Zodiac Signs : సూర్యుని వల్ల శనికి రెట్టింపు బలం, ఈ మూడు రాశులకు విపరీతంగా కలిసొచ్చే అవకాశం

Published : Sep 18, 2025, 04:39 PM IST

శని, సూర్యుడు (Sun) రెండు ప్రధానమైన గ్రహాలు. సూర్యుడి వల్ల శని దేవుడు (Saturn) రెట్టింపు బలం పొందబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారు (Zodiac Signs) మంచి ఫలితాలను పొందబోతున్నారు. వీరికి ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా కలిసివస్తుంది. 

PREV
15
శక్తివంతమైన గ్రహం శనిదేవుడు

నవగ్రహాలలో శని అత్యంత శక్తివంతమైన గ్రహం. మనం చేసే తప్పొప్పులకు తగ్గ కర్మ ఫలితాలను ఇచ్చేది అతడే. ఇది నెమ్మదిగా కదిలే గ్రహం. శనిగ్రహం ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఫలితంగా ఆ రాశులపై శని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం శని మీనరాశిలో వక్ర స్థితిలో సంచరిస్తున్నాడు. ఈ స్థితిలో గ్రహాల రాజు అయిన సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యారాశిలోకి ప్రవేశించాడు.

25
శని, సూర్యుడు కలయిక

శని, సూర్యుడిని శత్రు గ్రహాలుగా చెప్పుకుంటారు. శనిపై సూర్యుని దృష్టి పడటంతో శని రెట్టింపు బలాన్ని పొందుతాడు. అక్టోబర్ 17 వరకు శని గ్రహం అక్కడే ఉంటాడు. ఫలితంగా, కొన్ని రాశుల వారు ప్రతి రంగంలో గొప్ప విజయం, ఆర్థిక లాభాలు పొందబోతున్నారు. ఏ రాశులకు ఇది కలిసి వస్తుందో తెలుసుకోండి.

35
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ కాలంలో అంతా మంచే జరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహ సంబంధాలు కుదరవచ్చు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, వృత్తిపరమైన అభివృద్ధి పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, పదోన్నతి దక్కే అవకాశం ఉంది.  ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

45
తులా రాశి

తులారాశి వారికి అనేక రంగాల్లో కలిసొచ్చే కాలం ఇది. మీ సంపద పెరిగేందుకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో పురోగతి, కొత్త పెట్టుబడులలో విజయం, సమాజంలో గౌరవం కూడా పెరుగుతాయి. శని న్యాయం, సూర్యుని శక్తి కలిసి నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం మీకు దక్కుతుంది.

55
మకర రాశి

మకర రాశి వారికి శని వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. నిలిచిపోయిన పనులు ప్రారంభం కావచ్చు. ఇది వారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. వృత్తి, కుటుంబ జీవితం, ఆర్థిక స్థిరత్వం అన్నింటిలోనూ పురోగతి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories