్యం కూడా అంతగా సహకరించదు. 21 వ తేదీ తదుపరి రావలసిన బాకీలు వసూలు అగును. ఆర్ధికంగా కొంత ఒత్తిడి తగ్గును. పని భారం కూడా తగ్గును. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందును. అదృష్టం కలసి వచ్చును. గృహనిర్మాణ పనులలో అడ్డంకులు తొలగిపోవును. చిరకాల వాంఛ నెరవేరుతుంది. 28, 29 తేదీలలో అపవాదులు ఎదుర్కొనుటకు సూచనలు కలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ నెలలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గును. నూతన వ్యాపార వ్యవహారాలు మాత్రం సమస్యలు కలిగించును.స్నేహ వర్గం నుండి ఆశించిన సహకారం ఉండదు. స్వతంత్రంగా వ్యవహారములు చక్కపెట్టుకోవాలి. స్నేహితులపై ఉన్న నమ్మకం దెబ్బతినును. ప్రముఖుల నుండి ఆహ్వావానాలు అందును. విద్యార్ధులకు కోరకున్న విద్యా ప్రవేశాలు లభిస్తాయి. పుణ్య క్షేత్ర సందర్శన ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొందురు. ఈ మాసంలో 9 నుండి 20 తేదీ మధ్యకాలం నిర్మాణ సంబంధ పనులు చేయుటకు అనువైన కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ నెలలో జీవితంలో నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విరామం లేకుండా వ్యవహారాలు పూర్తిచెయుదురు. శ్రమకు తగిన లబ్ది లభించును. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పెట్టుబడులు లభించును. నూతన భాగస్వాములు లభిస్తారు. భాగస్వాముల సలహాలు కలసి వచ్చును. పితృ వర్గ ఆరోగ్యం కోసం ఆందోళన పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందును. పుణ్య క్షేత్ర సందర్శన చేయుదురు. ఉద్యోగ మార్పిడికి సంబంధించిన సంతోషకర వార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు అనుకూలం. మొత్తం మీద మిధున రాశి వారికీ ఈ మాసం సంతోషకరంగానే ఉంటుంది. ఈ మాసంలో 4, 5, 8, 10 తేదీలలో చేపట్టే కార్యములు విజయవంతం అగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఎదుర్కొందురు. చివరి వారానికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. సంతాన ప్రయత్నాలు చేయువారు అశుభ వార్త తెలుసుకొను సూచనలు ఉన్నవి. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారాలలో నూతన సమస్యలు ఏర్పడును. ఒత్తిడి అధికమగును. నిద్రలేమితనం బాధిస్తుంది. ఆశించిన సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఈ మాసంలో మిత్రులతో సంభాషించునపుడు ఆచి తూచి మాట్లాడాలి. ఆర్ధిక పరంగా మిత్రులకు హామీలు ఇవ్వకూడదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ నెలలో వ్యక్తిగత జీవితంలో ఇతరుల ప్రమేయం వలన ఒక నష్టం ఏర్పడును. జీవిత భాగస్వామిపై అపోహలకు తావివ్వకండి. మాత్రు వర్గం వారికి కొద్దిపాటి అనారోగ్య సమస్య. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ధనార్జన ఆశించిన విధంగానే ఉండును. సంతానం యొక్క పురోగతి ఆనందాన్ని కలుగచేస్తుంది. ద్వితీయ తృతీయ వారాలాలో ఉద్యోగులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. చిన్న అవకాశాలు కూడా భవిష్యత్లో మంచి చేస్తాయి. అవకాశములను వదులుకోకండి. అతి తెలివితేటలు ప్రదర్శించుట, తర్కంగా ఆలోచించుట మంచిది కాదు. చివరి వారంలో రాజకీయ రంగంలోని వారికి పదవీయోగం ఉన్నది. ప్రయత్నాలు చేయండి. అనుకూలమైన శుభాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ నెలలో వ్యాపారాల వలన లాభకర పరిస్థితి. సంతాన లేమి దంపతుల సంతాన కోరిక నెరవేరును. పితృ వర్గం వారికి మంచిది కాదు. జీవితంపై ఆలోచనా దృక్పధం మారుతుంది. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగును. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉదార స్వభావం వలన పేరు లభిస్తుంది. చంచల స్వభావ మిత్రువర్గం వలన కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడును. వీరి వలన చేతికి వచ్చిన ఒక ఫలితమును పోగొట్టుకుంటారు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. చివరి వారంలో మాట తగాదాల వలన దూరమైనవారు తిరిగి దగ్గరవుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) వారికి :- ఈ నెలలో వ్యాపార వ్యవహరాదులలో ఆశించిన ఫలితాలు ఏర్పడుట కష్టం. