Saturn Transit: రాత్రికి రాత్రే ఈ రాశులవారు కోటీశ్వరులు అవ్వడం పక్కా

శని మీన రాశి సంచారం మొదలైంది.  ఈ శని సంచారం ఆరు రాశులను కోటీశ్వరులను చేయనుంది. ఇంతకాలం వారు పడిన కష్టాలన్నీ తీరిపోనున్నాయి. సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు వీరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూసేద్దామా..

Saturn transit 2025 these 6 zodiacs become rich overnight big luck

మీన రాశి లోకి శని దేవుడి సంచారం ఆల్రెడీ మొదలైంది. ఇప్పటి నుంచి దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు మీన  రాశిలోనే ఉంటుంది. అయితే.. దీని ప్రభావం ఎక్కువగా ఈ సంవత్సరంలోనే ఉంటుంది.  ఈ ప్రభావం కొన్ని రాశులకు కష్టాలు తెస్తే.. ఆరు రాశులకు మాత్రం అదృష్టాన్ని తెస్తుంది. వృషభ , మిథున, తుల రాశులతో పాటు.. శని సొంత రాశులైన మకర, కుంభ రాశులకు కూడా మేలు చేయనుంది. మరి, ఏ విషయంలో ఈ రాశులకు కలిసి వస్తుందో చూద్దాం..

1.వృషభ రాశి..

వృషభ రాశి అంటే శని దేవుడికి చాలా ఇష్టం. ఈ రాశి వారికి శని గ్రహం చాలా శుభప్రదం. ప్రస్తుతం శని దేవుడు ఈ రాశి వారికి మంచి స్థానంలో సంచారం చేయడం మొదలు పెట్టాడు. దీని వల్ల కెరీర్ పరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు విదేశాల్లో ఉద్యోగం చేసే కల నెరవేరుతుంది. జీతం, ఇతర ప్రోత్సాహకాలు బాగా పెరుగుతాయి. చాలా రకాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
 


మిథున రాశి..
మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి మిత్రుడైన శని గ్రహం ప్రస్తుతం ఈ రాశికి పదో ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని వల్ల మీ కెరీర్ కొత్త శిఖరాలకు చేరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వేగంగా ఎదుగుతారు. పని మీద విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్ద వాళ్ళతో అనుబంధం పెరుగుతుంది. మంచి ఉద్యోగానికి మారే అవకాశం ఉంది.
 

3.కన్య రాశి..

కన్యా రాశికి అధిపతి బుధుడు. బుధుడికి మిత్రుడైన శని గ్రహం ఈ రాశికి ఏడో ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీని వల్ల ఆదాయం, అధికారం విషయంలో చాలా అభివృద్ధి ఉంటుంది. సెలబ్రిటీలతో దగ్గరి సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయంగా కూడా పలుకుబడి పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. చాలా రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ధనవంతుల కుటుంబానికి చెందిన వారితో ప్రేమలో పడే అవకాశం ఉంది లేదా నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది.
 

తుల రాశి..

తులా రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడికి దగ్గరి స్నేహితుడు శని. ఈ రాశి వాళ్ళు చెడు స్థానంలో ఉన్నా యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం ఈ రాశికి ఆరో స్థానంలో శని ఉండటం వల్ల ఆర్థిక సమస్యల నుంచి కాపాడే అవకాశం ఉంది. చాలా రకాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. 

మకర రాశి..

మకర రాశిని శని దేవుడు పాలిస్తాడు. కాబట్టి శని ఈ రాశి వాళ్ళని చాలా రకాలుగా కాపాడుతాడు. సాధారణంగా చంద్రుడు ఉన్న రోజున శని ప్రభావం ఈ రాశి మీద చాలా తక్కువగా ఉంటుంది. శని ఈ రాశి వాళ్ళ ఆదాయాన్ని బాగా పెంచుతాడు. ఆదాయం పెరగడానికి చాలా అవకాశాలు వస్తాయి. మీ పనిలో ఉన్నత పదవులు వస్తాయి. మంచి ఉద్యోగం కోసం వేరే చోటుకి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. అనారోగ్యం వచ్చే అవకాశం లేదు.
 

కుంభ రాశి..

కుంభ రాశి వాళ్ళని శని పాలిస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు నష్టం కంటే లాభాన్ని ఎక్కువగా పొందుతారు. ఆదాయానికి లోటు ఉండదు. సొంత ఇల్లు కొనుక్కునే కల నెరవేరుతుంది. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం ఉంది. మీకు పూర్వీకుల ఆస్తి వస్తుంది. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి విదేశాల్లో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
 

Latest Videos

click me!