Vruschika Rasi 2024: న్యూ ఇయర్ లో వృశ్చిక రాశివారు ఆర్థికంగా బలపడనున్నారు..!

Published : Dec 22, 2023, 02:59 PM IST

మనమంతా మరికొద్దిరోజుల్లో 2024లో కి అడుగుపెట్టబోతున్నాం. మరి న్యూ ఇయర్ లో వృశ్చిక రాశివారికి  ఆకస్మిక లాభాలు కనపడతాయి. 13.4.2024 నుండి వత్సరాంతం వరకు  కొంతవరకూ  పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.  అయితే అధికారులతో గౌరవింపబడతారు.  

PREV
14
Vruschika Rasi 2024: న్యూ ఇయర్ లో వృశ్చిక రాశివారు ఆర్థికంగా బలపడనున్నారు..!
For Scorpios 01


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

వృశ్చికం  రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం (2024 జనవరి నుంచి 2024 డిసెంబర్) ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఏయే నెలలు కలిసి వస్తుంది...ఎప్పుడు  ఇబ్బందులు ఉంటాయి ... రాశి వార్షిక ఫలాలు లో తెలుసుకుందాం

24
For Scorpios 02

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు
 (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

గురు:- ఏప్రిల్ నెల వరకు షష్టమ స్థానంలో సంచరించి మే నెల నుండి కళత్ర స్థానంలో సంచారము.

శని:- ఈ సంవత్సరమంతా చతుర్ధ  స్థానంలో సంచారము.

రాహు:-ఈ సంవత్సరమంతా  పంచమ స్థానంలో సంచారము.

కేతు:-ఈ సంవత్సరమంతా లాభ స్థానంలో సంచారము.

34

గత కొంత కాలముతో పోల్చుకుంటే వృశ్చిక  రాశి వారికి 2024 సంవత్సరం కెరీర్ పరంగా అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి కలుగును. మొత్తం మీద వృశ్చిక  రాశివారికి 2024 సంవత్సరం కెరీర్‌పరంగా అనుకూల ఫలితాలు కలిగించును.ఇక మీరు ఈ సంవత్సరం అంతా  మిక్కిలి ధైర్య, సాహసాలు ప్రదర్శిస్తూంటారు. సూక్ష్మబుద్ధితో తెలివితో  విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ శక్తి,సామర్ద్యాలను ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా అయ్యిపోతాయి. ఈ క్రమంలో ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలు కనపడతాయి. 13.4.2024 నుండి వత్సరాంతం వరకు  కొంతవరకూ  పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.  అయితే అధికారులతో గౌరవింపబడతారు.

44

శని ఈ సంవత్సరమంతా చతుర్ధ  స్థానంలో సంచారము వలన ప్రయాణాల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఈ క్రమంలో ఆకస్మిక ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనా రోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. దైవదర్శనం ఉంటుంది. 16 .4.2024  నుండి వత్సరాంతం వరకు శుభుడైనందున శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుం టారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి.  వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అయితే ఈ క్రమంలో అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. 

అలాగే సెప్టెంబర్ నుంచి ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. సంవత్సరం చివర్లో కుటుంబంలో సంతోషం. పేరుప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణం. ఆర్థిక పరిస్థితిలో మార్పులుం టాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.అలాగే    మీ ప్రియమైన వారితో కొన్ని అపార్థాలు, తగాదాలు ఉండొచ్చు. ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి. మాట్లాడే సమయంలో చాలా కఠినంగా లేదా దూకుండా ఉండకండి. ఇలా చేయడం వల్ల మీ సంబంధాలు దెబ్బతింటాయి. ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. అవివాహితులు మంచి వివాహ భాగస్వామిని పొందే అవకాశం ఉంటుంది.  వివాహితులు  రొమాంటిక్ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు. ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి.  ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.


 

click me!

Recommended Stories