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు ఎదుర్కొందురు. తోటి ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు. ఆర్ధిక అపవాదులు ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టంపై ఫలించును. వ్యాపార వ్యవహారములలో అననుకూల మార్పులు జరుగును. పుష్ప సంబంధ వ్యాపారం చేయువారికి జీవనాధారం దెబ్బతింటుంది. లభించిన అవకాశములతో తృప్తి పడవలెను. నాయకులకు పదవీభంగం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం.అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ధనాదాయం సామాన్యం. నూతన పనులు ఆరంభించకూడదు. నష్ట పరచును. భూ సంబంధ లేదా వారసత్వ సంబంధ విషయలాలో చికాకులు అధికం అగును. ద్వితీయ వారంలో సంతాన సంబంధ లాభం. ధనదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఏర్పడును. కుటుంబంలో చక్కటి అనుకూల వాతావరణం. ఆనందకర సమయం. నాలుగవ వారం ప్రారంభం నుండి మాసాంతం వరకూ చేతిలో ధనం నిలువదు. వృధా వ్యయం ఏర్పడును. తలపెట్టిన పనులలో ఊహించని చికాకులు. ప్రయాణమూలక ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ నెలలో వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తించును. భాగస్వామ్య వ్యవహారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి పొందుతారు. వృత్తి జీవనంలోని వారికి సులువైన ధన సంపాదన ఏర్పడును. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఏర్పడును. పై అధికారులతో మాట పడుదురు. శ్రమకు తగిన ఫలితం వుండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం అటంకములను పొందును. 26, 27, 28 తేదీలలో పెద్ద వయ్యస్కులకు హృదయ సంబంధ ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన. ఈ మాసంలో ధనాదాయం బాగుండును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు పశు,పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ నెలలో కొన్ని సోదరి వర్గ సంబంధ పనులకోసం విరామం లేకుండా శ్రమించవలసి వచ్చును. నూతన విద్యలను అభ్యసించు అవకాశములు లభిస్తాయి. అవరోధములు ఎదుర్కొందురు. మానసిక వ్యధ కూడా అధికం అగును. భవిష్యత్ ఆందోళన అధికం అగును. అకాల భోజనములు చికాకులు కలుగ చేయును. పిల్లలకు శిరోబాధ లేదా కర్ణ సంబంధ సమస్యలు. వివాహ ప్రయత్నాలు కష్టం మీద జయం పొందును. ఉద్యోగ జీవనంలో ఉహించని ఆటంకములు ఏర్పడును. దురుసు, కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోని ప్రవర్తించుట మంచిది. వృత్తి వ్యపారములందు మొత్తం మాసం మీద ధనాదాయం కొంత తగ్గును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ నెలలో కుటుంబ పరిస్టితులు మెరుగుపడును. భాగస్వామ్య వ్యాపారములు ఆర్ధికంగా వివాదాలను కలుగచేయును. తోదరపడి భాగస్వామ్య వ్యాపారములందు పెట్టుబడులు పెట్టుట మంచిది కాదు. ద్వితీయ వారం లోపున వాయిదా పడుతూ వస్తున్న ఇష్ట దైవ సందర్శన ఏర్పడును. పారమార్ధిక చింతన అలవరచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారములు మినహా మిగిలిన రంగాల వారికి ఆర్ధిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులకు రుణ విషయములందు వ్యక్త్రిగత హామీలు ఇవ్వకండి. ఈ మాసంలో చేయు వివాహ , సంతాన ప్రయత్నములు లాభించును. పుత్ర సంతానమునకు ఈ మాసం అనుకూలమైన కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ నెలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో పోటీ, పెరిగి ఆదాయంలో తగ్గుదల ఏర్పడుతుంది. తల్లితో లేదా మాతృ వర్గీయులతో విభేదాలు భాదించును. ఉద్యోగ జీవనంలో 22,23,24,25 తేదీలలో ఉన్నత అధికారుల వలన ఇబ్బందులు. కెరీర్ కు సంబందించిన ఆందోళన అధికం అగును. ఉద్యోగ మార్పు కొరకు ప్రయత్నించుట మంచిది కాదు. వైద్య రంగంలో ధనార్జన చేయువారు 22 నుండి 26 వ తేదీల మధ్య కాలంలో జాగ్రత్తగా ఉండవలెను. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సహిత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.