Ugadi 2022: స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం.. వృశ్చిక రాశి జాతకం

First Published Apr 1, 2022, 11:34 AM IST

స్వస్తి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం లో వృశ్చిక రాశివారికి సంవత్సరమంతా రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. 
 

SCorpio

ఈ జాతకాన్ని ప్రముఖ జోతిష్య నిపుణులు  గొల్లపెల్లి సంతోష్ కుమార్ శర్మ తెలియజేశారు.
ఓం శ్రీ సాయి జ్యోతిష విద్యాపీఠం, ధర్మపురి, జగిత్యాల జిల్లా.
https://www.onlinejyotish.com

Scorpio

ఉద్యోగం
 ఈ సంవత్సరం, వృశ్చిక రాశిలో జన్మించిన వారికి, ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మధ్యలో శని గోచారం, సంవత్సరమంతా గురుగోచారం అనుకూలంగా ఉండటం వలన మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కొన్నిసార్లు వృత్తి విషయంలో ఎక్కువగా ఆందోళనకు, భయానికి గురవటం వలన ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చేయకండి. అది మీ వృత్తిలో మీ సహోద్యోగులతో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం, సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు వృత్తి విషయం లో ఉండే ఆందోళన తొలగిపోవడమే కాకుండా పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి, ఉద్యోగంలో మంచి మార్పు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా దాని ద్వారా లాభాలు కూడా అందుకోగలుగుతారు. మీ ఆలోచనలకు, మీ ప్రణాళికలకు పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా లేక పోవటం వలన వృత్తిలో అభివృద్ధి తో పాటుగా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. జూలైలో శని తిరిగి మూడవ ఇంటికి రావడంతో ఈ పని ఒత్తిడి తగ్గి వృత్తిలో అనుకూలమైన సమయం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండా సంవత్సరమంతా రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులు నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. గతంలో మీకు చెడు చేయాలని చూసిన, లేదా చెడు చేసిన వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపం పొందుతారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ సంవత్సరం విదేశీ యానం కొరకు ప్రయత్నిస్తున్న వారికి సంవత్సర మధ్యలో అనుకూలమైన ఫలితం లభిస్తుంది. 

Scorpio

 ఆర్థిక స్థితి
 మీకు ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.  సంవత్సరం మధ్యలో శని గోచారం బాగుండటం సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం బాగుండటం వలన మీ ఆదాయం మెరుగు పడుతుంది.  అంతేకాకుండా గతంలో చేసిన అప్పులు తీర్చగలుగుతారు.  ఈ సమయంలో ఖర్చులు ఉన్నప్పటికీ వాటికి తగిన ఆదాయం సమకూర్చుకో గలుగుతారు. గురు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం పెట్టిన పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు పెరుగుతాయి.  గురు దృష్టి లగ్నం పై,  లాభ స్థానం పై మరియు  భాగ్య స్థానంపై ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది.  మీరు పెట్టిన పెట్టుబడి నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ఇల్లు కాని,   వాహనం కానీ కొనాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు  తీసుకునే నిర్ణయాలు కానీ,  చేసే ఆలోచన కానీ సరైన ఫలితాలనిచ్చే ఆర్థికంగా సాధించేలా చేస్తుంది.  గతంలో ఏర్పడిన నష్టాలకు తగిన ఆదాయం రావడంతో ఆ నష్టాలు  పూరించబడతాయి. రాహు గోచారం ఆరవ ఇంట అనుకూలంగా ఉండటం వలన కోర్టు కేసులలో,  వారసత్వ  వివాదాలలో  విజయం సాధించడం వలన  ధన లాభం కానీ,  స్థిరాస్తులు కానీ లభిస్తాయి.  బ్యాంకు లోను కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ,  ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ ఈ సమయంలో వారి అవసరాలకు తగిన డబ్బు లభిస్తుంది. కేతు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.  అలాగే ఆరోగ్య విషయంగా కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. 

scorpions

కుటుంబం
 ఈ సంవత్సరం, కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు గోచారం ఐదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం, సంవత్సరం మధ్యలో శనిగోచారం, సంవత్సరమంతా రాహు  గోచారం ఆరవ ఇంటిలో ఉండటం వలన కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి.  భార్యాభర్తల మధ్య,  కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు  తొలగిపోయి గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సంతానం అభివృద్ధి లోకి వస్తుంది.  మీ పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి.  ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవటం,   సంతానం కానీ వారికి సంతానం అవటం జరుగుతుంది.  కుటుంబ పరంగా  కోర్టు కేసులు కానీ, వివాదాలు కానీ ఉన్నవారికి ఈ సంవత్సరం లో విజయం లభిస్తుంది.  సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం నాలుగవ ఇంటిలో  ఉండటం వలన కుటుంబంలో సమస్యలు రావడం కానీ, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం దెబ్బతినటం కానీ జరగవచ్చు. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే తగ్గిపోతాయి. మీలో ఆధ్యాత్మికత, దైవ చింతన ఈ  సంవత్సరంలో ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, గురు దర్శనం కానీ చేసుకుంటారు.  అంతే కాకుండా, ఈ సమయంలో మీరు గురు ఉపదేశం పొందడం కానీ,  లేదా కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ చేస్తారు. 

Scorpio

ఆరోగ్యం
 ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.  గత సంవత్సర కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శారీరక,  మానసిక ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి.  సంవత్సరమంతా గురు మరియు  రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఉండవు.  సంవత్సర ఆరంభంలో మరియు చివరలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన, కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎముకలు, ఊపిరితిత్తులు మరియు ఉదరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. కేతు గోచారం కారణంగా  కొన్నిసార్లు శారీరక ఆరోగ్య సమస్యల కంటే,  మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడతాయి.  ముఖ్యంగా లేని భయాలను ఊహించుకోవటం,  లేని రోగాలు ఉన్నవిగా భావించి భయపడటం చేస్తారు.  అంతే కాకుండా ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం వలన అనవసరమైన సమస్యలకు లోనవుతారు.  కాలేయం,  వెన్నెముక,  మూత్రపిండాలు మొదలైన సంబంధించి సాధారణ సమస్యలు ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమస్యలను పెద్దగా ఊహించుకొని,   ఎక్కువ మందులు వాడటం కానీ,  ఎక్కువమంది వైద్యులను సంప్రదించడం కానీ చేస్తారు.  దాని వలన అనవసరమైన ఆందోళనకు గురి అవుతారు. సంవత్సరమంతా గురు దృష్టి లగ్నం పై ఉండటం, రాహు గోచారం 6వ ఇంట ఉండటం వలన మీలో ధైర్యం పెరగడమే కాకుండా,  మానసిక ఆందోళనలు పూర్తిగా తగ్గుముఖం పడతాయి.  సరైన వైద్యం అందడం కానీ,  సరైన సలహాలు పాటించడం కానీ చేయడం వలన తొందరగా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిగతా సంవత్సరమంతా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా బాధించవు .

scorpio

వ్యాపారం మరియు స్వయం ఉపాధి
 వృశ్చికరాశిలో జన్మించిన వ్యాపారస్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.  గత కొద్ది కాలంగా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న మీకు  ఈ సంవత్సరం గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపార విషయంగా గతంలో ఉన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి.  సంవత్సరం మధ్యలో శనిగోచారం వ్యతిరేకంగా ఉన్న కారణంగా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవటం కానీ, కొత్త ప్రదేశంలో ప్రారంభించిన వ్యాపారాన్ని కొంతకాలం ఆపాల్సిరావటం కానీ జరగవచ్చు. సంవత్సరమంతా గురు మరియు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ రిస్కు చేయటం మంచిది కాదు.  ఆరవఇంట రాహు సంచారం కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి.  వ్యాపార సంబంధ వివాదాలు కానీ,  కోర్టు కేసులు గాని మీకు అనుకూలంగా ముగుస్తాయి.  మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునే వారు, మోసం చేయాలనుకునేవారు నష్టపడతారు.  గురు దృష్టి లాభ స్థానం పై మరియు భాగ్య స్థానం పై ఉండటం వలన పెట్టిన పెట్టుబడులు, మీరు చేసిన శ్రమకు, అదృష్టం కలిసి వచ్చి  వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు అనుకునేవారు,  లేదా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకునే వారు జూలై వరకు ఆగటం మంచిది.   దాని వలన నష్టపోయే అవకాశాలు తక్కువ అవుతాయి. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించేవారు,  కళాకారులు ఈ సంవత్సరం మంచి అవకాశాలను పొందుతారు.  గత కొద్ది కాలంగా సరైన అవకాశాలు గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్న మీకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది.  ముఖ్యంగా  గురు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ సృజనాత్మకతకు,  మీ అదృష్టం తోడై మీకు ఆర్థిక లాభాలతో పాటుగా మంచి గుర్తింపు లభిస్తుంది.  అంతేకాకుండా ఈ సంవత్సరం సన్మానాలు, సత్కారాలు పొందుతారు.   రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీ వృత్తిలో చాలా కాలం నుంచి చేయాలనుకున్న పనులను విజయవంతంగా చేయడమే కాకుండా ప్రజల మన్ననలు కూడా అందుకుంటారు.  మీ కళకు, నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సంవత్సరం మధ్య కాలంలో మధ్య కాలంలో  శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మీ పని విషయంలో ఎక్కువ  కష్టపడడం  వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.  వచ్చిన అవకాశాల్లో మంచి వాటిని మాత్రమే ఎన్నుకొని,  తగిన విశ్రాంతి కూడా తీసుకుంటే  ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. 

Scorpio

పరిహారాలు
 ఈ సంవత్సరం  శని మరియు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ రెండు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది.   కేతువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు గణపతి స్తోత్రం చదవడం మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.  ఏప్రిల్ నుంచి జులై మధ్యలో శని గోచారం నాలుగవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజూ శని స్తోత్ర పారాయణం చేయటం  కానీ, హనుమాన్ చాలీసా పారాయణం కానీ మంచిది.  దీని వలన  ఈ సమయంలో వృత్తిలో వచ్చే సమస్యలు,   ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు  ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది.  పైన చెప్పిన పరిహారములు మీ శక్తి,  భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

click me!